రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత 'X' అకౌంట్ హ్యాక్ అయ్యింది. దీంతో హోం మంత్రి కార్యాలయ అధికారులు అలర్ట్ జారీ చేశారు. హోం మంత్రి అనిత వ్యక్తిగత 'X' అకౌంట్‌ను కొందరు హ్యాక్ అయ్యిందని.. ఈ సమయంలో ఆ అకౌంట్ నుంచి అనధికారిక పోస్టులు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అకౌంట్ సైబర్ దాడికి గురైన నేపథ్యంలో పోస్ట్ చేసిన అంశాలను అధికారికంగా పరిగణించవద్దని హోం మంత్రి కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం వస్తున్న పోస్టులను అధికారిక సందేశాలుగా పరిగణించవద్దని ప్రజలు, మీడియా, ఫాలోవర్లకు విజ్ఞప్తి చేసింది. అకౌంట్ హ్యాక్ అవ్వడంపై ఇప్పటికే పోలీసులకు హోం మంత్రి ఫిర్యాదు చేశారు. దీంతో హ్యాక్ చేసిన వారిని గుర్తించేందుకు, అకౌంట్ రికవరీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
హోం మంత్రి అనిత ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్
రాయలసీమ న్యూస్ పొలిటికల్ డెస్క్
1 నిమిషాల చదువు
36 views
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత 'X' అకౌంట్ హ్యాక్ అయ్యింది. దీంతో హోం మంత్రి కార్యాలయ అధికారులు అలర్ట్ జారీ చేశారు. అకౌంట్ సైబర్ దాడికి గురైన నేపథ్యంలో పోస్ట్ చేసిన అంశాలను అధికారికంగా పరిగణించవద్దని హోం మంత్రి కార్యాలయం ప్రకటించింది.

- రాయలసీమ న్యూస్ పొలిటికల్ డెస్క్
▸ తాజా రాజకీయాలు వార్తలు మరియు తెలుగు వార్తలు చదవండి.
Published : 25 Jul 2026, 10:15 IST
గమనిక: ఈ కథనంలోని అభిప్రాయాలు, వ్యాఖ్యలు సంబంధిత వ్యక్తులవి. ప్రకటనలు/వాణిజ్య సమాచారం విషయంలో పాఠకులు తగిన జాగ్రత్త వహించాలి; వాటి నాణ్యత లేదా లోపాలకు రాయలసీమ న్యూస్ యాజమాన్యం బాధ్యత వహించదు. సవరణల కోసం సవరణల విధానం చూడండి.






