చైనాలో మరోసారి కోవిడ్ కేసులు పెరుగుదల; ఇన్‌ఫ్లుయెంజాను దాటేసిన వ్యాప్తి వేగం

చైనాలో మరోసారి కోవిడ్-19 కేసులు పెరుగుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2026లో తొలిసారిగా కరోనా వైరస్ వ్యాప్తి ఇన్‌ఫ్లుయెంజాను దాటేసి అత్యంత వేగంగా వ్యాపిస్తున్న శ్వాసకోశ వ్యాధిగా నమోదైంది. అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది బాధితులకు స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని, గత ఏడాది పరిస్థితులతో పోలిస్తే ఈసారి వైరస్ ప్రభావం తక్కువగానే ఉందని చైనా ఆరోగ్య అధికారులు తెలిపారు.

చైనా డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సెంటర్ (CDC) విడుదల చేసిన వివరాల ప్రకారం జూలై 13 నుంచి 19 వరకు నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్-19 పాజిటివిటీ రేటు 16.3 శాతానికి చేరుకుంది. ఇది అంతకుముందు వారంతో పోలిస్తే 4.3 శాతం పాయింట్లు ఎక్కువ. అదే సమయంలో ఫ్లూ పాజిటివిటీ రేటు 12.6 శాతంగా నమోదైంది.

జూన్ 2026లో దేశవ్యాప్తంగా 79 వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 130 మంది పరిస్థితి విషమంగా మారగా, ఈ కాలంలో ఒక్క మరణం మాత్రమే నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చైనాలో Omicron‌కు చెందిన NB.1.8.1 variant ప్రధానంగా వ్యాపిస్తున్నట్లు CDC తెలిపింది. ఈ variant వ్యాప్తి సామర్థ్యం మధ్యస్థంగా ఉందని, ప్రస్తుతం ప్రజారోగ్యానికి అధిక ప్రమాదం కలిగించే కొత్త variants ఏవీ గుర్తించలేదని అధికారులు పేర్కొన్నారు.

కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మందికి జ్వరం, గొంతునొప్పి, అలసట వంటి స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని, సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజుల్లో కోలుకుంటున్నారని వారు తెలిపారు. తీవ్రమైన కేసులు లేదా మరణాల్లో అసాధారణ పెరుగుదల లేదని, ప్రస్తుతం నమోదవుతున్న ఇన్ఫెక్షన్ రేటు 2025లో నమోదైన కరోనా wave కంటే బలహీనంగానే ఉందని నిపుణులు పేర్కొన్నారు.

వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చైనా CDC సూచించింది. రద్దీ ప్రాంతాలు, ఆసుపత్రుల్లో masks ధరించాలని, అవసరమైతే booster doses తీసుకోవాలని సూచించింది.

గతంలో కరోనా, ఫ్లూ కేసులు ప్రధానంగా చలికాలంలో పెరిగేవి. అయితే ఇప్పుడు వేసవిలో కూడా కేసులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. తీవ్ర ఎండల కారణంగా ప్రజలు ఎక్కువసేపు AC గదుల్లో గడపడం, వేసవి సెలవుల్లో ప్రయాణాలు పెరగడం వైరస్ వ్యాప్తికి అనుకూల పరిస్థితులు సృష్టిస్తున్నాయని వారు విశ్లేషిస్తున్నారు.

చైనాలో కేసులు పెరుగుతున్నప్పటికీ భారతదేశంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో active కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇటీవల Andhra Pradesh, West Bengal‌తో పాటు కొన్ని రాష్ట్రాల్లో చెదురుమదురు కేసులు నమోదైనప్పటికీ, బాధితుల్లో ఎక్కువ మందికి స్వల్ప లక్షణాలే ఉన్నాయని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం పెద్ద ముప్పుకు ఎలాంటి సంకేతాలు లేవని ఆరోగ్య శాఖలు పేర్కొంటున్నాయి. అయితే చైనాలో తాజా పరిణామాల నేపథ్యంలో పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి.