రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: ప్రతి శుక్రవారం ఓటీటీ వేదికలపై కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వరుసగా విడుదలవుతుండటంతో, వాటి జాబితా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. థియేటర్లకు వెళ్లలేని వారు, కుటుంబంతో ఇంట్లోనే వినోదాన్ని ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. దీంతో నిర్మాతలు కూడా విడుదల వ్యూహాల్లో మార్పులు చేస్తూ, థియేటర్ రన్ తర్వాత ఓటీటీ హక్కుల ద్వారా అదనపు ఆదాయం పొందే దిశగా ముందుకు సాగుతున్నారు.
ఇక ఈ వారాంతం మరోసారి ప్రేక్షకులకు వినోదభరితంగా మారనుంది. థియేటర్ల విషయానికొస్తే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఐశ్వర్య రాజేశ్ నటించిన ‘ఓ సుకుమారి’, మాధవన్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘జీడీఎన్’, ‘వదలా’, ‘రాజా ది రాజా’, ‘ఆపరేషన్ అరుణారెడ్డి’, ‘మహేంద్రగిరి వారాహి’ వంటి చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అంతేకాకుండా హాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తాజా చిత్రం ‘ద ఒడిస్సీ’ కూడా ఈ వారం థియేటర్లలో సందడి చేయనుంది.
ఓటీటీ వేదికలపై కూడా ఈ శుక్రవారం నుంచి పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ముఖ్యంగా సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ ఈ వారంలో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, దీనిపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. అలాగే వడ్డే నవీన్ చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ కూడా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. వీటితో పాటు కన్నడ చిత్రం ‘ది డెవిల్’ కూడా ప్రేక్షకుల్లో కుతూహలాన్ని రేకెత్తిస్తోంది. హిందీ, బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి మొత్తం 14 కొత్త టైటిళ్లు ఒక్క రోజే స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి.
ఏ ఓటీటీ వేదికలో ఏ సినిమా, సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో వివరాలు ఇలా ఉన్నాయి:
Netflix
ద మ్యాప్ ఆఫ్ లాంగింగ్ ( స్పానిష్ సిరీస్) – జూలై 17
ద ఈస్ట్ ప్యాలెస్ ( కొరియన్ సిరీస్) – జూలై 17
దిశైర్ ( ఇంగ్లీష్ సినిమా) – జూలై 17
23000 Lives ( జర్మన్ మూవీ) – జూలై 17
హార్ట్ స్టాప్ అప్ ఫరెవర్ ( ఇంగ్లీష్ సినిమా) – జూలై 17
25 ఇయర్స్ అఫ్ యు ( జాపనీస్ సినిమా) – జూలై 17
స్పూకీ ఇన్ లవ్ ( కొరియన్ సిరీస్) – జూలై 18
Amazon Prime
ది బే ( హాలీవుడ్ మూవీ) – జూలై 17
Aha
Owls ( తమిళ్ సినిమా) – జూలై 17
Jio Hotstar
మా ఇంటి బంగారం ( తెలుగు మూవీ) – జూలై 17
టెస్ట్ సబ్జెక్టు V ( హిందీ డాక్యుమెంటరీ ) – జూలై 18
Zee5
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ( తెలుగు సినిమా) – జూలై 17
ది డెవిల్ ( కన్నడ సినిమా) – జూలై 17
శివలోకే కె కుండక్క మందక్క ( అనిమేషన్ సిరీస్) – జూలై 17
Lionsgate Play
డెసర్ట్ వారియర్ ( హాలీవుడ్ మూవీ) – జూలై 17
టెక్సాస్ చైన్సా (హాలీవుడ్ మూవీ) – జూలై 17
మొత్తం మీద థియేటర్లు, ఓటీటీ వేదికలు కలిపి ఈ వారాంతం ప్రేక్షకులకు విభిన్న భాషల్లో, విభిన్న శైలులలో వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాయి.







