రాయలసీమ న్యూస్, జాబ్స్ డెస్క్: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 21 ఖాళీలను వాక్‌ఇన్ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు నిర్దిష్ట తేదీన ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
అర్హులైన అభ్యర్థులు ముందుగా ఈసీఐఎల్ అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు నమూనాను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానిని పూర్తిగా నింపి, అవసరమైన విద్యా, అనుభవ ధ్రువపత్రాల ప్రతులతో కలిసి వాక్‌ఇన్ ఇంటర్వ్యూకు సమర్పించాలి. ఎంపిక మొదట ఒక సంవత్సరానికి మాత్రమే అయినప్పటికీ, పనితీరు, అవసరాన్ని బట్టి గరిష్టంగా మూడు సంవత్సరాల వరకు ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.
హైదరాబాద్‌తో పాటు ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై జోన్లలో వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పోస్టుల వారీగా ఖాళీలు, అర్హతలు, వేతన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రాజెక్ట్ ఇంజినీర్: మొత్తం 6 ఖాళీలు. కనీసం 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతతో పాటు కనీసం మూడు సంవత్సరాల ఉద్యోగానుభవం ఉండాలి. వయసు 33 సంవత్సరాలు మించకూడదు. వేతనం మొదటి ఏడాది నెలకు రూ.40,000, రెండో ఏడాది రూ.45,000, మూడో ఏడాది రూ.50,000, నాలుగో ఏడాది రూ.55,000గా నిర్ణయించారు. ఆరు నెలలు పూర్తి చేసిన తర్వాత యూనిఫామ్ అలవెన్స్ కింద ఒకేసారి రూ.8,400 చెల్లిస్తారు.
టెక్నికల్ ఆఫీసర్: 8 ఖాళీలు. కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత, కనీసం ఒక సంవత్సరం ఉద్యోగానుభవం అవసరం. వయసు 30 సంవత్సరాలు మించకూడదు. వేతనం మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది రూ.28,000, మూడో, నాలుగో సంవత్సరాల్లో రూ.31,000గా ఉంటుంది.
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 3 ఖాళీలు. కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. వయసు 30 సంవత్సరాలు మించకూడదు. నెలవారీ వేతనం రూ.26,208. సీఎల్‌సీ (సెంట్రల్) మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేతనంలో పెంపు ఉంటుంది.
సీనియర్ ఆర్టిజన్: 4 ఖాళీలు. ఐటీఐ అర్హతతో పాటు కనీసం రెండేళ్ల అనుభవం అవసరం. సంబంధిత రంగంలో చేసిన అప్రెంటిస్‌షిప్‌ను కూడా ఉద్యోగానుభవంగా పరిగణిస్తారు. వయసు 30 సంవత్సరాలు మించకూడదు. నెలకు రూ.24,018 వేతనం చెల్లిస్తారు. సీఎల్‌సీ (సెంట్రల్) గైడ్‌లైన్స్ ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేతనంలో పెంపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియలో విద్యార్హతలు, ఉద్యోగానుభవం, వాక్‌ఇన్ ఇంటర్వ్యూకు ప్రాధాన్యం ఇస్తారు. బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ అర్హతలకు 20 మార్కులు, ఉద్యోగానుభవానికి 30 మార్కులు, వ్యక్తిగత ఇంటర్వ్యూకు 50 మార్కులు కేటాయించారు.
వాక్‌ఇన్ ఇంటర్వ్యూ తేదీ 18.06.2026. రిజిస్ట్రేషన్ ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు మాత్రమే నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ప్రదేశం: కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ (సీఎల్‌డీసీ), నలందా కాంప్లెక్స్, ఈసీఐఎల్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్ – 500062. మరిన్ని వివరాలకు ఈసీఐఎల్ వెబ్‌సైట్ http://www.ecil.co.in/ ను సందర్శించవచ్చు.







