జూన్ రెండో వారంలో థియేటర్లు, ఓటీటీ వేదికలపై కలిపి 20 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ వారం కొత్తగా థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు ఉన్నప్పటికీ, అవి ‘పెద్ది’ రన్‌ను ప్రభావితం చేసే స్థాయి సినిమాలుగా పరిశ్రమ వర్గాలు భావించడం లేదు. ఎక్కువగా ఇవి నామమాత్ర విడుదలలుగానే చూస్తున్నాయి.

థియేటర్లలో కొత్త చిత్రాలతో పాటు పాత బ్లాక్‌బస్టర్‌ల రీ రిలీజ్‌లు కూడా ఉండటం ఈ వారం ప్రత్యేకతగా మారింది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియో , నెట్ఫ్లిక్ , ఆపిల్ TV ప్లస్ వేదికలపై పలు భాషల సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. థియేటర్లలో, ఓటీటీల్లో విభిన్న జానర్లకు ప్రాధాన్యం లభించనుంది.

థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు

ఈ వారం ముందుగా థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనున్న చిత్రాల జాబితా ఇలా ఉంది:

1) సింగ్ గీతం – జూన్ 11న విడుదల

2) సమరసింహారెడ్డి (రీ రిలీజ్) – జూన్ 10న విడుదల

3) నరసింహ నాయుడు (రీ రిలీజ్) – జూన్ 10న విడుదల

4) సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ – జూన్ 12న విడుదల

5) గవర్నర్ (హిందీ) – జూన్ 12న విడుదల

6) మైన్ వాపస్ ఆవుంగ – జూన్ 12న విడుదల

7) హాంటెడ్ 3D – జూన్ 12న విడుదల

8) భారత్ భాగ్య విధాత – జూన్ 12న విడుదల

9) కొత్త మలుపు – జూన్ 12న విడుదల

10) పోలీస్ కంప్లైంట్ – జూన్ 12న విడుదల

సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు వంటి పాత బ్లాక్‌బస్టర్‌లు రీ రిలీజ్‌ల రూపంలో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నాయి. కొత్త చిత్రాలు, రీ రిలీజ్‌లు కలిపి థియేటర్లలో యాక్షన్, థ్రిల్లర్, డ్రామా వంటి విభిన్న శైలుల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు

Amazon Prime Video లో ఈ వారం నుంచి స్ట్రీమింగ్‌కు రానున్న కంటెంట్:

11) వీరభద్రుడు (తమిళ్/తెలుగు) – జూన్ 12 నుండి స్ట్రీమింగ్

12) Every Year After (వెబ్ సిరీస్) – జూన్ 10 నుండి స్ట్రీమింగ్

13) The Rest Is Football (డాక్యుమెంటరీ) – జూన్ 10 నుండి స్ట్రీమింగ్

14) Michael – జూన్ 9 నుండి రెంట్ విధానంలో స్ట్రీమింగ్

15) The Dark Satan – ఇప్పటికే స్ట్రీమింగ్‌లో అందుబాటులో ఉంది

Netflix లో ఈ వారం నుంచి అందుబాటులోకి రానున్నవి:

16) Sweet Magnolias – జూన్ 11 నుండి స్ట్రీమింగ్

17) Colors of Evil – Black – జూన్ 10 నుండి స్ట్రీమింగ్

18) My Family Season 2 (వెబ్ సిరీస్) – జూన్ 10 నుండి స్ట్రీమింగ్

19) The Evil Lawyer (వెబ్ సిరీస్) – జూన్ 11 నుండి స్ట్రీమింగ్

Apple TV Plus లో:

20) Criminal Record (వెబ్ సిరీస్) – జూన్ 10 నుండి స్ట్రీమింగ్

ఓటీటీ వేదికలపై వివిధ భాషలలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు అందుబాటులోకి రావడంతో, ఇంట్లోనే వినోదాన్ని ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులకు ఈ వారం మంచి ఎంపికలు లభించనున్నాయి. థియేటర్లలో కొత్త విడుదలలు, రీ రిలీజ్‌లు, ఓటీటీల్లో విభిన్న కంటెంట్‌తో ఈ వారం వినోద రంగం సందడిగా ఉండనుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.