రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఇండియా ఎ విజేతగా నిలిచింది. శ్రీలంక ఎతో జరిగిన ఫైనల్లో భారత్ ఎ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 377 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక.. 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. వనుజ సహన్ (62), సదీర సమరవిక్రమ (52) అర్ధ శతకాలు చేయగా.. విజయకాంత్ వియాస్కాంత్ (39), సహన్ అరచ్చిగే (38), నిరోషన్ డిక్వెల్లా (25) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్ 3, విప్రాజ్ నిగమ్ 3, అనుకుల్ రాయ్ 2, అశోక్ శర్మ, తిలక్ వర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.
తొలుత భారత బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ (94; 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపు లంక బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. తిలక్ వర్మ (67), రుతురాజ్ గైక్వాడ్ (40), ప్రియాంశ్ ఆర్య (39), అనుకుల్ రాయ్ (39), కుమార్ కుశాగ్ర (36), విప్రాజ్ నిగమ్ (27) పరుగులు చేశారు.
ఇండియా ఎ తో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంక ఎ ఆరు వికెట్లు కోల్పోయింది. తొలి ముగ్గురు బ్యాటర్లు అవిష్క ఫెర్నాండో (3), నిరోషన్ డిక్వెల్లా (25), నువనిదు ఫెర్నాండో (21)ని యశ్ ఠాకూర్ ఔట్ చేశాడు. నాలుగో స్థానంలో వచ్చిన సదీర సమరవిక్రమ (52; 44 బంతుల్లో) అర్ధ శతకం చేసి వెనుదిరిగాడు. ఇతడిని అశోక్ శర్మ వెనక్కి పంపాడు. విప్రాజ్ నిగమ్ బౌలింగ్‌లో రవిందు ఫెర్నాండో (19).. తిలక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సహన్ అరచ్చిగే (34)ని తిలక్ వర్మ వెనక్కి పంపాడు. 26 ఓవర్లకు శ్రీలంక స్కోరు 184/6. వనుజ సహన్ (16), విజయకాంత్ వియాస్కాంత్ (2) క్రీజులో ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఎ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది.







