రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: రాంచీ: వెస్టిండీస్‌తో శుక్రవారం జరగనున్న రెండో టి20 మ్యాచ్‌కు ఆతిథ్య జట్టు భారత్ సమరోత్సాహంతో సిద్ధమైంది. తొలి టి20లో అలవోక విజయం సాధించిన టీమిండియా అదే జోరును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
మరోవైపు తొలి టి20లో ఓటమి చవిచూసిన వెస్టిండీస్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. ప్రారంభ మ్యాచ్‌లో పరాజయం కారణంగా ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. బలమైన భారత జట్టును ఎదుర్కోవాల్సి రావడంతో విండీస్‌కు పని అంత తేలికగా ఉండబోదని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే టీమ్‌లో పలువురు టి20 స్పెషలిస్ట్‌లు ఉండటం వల్ల విండీస్‌ను తక్కువ అంచనా వేయలేని పరిస్థితి ఉంది.
ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. సిరీస్‌లో ఆధిక్యం పెంచుకోవాలని చూస్తున్న భారత్‌కు, సమం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న విండీస్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
తొలి టి20లో విధ్వంసక శతకంతో చెలరేగిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ప్రస్తుతం అందరి చూపులు శ్రేయస్‌పైనే ఉన్నాయి. కొంతకాలంగా ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయడంలో విఫలమవుతున్న శ్రేయస్, గత మ్యాచ్‌లో కళ్లు చెదిరే శతకం సాధించి ఫామ్‌లోకి వచ్చాడు. అతను ఫామ్‌లోకి రావడం జట్టుకు పెద్ద ఊరటగా టీమిండియా వర్గాలు భావిస్తున్నాయి.
ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సామర్థ్యం ఉన్న శ్రేయస్ మరోసారి చెలరేగితే టీమిండియాకు విజయం నల్లేరుపై నడకలా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇషాన్ కిషన్ రూపంలో మరో విధ్వంసక బ్యాటర్ కూడా జట్టులో ఉండటం భారత్‌కు అదనపు బలం. అతను కూడా జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు.
అయితే ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ బ్యాటింగ్‌లో నిలకడ లోపించడం టీమిండియా ఆలోచింపజేస్తోంది. తొలి టి20లో వీరు పెద్దగా రాణించలేకపోవడంతో ఈ మ్యాచ్‌లోనైనా మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరచాల్సిన అవసరం ఉంది. మధ్యవరుసలో తిలక్ వర్మ, శివమ్ దూబె, నమన్ ధిర్, అక్షర్ పటేల్ వంటి బ్యాటర్లు ఉండటంతో భారత బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తోంది.
బౌలింగ్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మయాంక్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉండటం భారత్‌కు మరో ప్లస్ పాయింట్. వీరి ప్రదర్శన కూడా మ్యాచ్ ఫలితంపై కీలక ప్రభావం చూపనుంది.
వెస్టిండీస్ వైపు చూస్తే, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాల్సిన బాధ్యత ఆ జట్టుపై ఉంది. తొలి టి20లో కెప్టెన్ షాయ్ హోప్, రూథర్‌ఫోర్ట్ తప్ప మిగతా బ్యాటర్లు విఫలమవడంతో విండీస్‌కు ఇబ్బందులు తలెత్తాయి. బౌలర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
ఈ నేపథ్యంలో రెండో టి20లో మాత్రం సమష్టిగా రాణించాలని విండీస్ జట్టు సంకల్పం వ్యక్తం చేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ మెరుగైన ప్రదర్శనతో భారత్‌ను ఢీకొట్టి సిరీస్‌లో తిరిగి పోటీలోకి రావాలని ఆ జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.







