బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ధీరజ్

26 articles

ఆదాయపు పన్ను శాఖ పేరుతో వాట్సాప్ నకిలీ నోటీసులు – ఎస్పీ హెచ్చరిక
జిల్లా వార్తలు

ఆదాయపు పన్ను శాఖ పేరుతో వాట్సాప్ నకిలీ నోటీసులు – ఎస్పీ హెచ్చరిక

అన్నమయ్య జిల్లా మదనపల్లి పరిధిలో ఆదాయపు పన్ను శాఖ పేరుతో వాట్సాప్‌లో నకిలీ నోటీసులు పంపిస్తున్న ఘటనలపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తెలియని నంబర్ల నుండి వచ్చే సందేశాల్లోని లింకులు, .zip, .exe ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని, ఆదాయపు పన్ను శాఖ వాట్సాప్ ద్వారా నోటీసులు పంపదని స్పష్టం చేశారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని, www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.

6, ఆగ 2026

రోడ్డు ప్రమాదాల నివారణకు అన్నమయ్య జిల్లాలో సమగ్ర చర్యలు
జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదాల నివారణకు అన్నమయ్య జిల్లాలో సమగ్ర చర్యలు

అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా రోడ్డు భద్రతా కమిటీ ఆధ్వర్యంలో మదనపల్లె కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పాదచారుల రక్షణ, బ్లాక్ స్పాట్స్‌లో సంయుక్త తనిఖీలు, ట్రామా కేర్ సెంటర్, రెస్ట్ సెంటర్లు, ట్రాఫిక్ నిబంధనల కఠిన అమలు, ‘రహ్ వీర్లు’ సత్కారం వంటి చర్యలను సూచించారు.

5, ఆగ 2026

5 కోట్ల విలువైన భూమి పేరుతో మోసం: ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్
జిల్లా వార్తలు

5 కోట్ల విలువైన భూమి పేరుతో మోసం: ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 5 కోట్ల విలువైన 2.52 ఎకరాల భూమి పేరుతో నకిలీ పాస్ పుస్తకాలతో మోసం చేసిన ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు పొన్నంరెడ్డి శోభారాణి ఫిర్యాదు ఆధారంగా మోసం, నకిలీ పత్రాల సృష్టి కేసు నమోదు చేసి, నిమ్మనపల్లె వద్ద నిందితులను పట్టుకుని నకిలీ పాస్ పుస్తకాలు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

2, ఆగ 2026

విద్యార్థినుల భద్రతకు డ్రోన్ల నిఘా: ఆకతాయిలకు చెక్ పెట్టేందుకు అన్నమయ్య జిల్లా పోలీసులు
జిల్లా వార్తలు

విద్యార్థినుల భద్రతకు డ్రోన్ల నిఘా: ఆకతాయిలకు చెక్ పెట్టేందుకు అన్నమయ్య జిల్లా పోలీసులు

అన్నమయ్య జిల్లాలో విద్యార్థినుల భద్రత కోసం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలపై పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా చేపట్టారు. శక్తి బృందాలు, బ్లూ కోల్ట్స్ సంయుక్తంగా స్కూల్ జోన్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో నిఘా నిర్వహిస్తూ ఆకతాయిలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

29, జులై 2026

"డ్రగ్స్ వద్దు బ్రో", "పల్లె బాటలో ఈగల్" అవగాహన కార్యక్రమాలు
జిల్లా వార్తలు

"డ్రగ్స్ వద్దు బ్రో", "పల్లె బాటలో ఈగల్" అవగాహన కార్యక్రమాలు

అన్నమయ్య జిల్లా పెద్దమండ్యంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో "డ్రగ్స్ వద్దు బ్రో", "పల్లె బాటలో ఈగల్" అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు, మహిళా భద్రతపై ప్రజలకు వివరించారు. ఎస్‌ఐ హరిహర ప్రసాద్ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ మోసాలు, మహిళలు, పిల్లలపై నేరాల సమయంలో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, గంజాయి, డ్రగ్స్ విక్రయాలపై "ఈగల్" టోల్ ఫ్రీ 1972కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

26, జులై 2026

అన్నమయ్య జిల్లాలో రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
జిల్లా వార్తలు

అన్నమయ్య జిల్లాలో రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు ప్రారంభించి, ప్రతి శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపేవారు, మద్యం సేవించి వాహనాలు నడిపేవారు, మైనర్లకు వాహనాలు ఇచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం, వేగ పరిమితి పాటించడంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.

26, జులై 2026

అన్నమయ్య జిల్లాలో గంజాయి, సైబర్ నేరాలపై పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
జిల్లా వార్తలు

అన్నమయ్య జిల్లాలో గంజాయి, సైబర్ నేరాలపై పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పోలీసులు గంజాయి వినియోగం, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ గేమ్స్, సోషల్ మీడియా దుష్ప్రభావాలపై గ్రామాల స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువతలో మాదకద్రవ్యాల వ్యసనం, ఆన్‌లైన్ మోసాలు, రహదారి భద్రత, మహిళలు–పిల్లల రక్షణ చట్టాలపై ప్రజలకు సూచనలు ఇస్తూ, నేరరహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం కోరుతున్నారు.

25, జులై 2026

అన్నమయ్య జిల్లాలో రాత్రి ప్రత్యేక నిఘా, గస్తీ ముమ్మరం
జిల్లా వార్తలు

అన్నమయ్య జిల్లాలో రాత్రి ప్రత్యేక నిఘా, గస్తీ ముమ్మరం

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నేరాల నివారణ, రోడ్డు భద్రత కోసం పోలీసులు రాత్రివేళ ప్రత్యేక నిఘా, గస్తీ, అదనపు చెక్‌పోస్టులు, వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను ముమ్మరం చేస్తున్నారు. రాత్రిపూట సంచరించే అనుమానితుల వేలిముద్రలు సేకరణ, సీసీ కెమెరాల సమీక్ష, "పేస్ వాష్ అండ్ గో" ద్వారా అవగాహన పెంపు వంటి చర్యలతో పాటు, ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద సమాచారం వెంటనే డయల్-100 లేదా 112కు ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

24, జులై 2026

అన్నమయ్య జిల్లాలో వెట్టిచాకిరీ, కార్మికుల అక్రమ రవాణా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు
జిల్లా వార్తలు

అన్నమయ్య జిల్లాలో వెట్టిచాకిరీ, కార్మికుల అక్రమ రవాణా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు

అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ వెట్టిచాకిరీ, కార్మికుల అక్రమ రవాణా నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టేందుకు మదనపల్లెలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించింది. అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి మానవ అక్రమ రవాణా ముఠాలపై నిఘా పెంచి, బాధితులను రక్షించి, నిందితులకు కఠిన శిక్షలు పడేలా పకడ్బందీ దర్యాప్తు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ప్రతినిధులు బాధితుల గుర్తింపు, దర్యాప్తు పద్ధతులు, న్యాయపరమైన పోరాటంపై మార్గనిర్దేశం చేశారు.

22, జులై 2026

మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కి నంద కిషోర్‌తో కొత్త సినిమా..
సినిమా

మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కి నంద కిషోర్‌తో కొత్త సినిమా..

యువ హీరో విశ్వక్ సేన్, ‘35 చిన్న కథ కాదు’తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నంద కిషోర్ తో కొత్త సినిమా చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నిర్మాతగా ధీరజ్ మొగిలినేని పేర్లు వినిపిస్తుండగా, ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ‘Cult’ అనే స్లాషర్ థ్రిల్లర్ చిత్రాన్ని కూడా రూపొందిస్తున్నాడు.

22, జులై 2026

ఇసుకనూతపల్లి పంచాయతీలో పోలీసుల అవగాహన కార్యక్రమం
జిల్లా వార్తలు

ఇసుకనూతపల్లి పంచాయతీలో పోలీసుల అవగాహన కార్యక్రమం

అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ పరిధిలోని ఇసుకనూతపల్లి పంచాయతీలో తాలూకా సీఐ కళా వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసుల అవగాహన కార్యక్రమం నిర్వహించి, గ్రామంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, యువతలో చెడు వ్యసనాల నివారణపై సూచనలు చేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం, విక్రయం, రవాణాపై అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 112 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి పోలీసులతో సహకరించి నేరాల నిర్మూలనకు తోడ్పడాలని ప్రజలను కోరారు.

18, జులై 2026

మదనపల్లెలో ట్రాఫిక్ సమస్యలపై ఎస్పీ ధీరజ్ తనిఖీ
జిల్లా వార్తలు

మదనపల్లెలో ట్రాఫిక్ సమస్యలపై ఎస్పీ ధీరజ్ తనిఖీ

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను సమీక్షించేందుకు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, రహదారులపై వాహనాల రద్దీ, పార్కింగ్, దుకాణాల ఆక్రమణలు, తోపుడు బండ్ల వల్ల కలుగుతున్న ఇబ్బందులను పరిశీలించారు. ఆక్రమణలను తొలగించాలని వ్యాపారులకు సూచిస్తూ, నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాల వినియోగం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

17, జులై 2026

ఆసియా నంబర్‌వన్‌గా భారత యువ ఆర్చర్‌ ధీరజ్‌
క్రీడలు

ఆసియా నంబర్‌వన్‌గా భారత యువ ఆర్చర్‌ ధీరజ్‌

భారత యువ ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవర పురుషుల రికర్వ్‌ విభాగంలో 225.5 పాయింట్లతో ఆసియా నంబర్‌వన్‌గా నిలిచి, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానం దక్కించుకున్నాడు. ప్రపంచకప్‌ స్టేజ్‌–3లో వ్యక్తిగత, మిక్స్‌డ్‌ స్వర్ణాలు అతడి ర్యాంక్‌ పెరుగుదలకు దోహదం కాగా, మహిళల కాంపౌండ్‌లో జ్యోతి సురేఖ నాలుగో ర్యాంకుకు, తానిపర్తి చికిత 52వ ర్యాంకుకు దిగజారారు.

15, జులై 2026

మదనపల్లెలో రూ.32.11 లక్షల నిషేధిత గుట్కా, కూల్ లిప్స్ స్వాధీనం
జిల్లా వార్తలు

మదనపల్లెలో రూ.32.11 లక్షల నిషేధిత గుట్కా, కూల్ లిప్స్ స్వాధీనం

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల అక్రమ విక్రయాలపై పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి, రూ.32.11 లక్షల విలువైన 26,760 ప్యాకెట్ల గుట్కా, కూల్ లిప్స్, చ్యూయింగ్ టొబాకో తదితర స్టాక్‌ను స్వాధీనం చేసుకుని గోదామును సీజ్ చేశారు. ఇబ్రహీం ట్రేడర్స్ యజమాని కాలగడ్డ నబీహాన్ అలియాస్ ఇబ్రహీంను అరెస్ట్ చేసి, COTPA చట్టం, BNS సెక్షన్ 318(4) కింద కేసు నమోదు చేసి, ఇలాంటి అక్రమ కేంద్రాలపై నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

13, జులై 2026

ప్రపంచకప్‌ స్టేజ్‌-4లో ధీరజ్‌, కీర్తి జంటకు నిరాశ
క్రీడలు

ప్రపంచకప్‌ స్టేజ్‌-4లో ధీరజ్‌, కీర్తి జంటకు నిరాశ

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-4లో రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో భారత జంట ధీరజ్‌ బొమ్మదేవర, కీర్తి కాంస్య పతక పోరులో ఇటలీ జంట రాబర్టా ఫ్రాన్సెస్కో, మెటో బొర్సాని చేత 3-5తో ఓడిపోయింది. ఒక దశలో ఆధిక్యంలో ఉన్నప్పటికీ కీలక సెట్లలో పొరపాట్లు చేయడంతో పతకం చేజారగా, ఈ ప్రదర్శన భవిష్యత్‌ అంతర్జాతీయ పోటీలకు విలువైన అనుభవాన్ని అందించనుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

13, జులై 2026

అన్నమయ్య జిల్లాలో గుట్కా, పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
జిల్లా వార్తలు

అన్నమయ్య జిల్లాలో గుట్కా, పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

అన్నమయ్య జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు విస్తృత దాడులు నిర్వహించి, మదనపల్లెలో గుట్కా గోడౌన్‌పై మెరుపుదాడి చేసి పెద్ద మొత్తంలో నిషేధిత పొగాకు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. సంబేపల్లి, పీలేరు పరిధిలో నాలుగు పేకాట స్థావరాలపై దాడులు చేసి 28 మందిని అదుపులోకి తీసుకుని రూ.80,690 నగదు, పేకాట సామగ్రిని జప్తు చేశారు. యువత భవిష్యత్తును దెబ్బతీసే మత్తు పదార్థాలు, జూదాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

12, జులై 2026

రహదారి ప్రమాదాల నివారణకు"స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో" కార్యక్రమం..
జిల్లా వార్తలు

రహదారి ప్రమాదాల నివారణకు"స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో" కార్యక్రమం..

అన్నమయ్య జిల్లా పోలీసులు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలపై రాత్రి వేళల్లో జరిగే రహదారి ప్రమాదాల నివారణకు “స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రధాన రహదారులపై వాహనాలను ఆపి డ్రైవర్లకు నిద్రమత్తు ప్రమాదాలను వివరించి, ముఖం కడుక్కోవడం, విశ్రాంతి తీసుకోవడం వంటి జాగ్రత్తలు సూచిస్తూ అవగాహన కల్పించడంతో ఈ వినూత్న చర్యకు డ్రైవర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

7, జులై 2026

నూతన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ధీరజ్ సేథ్
జాతీయం

నూతన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ధీరజ్ సేథ్

భారత సైన్యానికి నూతన అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరించారు. దేశ 31వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో.. కొత్త ఆర్మీ చీఫ్ కమాండ్ చేపట్టారు.

30, జూన్ 2026

‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్‌సిరీస్‌
సినిమా

‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్‌సిరీస్‌

‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ ఆవిష్కరణ హైదరాబాదులో జరగగా, విరాజ్‌ అశ్విన్‌ కథానాయకుడిగా వినోద్‌ గాలి దర్శకత్వంలో శరత్‌ చంద్ర నాయుడు నిర్మించిన ఈ సిరీస్‌ జులై 3 నుంచి ETV Winలో స్ట్రీమింగ్‌ కానుంది. బోయపాటి శ్రీను, సత్యదేవ్‌, విరాజ్‌ అశ్విన్‌ ఈ సిరీస్‌కి బలమైన కథ, భావోద్వేగాలు, హాస్యం ఉన్నాయని, మంచి కథలను అందించే ETV Win వేదిక నుంచి వస్తుండటంతో పెద్ద విజయాన్ని సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

28, జూన్ 2026

అన్నమయ్య జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా యు. సదాశివయ్య బాధ్యతల స్వీకరణ
జిల్లా వార్తలు

అన్నమయ్య జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా యు. సదాశివయ్య బాధ్యతల స్వీకరణ

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో స్పెషల్ బ్రాంచ్ కొత్త సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా నియమితులైన యు. సదాశివయ్య బాధ్యతలు స్వీకరించి, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని మర్యాదపూర్వకంగా కలిశారు. స్పెషల్ బ్రాంచ్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమని ఎస్పీ సూచిస్తూ, అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా, ముందస్తు సమాచార సేకరణలో నిర్లక్ష్యం లేకుండా అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు.

25, జూన్ 2026

డాలర్ల మాయలో రూ.21 లక్షలు కాజేసిన సైబర్‌ ముఠా
జిల్లా వార్తలు

డాలర్ల మాయలో రూ.21 లక్షలు కాజేసిన సైబర్‌ ముఠా

మదనపల్లెకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వి. మోహన్‌కుమార్‌ను 2.50 లక్షల డాలర్లు పంపిస్తామని నమ్మబలికి సైబర్‌ ముఠా రూ.21.37 లక్షలు మోసం చేసింది. ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులు అసోం రాష్ట్రానికి చెందిన సురజిత్‌ చేతియా, అహోట్లియన్‌ కైపెంగ్‌లను అరెస్టు చేసి, నగదు, మొబైల్‌ ఫోన్లు, బ్యాంకు పాసు పుస్తకాలు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకుని, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

24, జూన్ 2026

వారమంతా చోరీలు.. వారాంతం జల్సాలు
జిల్లా వార్తలు

వారమంతా చోరీలు.. వారాంతం జల్సాలు

మదనపల్లె పోలీసులు అంతర్రాష్ట్ర దొంగ షేక్‌ ఖాజాపీర్‌ (30)ను అరెస్టు చేసి, సుమారు రూ.6.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక, అనంతపురం, అన్నమయ్య జిల్లాలు, రాయచోటి నియోజకవర్గంలో కలిపి మొత్తం 47 చోరీ కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నట్లు ఎస్పీ ధీరజ్‌ వెల్లడించారు.

24, జూన్ 2026

భర్త గల్లంతు.. 20 ఏళ్లుగా న్యాయం కోసం భార్య పరితపన
జిల్లా వార్తలు

భర్త గల్లంతు.. 20 ఏళ్లుగా న్యాయం కోసం భార్య పరితపన

అన్నమయ్య జిల్లా పీజీఆర్‌ఎస్‌ సమావేశంలో చంద్రకళ అనే మహిళ తన భర్త దేవరాజ్‌ 2006లో గల్లంతైనప్పటి నుంచి 20 ఏళ్లుగా పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నానని వేదన వ్యక్తం చేశారు. భర్త మృతదేహం చూపించకుండా అత్తింటివారు కర్ణాటకలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెబుతున్నారని ఆమె ఎస్పీ ధీరజ్‌కు ఫిర్యాదు చేయగా, ఎస్పీ వివరాలు సేకరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

9, జూన్ 2026

బాధిత హోంగార్డుల కుటుంబాలకు అండగా అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ
జిల్లా వార్తలు

బాధిత హోంగార్డుల కుటుంబాలకు అండగా అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లిలో జరిగిన కార్యక్రమంలో విధి నిర్వహణలో మరణించిన ఐదుగురు హోంగార్డుల కుటుంబాలకు సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం చెక్కులను, పదవీ విరమణ పొందిన హోంగార్డు టి. శ్రీనివాసులుకు తోటి హోంగార్డులు విరాళంగా సేకరించిన రూ.2,23,650 చెక్కును అందజేశారు. హోంగార్డుల సేవలు అమూల్యమని, అవసర సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలవడం పోలీస్ శాఖ బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు.

5, జూన్ 2026

‘‘మ్యాడ్’’ తర్వాత రామ్ నితిన్‌కు మాస్ కాలేజ్ ఎంటర్‌టైనర్‌.. కాకినాడ బ్యాక్‌డ్రాప్‌తో కొత్త సినిమా
టాలీవుడ్

‘‘మ్యాడ్’’ తర్వాత రామ్ నితిన్‌కు మాస్ కాలేజ్ ఎంటర్‌టైనర్‌.. కాకినాడ బ్యాక్‌డ్రాప్‌తో కొత్త సినిమా

‘మ్యాడ్’తో గుర్తింపు తెచ్చుకున్న రామ్ నితిన్, కాకినాడలోని కాలేజ్ నేపథ్యంలో సాగే కొత్త యూత్ ఎంటర్‌టైనర్‌ను ప్రకటించారు. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. రామ్ నితిన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన రంగురంగుల కాలేజ్ ఫెస్ట్ పోస్టర్ మంచి బజ్ క్రియేట్ చేయగా, ఇది ఆయన కెరీర్‌లో కీలక చిత్రంగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

5, జూన్ 2026

జనాభా లెక్కల పేరిట సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ హెచ్చరిక
జిల్లా వార్తలు

జనాభా లెక్కల పేరిట సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ హెచ్చరిక

జనాభా లెక్కల పేరుతో కొత్త రకం సైబర్ మోసాలు జరుగుతున్నాయని హెచ్చరిస్తూ, ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ లింకుల ద్వారా ఆధార్, బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఇవ్వొద్దని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జిల్లా ప్రజలకు సూచించారు. ప్రభుత్వ అధికారులు ఎప్పుడూ ఫోన్ ద్వారా ఇలాంటి వివరాలు అడగరని స్పష్టం చేస్తూ, మోసపోతే వెంటనే 1930కు లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని, అప్రమత్తతతోనే సైబర్ నేరాలను అడ్డుకోవచ్చని ఆయన పిలుపునిచ్చారు.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters