బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పరీక్షల

98 articles

సీనియర్ టీచర్లకు కంప్యూటర్ ఆధారిత టెట్  నుంచి మినహాయింపు ఇవ్వాలి: APTF
జిల్లా వార్తలు

సీనియర్ టీచర్లకు కంప్యూటర్ ఆధారిత టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి: APTF

ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్, ఇన్ సర్వీస్ టీచర్లకు కంప్యూటర్ ఆధారిత టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే సేవలో ఉన్న ఉపాధ్యాయులు బోధన అనుభవం, సేవా కాలం ద్వారా అర్హత నిరూపించుకున్నందున వారికి మళ్లీ టెట్ అవసరం లేదని, తప్పనిసరిగా నిర్వహించాల్సి వస్తే కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ విధానంలో కాకుండా రాత పరీక్షల రూపంలో ఉండాలని ఆయన సూచించారు.

9, ఆగ 2026

మున్సిపల్ కార్మికుల సంక్షేమంపై చర్యలు తీసుకోవాలని APMEF వినతిపత్రం
జిల్లా వార్తలు

మున్సిపల్ కార్మికుల సంక్షేమంపై చర్యలు తీసుకోవాలని APMEF వినతిపత్రం

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌కు కార్మికుల సంక్షేమం, ఆరోగ్య భద్రత, కుటుంబాల ఆర్థిక రక్షణకు సంబంధించి వినతిపత్రం సమర్పించారు. ప్రతి నెలా వైద్య శిబిరాలు, నియమిత వైద్య పరీక్షలు, విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరగా, కమిషనర్ వినతిపత్రంలోని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు సంఘం నాయకులు తెలిపారు.

6, ఆగ 2026

SSC MTS, హవల్దార్ పరీక్షల ఫలితాలు విడుదల
పరీక్షా ఫలితాలు

SSC MTS, హవల్దార్ పరీక్షల ఫలితాలు విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన SSC MTS, హవల్దార్ పోస్టుల కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. CBTకు హాజరైన సుమారు 8.04 లక్షల మంది అభ్యర్థుల్లో 8,071 మందిని PET, PST దశలకు షార్ట్‌లిస్ట్ చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలు, కట్‌ఆఫ్ వివరాలను SSC అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకుని, తదుపరి దశల షెడ్యూల్ కోసం వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలని కమిషన్ సూచించింది.

5, ఆగ 2026

నీట్‌ పరీక్షలో తక్కువ మార్కులు..  విద్యార్థిని ఆత్మహత్య
జిల్లా వార్తలు

నీట్‌ పరీక్షలో తక్కువ మార్కులు.. విద్యార్థిని ఆత్మహత్య

మాల పుష్పావతి (18) నీట్‌ పరీక్షలో 347 మార్కులు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్‌లో 965 మార్కులు సాధించిన ఆమెను చిన్ననాటి నుంచే వైద్యురాలిని చేయాలనే లక్ష్యంతో కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, గ్రామంలో విషాదం నెలకొంది.

2, ఆగ 2026

శ్రీలంక టెస్టు సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా సిద్ధం
క్రీడలు

శ్రీలంక టెస్టు సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా సిద్ధం

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాకు ఊరట కలిగించేలా జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి, పూర్తిగా కోలుకున్నాడని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్పష్టం చేసింది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్‌లో కీలకమైన ఈ సిరీస్‌లో బుమ్రా అందుబాటులో ఉండటం భారత పేస్‌ దళానికి పెద్ద బలం కానుండగా, శుబ్మం గిల్ సారథ్యంలో గిల్ సేన శ్రీలంక పర్యటనను విజయాలతో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

2, ఆగ 2026

యోగి వేమన యూనివర్సిటీలో కొత్త CEగా ప్రొ.టి.లక్ష్మీ ప్రసాద్
జిల్లా వార్తలు

యోగి వేమన యూనివర్సిటీలో కొత్త CEగా ప్రొ.టి.లక్ష్మీ ప్రసాద్

కడపలోని యోగి వేమన యూనివర్సిటీలో ఎర్త్ సైన్స్ విభాగానికి చెందిన ప్రొ.టి.లక్ష్మీ ప్రసాద్‌ను కొత్త Controller of Examinations‌గా నియమిస్తూ విశ్వవిద్యాలయం ఆదేశాలు జారీ చేసింది. పదవీకాలం పూర్తయిన ప్రొ.కృష్ణారావు స్థానంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన ద్వారా పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రక్రియ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సాగుతుందనే నమ్మకాన్ని వైస్ చాన్సలర్ బెల్లంకొండ రాజశేఖర్ వ్యక్తం చేశారు.

1, ఆగ 2026

తనపై, తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు..: ప్రధాని మోడీ
జాతీయం

తనపై, తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు..: ప్రధాని మోడీ

తనపై, తన దివంగత తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. “తిట్లతో ఏ సమస్యా పరిష్కారం కాదు” అని అన్నారు.

1, ఆగ 2026

నీట్ పేపర్ లీకేజీ నిరసనలు… జంతర్ మంతర్‌లో ఏర్పడ్డ పెళ్లి బంధాలు
జాతీయం

నీట్ పేపర్ లీకేజీ నిరసనలు… జంతర్ మంతర్‌లో ఏర్పడ్డ పెళ్లి బంధాలు

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నెలరోజుల పాటు విద్యార్థుల నిరసనలు కొనసాగగా, దేశం నలుమూలల నుంచి వేలాది మంది పాల్గొన్నారు. ఈ దీర్ఘకాలిక ఆందోళనల మధ్య తరచూ కలుసుకుంటూ వచ్చిన కొందరు యువతీ యువకుల మధ్య స్నేహం, ప్రేమగా మారి చివరకు పెళ్లి బంధాలకు దారి తీసింది. ఈ జంటల కథలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి.

31, జులై 2026

కడప జిల్లాలో ఆగస్ట్ 5 నుంచి టెట్ పరీక్షలు
జిల్లా వార్తలు

కడప జిల్లాలో ఆగస్ట్ 5 నుంచి టెట్ పరీక్షలు

కడప జిల్లాలో టెట్ పరీక్షలను ఆగస్ట్ 5 నుంచి 16 వరకు నిర్వహించనున్నారు. కడప, ప్రొద్దుటూరు, రాజంపేటలో కలిపి 8 కేంద్రాల్లో మొత్తం 11,780 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు, భద్రత, పర్యవేక్షణ బృందాలు, ప్రశ్నాపత్రాల భద్రతపై సమీక్ష నిర్వహించి, ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

31, జులై 2026

పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ బిల్లు 2026కు సోనమ్ వాంగ్‌చుక్ స్వాగతం
జాతీయం

పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ బిల్లు 2026కు సోనమ్ వాంగ్‌చుక్ స్వాగతం

పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ సవరణ బిల్లు 2026కు సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు తెలుపుతూ, యువత–ప్రభుత్వాల మధ్య విశ్వాసం బలపడితేనే దేశ నిర్మాణం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టే ఈ బిల్లు విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులకు దారితీస్తుందని ఆశిస్తూ, నీట్‌ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను తక్షణమే కొట్టివేయాలని కేంద్రాన్ని కోరారు.

30, జులై 2026

లోక్‌సభలో పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం
జాతీయం

లోక్‌సభలో పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం

లోక్‌సభలో పేపర్ లీక్ నిరోధక బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. NEET పేపర్ లీక్ ఘటనలతో దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తు, బాధ్యతాయుత వ్యవస్థల అవసరం వంటి అంశాలపై దాదాపు 10 గంటల పాటు చర్చ జరిగింది. బిల్లు ఆమోదంతో ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టేందుకు కఠిన చర్యలకు మార్గం సుగమమైందని పార్లమెంటరీ వర్గాలు భావిస్తున్నాయి.

29, జులై 2026

చైనాలో మరోసారి కోవిడ్ కేసులు పెరుగుదల;
అంతర్జాతీయం

చైనాలో మరోసారి కోవిడ్ కేసులు పెరుగుదల;

చైనాలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జూలై మధ్యలో కోవిడ్ పాజిటివిటీ రేటు 16.3 శాతానికి చేరి ఫ్లూ కంటే ఎక్కువగా నమోదైంది, Omicron‌కు చెందిన NB.1.8.1 variant ప్రధానంగా వ్యాపిస్తున్నా కేసుల తీవ్రత తక్కువగా ఉందని చైనా CDC తెలిపింది. వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని సూచించగా, భారతదేశంలో పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని ఆరోగ్య వర్గాలు పేర్కొన్నాయి.

29, జులై 2026

డీఎస్సీ పై సీబీఐతో విచారణ జరిపించాలి!:  ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్ డిమాండ్
రాజకీయాలు

డీఎస్సీ పై సీబీఐతో విచారణ జరిపించాలి!: ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్ డిమాండ్

డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాలలో అక్రమాలపై వైఎస్‌ జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులను అభినందించిన ఆయన, డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పునరుద్ఘాటించారు.

29, జులై 2026

పరీక్షల సంస్కరణ బిల్లుకు మద్దతు ఇస్తాం  : తెరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
తెలంగాణ

పరీక్షల సంస్కరణ బిల్లుకు మద్దతు ఇస్తాం : తెరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్

మంచి ఉద్దేశంతో పరీక్షల సంస్కరణల బిల్లు తీసుకొస్తే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చి స్వాగతిస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కొత్త బిల్లులు తీసుకురావడానికి ముందు గత తప్పుల నుంచి ఏమి నేర్చుకుందో ప్రజలకు చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

28, జులై 2026

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్
జిల్లా వార్తలు

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్

పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డీఎస్సీ పరీక్షలో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించి, బాధ్యులపై కేసులు నమోదు చేసి శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసినట్లే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని, లేనిపక్షంలో విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు.

28, జులై 2026

జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం: అభిమానులకు కీలక విజ్ఞప్తి
సినిమా

జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం: అభిమానులకు కీలక విజ్ఞప్తి

జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోనున్నారు. ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, అవసరమైనప్పుడు అధికారిక సమాచారం తమ నుంచే వస్తుందని ఎన్టీఆర్ బృందం అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటుండగా, షూటింగ్ షెడ్యూల్స్ మార్పుపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

28, జులై 2026

లోక్‌సభలో యాంటీ- పేపర్ లీక్ బిల్లు  ప్రవేశపెట్టిన కేంద్రం..
జాతీయం

లోక్‌సభలో యాంటీ- పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం..

దేశవ్యాప్తంగా పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం-2024లో కీలక సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.

27, జులై 2026

ప్రజా సమస్యలు పక్కనబెట్టి పబ్లిసిటీకి కూటమి ప్రభుత్వం : బొత్స సత్యనారాయణ విమర్శ
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలు పక్కనబెట్టి పబ్లిసిటీకి కూటమి ప్రభుత్వం : బొత్స సత్యనారాయణ విమర్శ

బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి పబ్లిసిటీకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. DSCలో అవకతవకలపై CBI విచారణ, సంబంధిత మంత్రి రాజీనామా, నిరుద్యోగ భృతి, ఫి రేయింబర్సుమెంట్ , వసతి దీవెన బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ, భోగాపురం Airport క్రెడిట్, Sports quota ఉద్యోగాల కేటాయింపులో ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు.

27, జులై 2026

చిత్తూరు నగరంలో జైన్ సంఘ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
జిల్లా వార్తలు

చిత్తూరు నగరంలో జైన్ సంఘ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

చిత్తూరు నగరంలో జైన్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజలు విశేష స్పందన చూపారు. 210 మంది కంటి పరీక్షలు చేయించుకోగా, 99 మందిని శస్త్రచికిత్సకు ఎంపిక చేసి, గత నెల శస్త్రచికిత్స చేయించుకున్న 67 మందికి రివ్యూ పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెల నాలుగో ఆదివారం జరిగే ఈ శిబిరాల ద్వారా పేదలకు ఉచిత శస్త్రచికిత్స, ప్రయాణం, భోజనం, వసతి సదుపాయాలు లభిస్తున్నాయి.

27, జులై 2026

ప్రధాని మోదీ మరో వీడియో రిలీజ్.. పరీక్షల సంస్కరణలపై కీలక నిర్ణయం
జాతీయం

ప్రధాని మోదీ మరో వీడియో రిలీజ్.. పరీక్షల సంస్కరణలపై కీలక నిర్ణయం

దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను పారదర్శకంగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా మరో వీడియో రిలీజ్ చేశారు.

26, జులై 2026

బీదర్  ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి బైక్‌తో దూసుకెళ్లిన యువకులు
కర్ణాటక

బీదర్ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి బైక్‌తో దూసుకెళ్లిన యువకులు

కర్ణాటకలోని బీదర్ BRIMS జిల్లా ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు బైక్‌తో నేరుగా దూసుకెళ్లడంతో రోగులు, వైద్య సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పోలీసులు స్వల్ప బలప్రయోగంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించగా, ఈ ఘటన ఆస్పత్రి భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తి, భద్రతను కట్టుదిట్టం చేయాలన్న డిమాండ్‌ను బలపరిచింది.

26, జులై 2026

‘‘బొద్దింకతో పెట్టుకోకండి’’ : CJP అభిజీత్ దీప్కే
జాతీయం

‘‘బొద్దింకతో పెట్టుకోకండి’’ : CJP అభిజీత్ దీప్కే

నీట్ పరీక్షల వివాదం మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి, లేఖను ప్రధాని నరేంద్రమోడీకి పంపారు. జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు జరుపుకోగా, SJP ఫౌండర్ అభిజిత్ దీప్కే ఇది ప్రజాస్వామ్యంలో కీలక పరిణామమని వ్యాఖ్యానించారు. కేంద్రం–SJP మూడో విడత చర్చలకు గంటల ముందే వచ్చిన ఈ పరిణామంతో ఆ చర్చల భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది.

25, జులై 2026

దేశవ్యాప్తంగా క్యాండిల్‌ ర్యాలీకి సీజేపీ పిలుపు
జాతీయం

దేశవ్యాప్తంగా క్యాండిల్‌ ర్యాలీకి సీజేపీ పిలుపు

NEET-UG నిరసనల నేపథ్యంలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా సీజేపీ జూలై 26 సాయంత్రం 6 గంటలకు దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిశ్శబ్ద కొవ్వొత్తుల ర్యాలీలకు పిలుపునిచ్చింది. Dharmendra Pradhan రాజీనామా, విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లపై కేంద్రం–CJP మధ్య చర్చలు కొనసాగుతుండగా, ర్యాలీలు పూర్తిగా శాంతియుతంగా సాగాలని నిర్వాహకులు కోరుతున్నారు.

25, జులై 2026

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
జాతీయం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

పలు జాతీయ స్థాయి పోటీ పరీక్షల పేపర్ లీక్ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసి, లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. ముఖ్యంగా CJP ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలు, ప్రతిపక్షాల తీవ్ర విమర్శల మధ్య వచ్చిన ఈ నిర్ణయంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

25, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాల్సిందేనని రాహుల్ డిమాండ్
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాల్సిందేనని రాహుల్ డిమాండ్

నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. నీట్‌ అవకతవకలతో విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించి, పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

25, జులై 2026

రాజీనామా చేయకపోతే చర్చల్లేవు.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం!
జాతీయం

రాజీనామా చేయకపోతే చర్చల్లేవు.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం!

దేశవ్యాప్తంగా కలకలం రేపిన పేపర్ లీక్‌ల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ (CJP) తెగేసి చెప్పింది. లేకుంటే కేంద్రంతో చర్చలు జరపడంలో ఎలాంటి అర్థం లేదని తేల్చిచెప్పారు.

25, జులై 2026

OPPO ఫైండ్ X10 సిరీస్‌పై లీకులు హల్‌చల్‌: కొత్త డిజైన్, 200MP కెమెరాలతో పరీక్షలు
టెక్నాలజీ

OPPO ఫైండ్ X10 సిరీస్‌పై లీకులు హల్‌చల్‌: కొత్త డిజైన్, 200MP కెమెరాలతో పరీక్షలు

OPPO ఫైండ్ X10 సిరీస్‌పై లీకులు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వెడల్పాటి కెమెరా మాడ్యూల్, రెండు 200MP కెమెరాలు, పెద్ద బ్యాటరీ, డిమెంసిటీ 9600 చిప్‌సెట్, IP68/IP69 రేటింగ్, 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ వంటి ఫీచర్లను పరీక్షిస్తున్నట్లు సమాచారం. అయితే ఇవన్నీ లీకుల స్థాయిలోనే ఉండగా, 2026 సెప్టెంబర్–అక్టోబర్‌లో సిరీస్ ఆవిష్కరణ జరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

25, జులై 2026

ఎన్టీఏలో భారీ ప్రక్షాళన.. 47 మంది ఉద్యోగులపై వేటు
జాతీయం

ఎన్టీఏలో భారీ ప్రక్షాళన.. 47 మంది ఉద్యోగులపై వేటు

నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీపై విద్యార్థులు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన తెలుపుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నీట్‌, జేఈఈ సహా పలు జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహించే స్వయంప్రతిపత్తి సంస్థ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) 47 మంది ఉద్యోగులను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

25, జులై 2026

విద్యా వ్యవస్థ సంక్షోభానికి ప్రధానే కారణం..: రాహుల్ గాంధీ ధ్వజం
జాతీయం

విద్యా వ్యవస్థ సంక్షోభానికి ప్రధానే కారణం..: రాహుల్ గాంధీ ధ్వజం

ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యా వ్యవస్థ సంక్షోభానికి ఆయనే బాధ్యుడని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు..

24, జులై 2026

విద్యార్థి సంఘాల పిలుపుతో విద్యాసంస్థల బంద్‌
జిల్లా వార్తలు

విద్యార్థి సంఘాల పిలుపుతో విద్యాసంస్థల బంద్‌

దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపుతో జులై 24, 2026న విద్యాసంస్థల బంద్‌ కొనసాగుతోంది. నీట్‌ పరీక్షల అవకతవకలు, పేపర్‌ లీకేజీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంఘాలు Dharmendra Pradhan రాజీనామా, NTA రద్దు, పరీక్షల పారదర్శకతకు కఠిన చర్యలు, సమగ్ర దర్యాప్తు కోరుతున్నాయి. కొన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థలు బంద్‌కు మద్దతుగా సెలవులు ప్రకటించగా, మరికొన్ని సాధారణంగా తరగతులు నిర్వహిస్తున్నాయి.

24, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters