రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: సినిమా రివ్యూ
నిశ్శబ్దాన్ని ప్రధాన ఆయుధంగా మలుచుకుని ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘A Quiet Place’. ఇది సాధారణ హారర్ సినిమా కాదు. శబ్దాన్ని విని వేటాడే భయంకర జీవుల నుంచి తప్పించుకోవడానికి ఒక కుటుంబం చేసే పోరాటమే ఈ చిత్రానికి మూలకథ. ఒక్కరినొకరు కాపాడుకోవడానికి వారు ఎలాంటి ప్రయత్నాలు చేశారన్నది తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించారు.
‘A Quiet Place’ చిత్రం తెలుగు, హిందీ, ఇంగ్లిషు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్, థ్రిల్లర్ శైలిలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం JioHotstar, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ వేదికల్లో అందుబాటులో ఉంది.
కథ:- లీ అబాట్ (John Krasinski) కుటుంబం చుట్టూ తిరుగుతుంది. అతని భార్య Evelyn, కూతురు Regan, కుమారుడు Marcus, చిన్న కొడుకు Beau – వీరంతా కలిసి పూర్తిగా నిశ్శబ్దంగా జీవించాల్సిన పరిస్థితుల్లో ఉంటారు. శబ్దం చేస్తే చాలు.. చుట్టుపక్కల తిరిగే భయంకర జీవులు వారిపై దాడి చేస్తాయి. ఒక చిన్న పొరపాటు వల్ల చిన్న కొడుకు Beau ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెడుతుంది. అయినప్పటికీ ఆ జీవుల నుంచి తప్పించుకుంటూ వారు జీవనం కొనసాగిస్తారు.
Regan చెవిటి అమ్మాయి కావడంతో తండ్రి తనను ప్రేమించడం లేదనే అపోహలో ఉంటుంది. అయితే లీ మాత్రం ఆమె కోసం వినికిడి పరికరాన్ని తయారు చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇదిలా ఉండగా Evelyn మళ్లీ గర్భవతి అవుతుంది. బిడ్డ పుట్టినప్పుడు ఏడుపు శబ్దం రాకుండా కుటుంబం తీసుకునే జాగ్రత్తలు, ఆ సమయంలో ఎదురయ్యే ప్రమాదాలు తెరపై ఉత్కంఠను పెంచుతాయి.
John Krasinski దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎమిలీ బ్లుంత్ , మిల్లిసెంట్ సీంమొండ్స్ , Noah Jupe తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లు సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. కథ ముందుకు సాగుతున్న కొద్దీ కుటుంబ బంధాలు, తల్లిదండ్రుల ప్రేమ, పిల్లల పట్ల బాధ్యత, భావోద్వేగాలు స్పష్టంగా బయటపడతాయి.
ప్రసవ సమయంలో Evelyn ఎదుర్కొనే ప్రాణాపాయ పరిస్థితులు, పిల్లలను కాపాడేందుకు Lee చేసే త్యాగం ప్రేక్షకుల మనసును కదిలించేలా ఉంటాయి. చివర్లో Regan వినికిడి పరికరం ద్వారా ఆ జీవుల బలహీనతను గుర్తించడం కథకు కీలక మలుపు తీసుకువస్తుంది.
ఈ చిత్రానికి John Krasinski దర్శకత్వం, నటన రెండూ ప్రధాన బలాలుగా నిలిచాయి. Evelyn పాత్రలో Emily Blunt సహజంగా, ప్రభావవంతంగా నటించింది. Regan పాత్రలో మిల్లిసెంట్ సీంమొండ్స్ , మార్కస్ పాత్రలో Noah Jupe తమ హావభావాలతోనే టెన్షన్, భావోద్వేగాలను బలంగా వ్యక్తపరిచారు. మాటల కంటే కళ్లతో, శరీర భాషతోనే కథను నడిపించిన ఈ సినిమాలో సంభాషణలు తక్కువగా ఉన్నప్పటికీ ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
హారర్, సస్పెన్స్, భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందిన ‘A Quiet Place’ మొదటి నిమిషం నుంచి చివరి వరకు ఆసక్తిని నిలబెట్టే థ్రిల్లర్గా నిలిచింది. అందుకే ఇది సాధారణ హారర్ చిత్రంగా కాకుండా, కుటుంబ భావోద్వేగాలతో నిండిన ప్రత్యేకమైన అనుభూతిని అందించే సినిమాగా గుర్తింపు పొందింది.
రేటింగ్:- 3/5







