ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.

మాస్ మహారాజా రవితేజకు చాలా కాలం తర్వాత బలమైన బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన చిత్రం ‘ఇరుముడి’. ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుని, బాక్సాఫీస్ వద్ద వేగంగా దూసుకెళ్తోంది. తండ్రీకూతుళ్ల అనుబంధం, భావోద్వేగ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. రవితేజ నటించిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఇరుముడి’ 2026 సెప్టెంబర్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Netflixలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సెప్టెంబర్ 13న అధికారికంగా ప్రకటించింది.

శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి రోజునుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇంకా థియేటర్లలో మంచి రన్ కొనసాగుతున్నప్పటికీ, ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నాలుగు వారాల గడువు పూర్తికాగానే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకురావడానికి మేకర్స్ నిర్ణయించారు.

Netflix ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, దీ భాషల్లో కూడా ఒకేసారి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు, అలాగే ఇప్పటికే చూసి మళ్లీ ఇంట్లోనే ఆస్వాదించాలని భావిస్తున్న హోమ్ ఆడియన్స్ కోసం సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.

ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా, బేబీ నక్షత్ర ఆయన కుమార్తె పాత్రలో కనిపించింది. సాయికుమార్, అజయ్ ఘోష్, స్వాసిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఇప్పటికే థియేటర్లలో సినిమాను చూసిన ప్రేక్షకులు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్, తండ్రీకూతుళ్ల బంధం, యాక్షన్, ఆధ్యాత్మిక అంశాలను కలిపి రూపొందించిన ఈ కథ డిజిటల్ ఆడియన్స్‌కు కూడా బాగా కనెక్ట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 18న Netflixలో స్ట్రీమింగ్ ప్రారంభమైన వెంటనే ఈ మూవీ టాప్ ట్రెండింగ్‌లో నిలవడం ఖాయమనే అభిప్రాయం సినిమా చూసిన ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది.