తెలంగాణ పోలీస్ శాఖలో భారీ రిక్రూట్‌మెంట్

7,437 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీస్ నియామక మండలి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటి ద్వారా సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీస్, ఫైర్, జైళ్ల శాఖలో ఖాళీగా ఉన్న దాదాపు 7,437 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ ఆన్‌లైన్ దరఖాస్తుల తేదీలను త్వరలో పోలీస్ నియామక మండలి ప్రకటించనుంది. దరఖాస్తుకు ముందు వైద్య, శారీరక ప్రమాణాలు పరిశీలించుకోవాలని అభ్యర్థులకు సూచించింది.

  • పోలీస్ శాఖలో 4,980 కానిస్టేబుల్ పోస్టులు, 200 ఎస్‌ఐ, 23 ఏఎస్‌ఐ పోస్టులు.

  • స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 44 ఎస్‌ఐ,1,380 కానిస్టేబుల్ పోస్టులు.

  • ఫైర్ శాఖలో 39 స్టేషన్ ఫైర్ ఆఫీసర్, 751 ఫైర్ ఫైటర్ పోస్టులు.

  • జైళ్ల శాఖలో 15 డిప్యూటీ జైలర్, 208 వార్డర్ పోస్టులు.