రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ చివరి చిత్రంగా ప్రకటించిన ‘జన నాయకుడు’ గురువారం తమిళంతో పాటు తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో విజయ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటించగా, మమిత బైజు కీలక పాత్రలో కనిపించింది. బాలకృష్ణ నటించిన తెలుగు చిత్రం ‘భగవంత్ కేసరి’కి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాకు H. వినోత్ దర్శకత్వం వహించారు. తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
కథ పరంగా చూస్తే, విజయ్ పోషించిన వెట్రి కొండెం ఒక పోలీస్ ఆఫీసర్. DSP అమ్రిష్ పూజారి ( బాబీ డియోల్ ) హత్య కేసులో అతడు జైలుకు వెళ్తాడు. ఈ కేసులో విజయ్ కు వ్యతిరేకంగా అతని తల్లి ( రేవతి ) సాక్ష్యం చెప్పడం వల్ల ఆమెకు కలిగిన పశ్చాత్తాపం మరణానికి దారి తీస్తుంది. తల్లి చివరి కోరికను నెరవేర్చేందుకు జైలర్ Vijayకు సహాయం చేస్తాడు. జైలర్ కుమార్తె విజి ( మమిత బైజు )తో విజయ్ కు అనుబంధం ఏర్పడుతుంది. జైలర్ మరణంతో Viji బాధ్యతలను Vijay తీసుకుంటాడు. ఆమెను ఆర్మీలో చేరాలని కోరుకుంటాడు. అయితే విజి ఫియర్ ఫోబియా తో పాటు మానసిక సమస్యలతో బాధపడుతూ ఆర్మీలో చేరేందుకు నిరాకరిస్తుంది.
ఇదిలా ఉండగా, తమిళనాడు రాజకీయ నాయకుడు రోజా రంగస్వామి తో కలిసి జాన్ Himmer అనే గ్యాంగ్‌స్టర్ మత కల్లోలాలకు పన్నాగాలు పన్నుతాడు. వారి కుట్రలను విజయ్ ఎలా తిప్పికొట్టాడు? విజి ని చంపాలనే ప్రయత్నం వెనుక కారణం ఏమిటి? నిజాయితీ గల IPS ఆఫీసర్ అమ్రిష్ ఎలా అవినీతిపరుడయ్యాడు? విజయ్ కు వ్యతిరేకంగా తల్లి ఎందుకు తప్పుడు సాక్ష్యం ఇచ్చింది? దేశాన్ని కాపాడే విజయ్ కు Kayal ( పూజ హెగ్డే ) ఎలా అండగా నిలిచింది? విజి చివరికి విజయ్ మంచితనాన్ని అర్థం చేసుకుందా? ఆమె భయాలు తొలగిపోయాయా? అన్నదే మిగతా కథ.
నటీనటుల పరంగా విజయ్ ‘జన నాయకుడు’లో వన్ మ్యాన్ షో గా నిలిచాడు. అతని ఇమేజ్, స్టార్‌డమ్‌ను బేస్ చేసుకొని ప్రతి సీన్‌ను డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లో విజయ్ ఎలివేషన్లు, పొలిటికల్ డైలాగ్స్ అభిమానులకు విజువల్ ట్రీట్‌లా ఉంటాయి. మమిత బైజు తో అతని కాంబినేషన్లోని ఎమోషనల్ సీన్లు బాగా పనిచేశాయి. అయితే పూజ హెగ్డే పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం గమనార్హం. హీరోయిన్గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లా ఆమెను చూపించినట్లు అనిపిస్తుంది. మమిత నటన సాధారణంగానే ఉన్నప్పటికీ, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌లో మెరుగైన ప్రదర్శన ఇచ్చింది.
విలన్‌గా బాబీ డియోల్ పాత్ర కొన్ని చోట్ల అతిగా, మితిమీరిన హింసతో సాగడం ప్రేక్షకులకు అసౌకర్యంగా అనిపించే అవకాశం ఉంది. ప్రకాష్ రాజ్ కు తెలుగులో ఇతర నటుడు డబ్బింగ్ చెప్పడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇలాంటి విలన్ పాత్రలు అతని కెరీర్లో ఇప్పటికే చాలానే ఉండటంతో కొత్తదనం తక్కువగా ఉంటుంది. సునీల్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. గౌతమ్ మీనన్ , నాస్సర్ , నరైన్ తదితర సీనియర్ నటులు విజయ్ ఎలివేషన్లకు మాత్రమే వేదికగా నిలిచారు. క్లైమాక్స్‌లో దర్శకులు అట్లీ , లోకేష్ కానగరాజ్ , నెల్సన్ గెస్ట్లుగా, అలాగే అనిరుద్ , శేఖర్ మాస్టర్ కూడా అతిథులుగా కనిపిస్తారు.
సాంకేతికంగా చూస్తే, ‘భగవంత్ కేసరి’ మూలకథను తీసుకొని తనదైన స్టైల్లో మార్పులు చేసి తెరపైకి తీసుకువచ్చిన H. వినోత్ ప్రయత్నం పూర్తిగా ఫలించలేదని చెప్పాలి. బలవంతపు భావోద్వేగాలు, అనవసర యాక్షన్ సన్నివేశాలతో సినిమా సాగినట్లు కనిపిస్తుంది. విజయ్ పొలిటికల్ ఇమేజ్ను కూడా క్యారీ చేయాలనే ప్రయత్నంలో కథ కొన్ని సార్లు సైడ్ ట్రాక్‌లోకి వెళ్లిపోయింది. అనిరుద్ సంగీతం ఈ సినిమాకు మైనస్‌గా మారింది. పాటలు ఆకట్టుకోకపోవడంతో పాటు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథతో సింక్ కాకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఎడిటింగ్ పరంగా కత్తిరించాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నప్పటికీ, అవి అలాగే కొనసాగడం వల్ల లెంగ్త్ సమస్య మరింత పెరిగింది. సినిమాటోగ్రఫీ సాధారణ స్థాయిలోనే ఉంది.
‘భగవంత్ కేసరి’లోని బాలకృష్ణ – శ్రీ లీల ట్రాక్‌ను ‘జన నాయకుడు’లో దాదాపు ఫ్రేమ్ to ఫ్రేమ్ గా మళ్లీ చూపించిన భావన కలుగుతుంది. విలన్ ట్రాక్‌ను కొత్తగా రాసినా, మత కల్లోలాలు, రిమోట్ గన్స్ ద్వారా దేశంలో కుట్రలు అనే అంశాలు సిల్లీగా అనిపించే అవకాశం ఉంది. చిన్న అవమానానికి ప్రతీకారంగా ప్రపంచాన్ని గడగడలాడించే టెర్రరిస్ట్‌గా మారే విలన్ ఫ్లాష్‌బ్యాక్ కూడా కన్విన్సింగ్‌గా ఉండదు. క్లైమాక్స్‌లో రోబో ఫైట్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోదు.
మూడు గంటల మూడు నిమిషాల రన్‌టైమ్ ఈ సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. తెలుగు ప్రేక్షకుల కోసం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘భగవంత్ కేసరి’ చూసిన వారికి ‘జన నాయకుడు’ కొత్తగా అనిపించడం కష్టమే. ఒరిజినల్ చూడని ప్రేక్షకులను మాత్రం కొంతవరకు ఆకట్టుకునే అవకాశం ఉంది.
మొత్తం మీద, దళపతి విజయ్ వీరతాండవం, పొలిటికల్ ఎలిమెంట్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు భరించగలిగిన ప్రేక్షకులకు మాత్రమే ఈ చిత్రం నచ్చే అవకాశం ఉంది.
రేటింగ్ 2/5గా నిలిచింది.







