బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#టీమిండియా

55 articles

గాలె టెస్ట్‌లో భారత్‌కు షాక్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 193కే ఆలౌట్‌
క్రీడలు

గాలె టెస్ట్‌లో భారత్‌కు షాక్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 193కే ఆలౌట్‌

గాలె టెస్ట్‌లో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే ఆలౌట్‌ కావడంతో శ్రీలంకకు 372 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 462, శ్రీలంక 284 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్‌ కుప్పకూలినా రిషభ్‌ పంత్‌ 66, దేవదత్‌ పడిక్కల్‌ 44 పరుగులతో ఆధిక్యాన్ని నిలబెట్టారు. ఇప్పుడు ఈ లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాటింగ్‌, భారత స్పిన్నర్ల ప్రదర్శనపై మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంది.

18, ఆగ 2026

కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి విజయానికి విరాట్ కోహ్లీ కీలక మద్దతు
క్రీడలు

కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి విజయానికి విరాట్ కోహ్లీ కీలక మద్దతు

కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 51 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన బాక్సర్ సాక్షి చౌదరి తన విజయ ప్రయాణంలో విరాట్ కోహ్లీ, ఆయన ఫౌండేషన్ మద్దతు కీలకమైందని పేర్కొంది. మూడు సంవత్సరాల పాటు కోహ్లీ స్పాన్సర్‌గా నిలిచి ఆర్థికంగా అండగా ఉండటం వల్ల తన ఆటపై పూర్తిగా దృష్టి పెట్టగలిగానని, ఆ సహకారం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి అంతర్జాతీయ వేదికపై విజయాన్ని అందించిందని ఆమె తెలిపింది.

8, ఆగ 2026

తిరుమలలో హార్దిక్ పాండ్యా తలనీలాలు సమర్పణ.. కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్
జిల్లా వార్తలు

తిరుమలలో హార్దిక్ పాండ్యా తలనీలాలు సమర్పణ.. కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గర్ల్‌ఫ్రెండ్ మాహికా శర్మతో కలిసి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తలనీలాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో, గుండు లుక్‌తో దర్శనమిచ్చిన ఆయన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఐపీఎల్ 2027లో ముంబై ఇండియన్స్‌ను వీడి కొత్త జట్టులో చేరే అవకాశాలపై క్రికెట్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

2, ఆగ 2026

శ్రీలంక టెస్టు సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా సిద్ధం
క్రీడలు

శ్రీలంక టెస్టు సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా సిద్ధం

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాకు ఊరట కలిగించేలా జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి, పూర్తిగా కోలుకున్నాడని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్పష్టం చేసింది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్‌లో కీలకమైన ఈ సిరీస్‌లో బుమ్రా అందుబాటులో ఉండటం భారత పేస్‌ దళానికి పెద్ద బలం కానుండగా, శుబ్మం గిల్ సారథ్యంలో గిల్ సేన శ్రీలంక పర్యటనను విజయాలతో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

2, ఆగ 2026

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే వీడ్కోలు
క్రీడలు

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే వీడ్కోలు

టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్‌కు, ఐపీఎల్‌కు వీడ్కోలు ప్రకటించాడు. 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అతని నాయకత్వం, విదేశీ గడ్డపై కీలక ఇన్నింగ్స్‌లు భారత క్రికెట్ చరిత్రలో స్వర్ణ అధ్యాయంగా నిలిచాయి. 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20ల్లో 8,000కు పైగా పరుగులు చేసిన రహానేకు అభిమానులు, క్రికెట్ వర్గాలు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.

30, జులై 2026

టీమిండియా ఫీల్డింగ్ కోచ్ రేసులో సుభదీప్ ఘోష్
క్రీడలు

టీమిండియా ఫీల్డింగ్ కోచ్ రేసులో సుభదీప్ ఘోష్

భారత జట్టులో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ Doeschate, ఫీల్డింగ్ కోచ్ T దిలీప్ కాంట్రాక్టులు పొడగించకూడదని BCCI నిర్ణయించడంతో కొత్త ఫీల్డింగ్ కోచ్ ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. BCCI కార్యదర్శి దేవాజిత్ సాయికియా ప్రకారం ఇద్దరు–ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉండగా, దేశవాళీ, NCA, ఇండియా A, అండర్ -19, IPL స్థాయిల్లో విస్తృత అనుభవం ఉన్న శుభదీప్ ఘోష్ ప్రధాన ఫేవరెట్‌గా, శ్రీ లంక పర్యటనకు ముందు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి.

29, జులై 2026

బీసీసీఐ సెలెక్టర్లపై హనుమ విహారి ప్రశ్నలు
క్రీడలు

బీసీసీఐ సెలెక్టర్లపై హనుమ విహారి ప్రశ్నలు

టీమిండియా మాజీ క్రికెటర్ హనుమ విహారి, సంజు శాంసన్, అభిషేక్ శర్మల ఎంపిక విషయంలో బీసీసీఐ సెలెక్టర్లపై ద్వంద్వ ప్రమాణాల ఆరోపణలు చేశారు. వరుసగా విఫలమైనా అభిషేక్‌కు అవకాశాలు కొనసాగుతుండగా, టీ20 ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజుకు మాత్రం స్థిరమైన అవకాశాలు లేకపోవడాన్ని ప్రశ్నించారు. విహారి వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

28, జులై 2026

తన నిబంధనల ప్రకారమే క్రికెట్‌ ఆడతానన్న సంజు శాంసన్
క్రీడలు

తన నిబంధనల ప్రకారమే క్రికెట్‌ ఆడతానన్న సంజు శాంసన్

సంజు శాంసన్ ఇకపై ఇతరుల అభిప్రాయాలు, జట్టులో పోటీ గురించి ఆలోచించకుండా తన నిబంధనల ప్రకారమే క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు. 2026 టీ20 ప్రపంచ కప్‌లో మూడు అర్ధశతకాలు చేసి భారత్ టైటిల్ నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన సంజు, భవిష్యత్తు ప్రపంచ కప్‌ల గురించి ఆలోచించకుండా ఆటను ఆస్వాదించడం, జట్టుకు అవసరమైనప్పుడు తన వంతు పాత్ర పోషించడమే లక్ష్యమని తెలిపాడు.

28, జులై 2026

మూడో టీ20లోనూ భారత్ విజయం.. జింబాబ్వేపై సిరీస్ క్లీన్‌స్వీప్
క్రీడలు

మూడో టీ20లోనూ భారత్ విజయం.. జింబాబ్వేపై సిరీస్ క్లీన్‌స్వీప్

జింబాబ్వేపై మూడు టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ తొలి టీ20 సిరీస్ విజయం ఇదే కావడం విశేషం.

26, జులై 2026

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్
క్రీడలు

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో భారత జట్టు తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్ వరుస పరాజయాల తర్వాత టీమిండియా రెండో స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే.

26, జులై 2026

జింబాబ్వేపై భారత్ ఘన విజయం
క్రీడలు

జింబాబ్వేపై భారత్ ఘన విజయం

జింబాబ్వేపై రెండో టీ20లో 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ 1 స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ హాఫ్ సెంచరీలు, అభిషేక్ శర్మ, యశ్ ఠాకూర్ బౌలింగ్ ధాటితో భారత్ 219 పరుగులు చేసి, జింబాబ్వేను 129 పరుగులకే ఆలౌట్ చేసి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

26, జులై 2026

జింబాబ్వేపై రెండో టీ20కి టీమిండియా సిద్ధం… సిరీస్ కైవసం లక్ష్యం
క్రీడలు

జింబాబ్వేపై రెండో టీ20కి టీమిండియా సిద్ధం… సిరీస్ కైవసం లక్ష్యం

జింబాబ్వేపై తొలి టీ20లో ఘన విజయం సాధించిన టీమిండియా, నేడు హరారేలో జరగనున్న రెండో మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. పేసర్లకు అనుకూలంగా ఉన్న పిచ్ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు ఉండగా, ఫామ్‌లో లేని అభిషేక్ శర్మ స్థానంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు అరంగేట్రం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

25, జులై 2026

ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల..   నేరుగా క్వార్టర్ ఫైనల్‌లోకి టీమిండియా
క్రీడలు

ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. నేరుగా క్వార్టర్ ఫైనల్‌లోకి టీమిండియా

జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2026లో క్రికెట్ పోటీల షెడ్యూల్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో క్రికెట్ నాలుగోసారి చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

24, జులై 2026

హరారేలో తొలి మ్యాచ్‌కు టీమిండియా సన్నద్ధం.. వైభవ్ సూర్యవంశీపై అభిమానుల దృష్టి
క్రీడలు

హరారేలో తొలి మ్యాచ్‌కు టీమిండియా సన్నద్ధం.. వైభవ్ సూర్యవంశీపై అభిమానుల దృష్టి

టీ20 ప్రపంచ కప్‌ తర్వాత వరుస పరాజయాలతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన టీమిండియా, హరారేలో జింబాబ్వేపై తొలి టీ20లో విజయాలతో పునరాగమనం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మలతో భారత బ్యాటింగ్‌కు మెరుపు ఆరంభం, స్థిరత్వం కీలకం కాగా, సికందర్ రజా నేతృత్వంలోని జింబాబ్వే స్వదేశంలో గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది.

23, జులై 2026

టీమిండియా నిర్లక్ష్యంతో కౌంటీకి కుల్దీప్ యాదవ్.. యార్క్‌షైర్‌తో ఒప్పందం
క్రీడలు

టీమిండియా నిర్లక్ష్యంతో కౌంటీకి కుల్దీప్ యాదవ్.. యార్క్‌షైర్‌తో ఒప్పందం

టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో Yorkshire తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. England వన్డే, Zimbabwe టీ20 సిరీస్‌లకు ఎంపిక కాకపోవడంతో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సీజన్‌లో Metro Bank One Day Cup, County Championship కలిపి ఎనిమిది మ్యాచ్‌లు ఆడుతూ, Sri Lanka టెస్టుల సిరీస్‌కు ముందు తన రిథమ్‌ను కొనసాగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

23, జులై 2026

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల దూకుడు..రోహిత్ సెంచరీతో పోటీ తీవ్రం
క్రీడలు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల దూకుడు..రోహిత్ సెంచరీతో పోటీ తీవ్రం

ఐసీసీ తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో డారిల్ మిచెల్ 802 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, శుభ్‌మన్ గిల్ 801 పాయింట్లతో రెండో, విరాట్ కోహ్లీ మూడో స్థానాల్లో ఉన్నారు. లార్డ్స్‌లో సెంచరీతో రోహిత్ శర్మ 758 పాయింట్లకు చేరుకుని నాలుగో స్థానానికి ఎగబాకి టాప్ ర్యాంక్ పోటీని మరింత ఉత్కంఠభరితంగా మార్చగా, భారత్ మ్యాచ్‌ను ఓడినా ఆసియా జట్ల ప్రభావం ర్యాంకింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

22, జులై 2026

జింబాబ్వే పర్యటనకు టీమిండియా సిద్ధం: తొలి టీ20లో యువ ఆటగాళ్లకు అవకాశాలు
క్రికెట్

జింబాబ్వే పర్యటనకు టీమిండియా సిద్ధం: తొలి టీ20లో యువ ఆటగాళ్లకు అవకాశాలు

జూలై 23న హరారేలో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న భారత్, సీనియర్‌లకు విశ్రాంతి ఇచ్చి యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించనుంది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్‌లతో జట్టు రూపుదిద్దుకునే అవకాశం ఉంది.

22, జులై 2026

శ్రీలంక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా జట్టు ఎంపికపై ఆసక్తి
క్రీడలు

శ్రీలంక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా జట్టు ఎంపికపై ఆసక్తి

శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్ నివేదిక ఆధారంగా జట్టు తుది కూర్పు నిర్ణయించనుండగా, అతను అందుబాటులో లేకపోతే సారాంశ్ జైన్‌కు అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి. రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా ఉండగా, బ్యాటింగ్ విభాగంలో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ తదితరుల ఎంపికపై స్పష్టత ఉంది.

22, జులై 2026

ది హండ్రెడ్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో MI లండన్ విజయం
క్రికెట్

ది హండ్రెడ్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో MI లండన్ విజయం

ఇంగ్లాండ్‌లో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కూడా రోహిత్ శర్మ అక్కడే కొనసాగుతూ, ‘ది హండ్రెడ్ 2026’ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌ను లండన్ ఓవల్‌లో MI లండన్‌కు మద్దతుగా ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ మ్యాచ్‌లో నికోలస్ పూరం, సామ్ కరన్ అజేయ భాగస్వామ్యంతో MI లండన్ సన్ రైజర్స్ లీడ్స్ పై 7 వికెట్ల తేడాతో గెలిచి, నికోలస్ పూరం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ‘ప్లేయర్ అఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.

22, జులై 2026

ఇంగ్లండ్‌తో తుది వన్డేకు భారత్ రెఢీ! : రెండు మార్పులతో బరిలోకి..
క్రీడలు

ఇంగ్లండ్‌తో తుది వన్డేకు భారత్ రెఢీ! : రెండు మార్పులతో బరిలోకి..

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య హోరాహోరీగా సాగుతున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. సిరీస్ విజేత ఎవరో తేల్చే మూడో, చివరి వన్డేకు క్రికెట్ మక్కాగా పేరొందిన లండన్‌లోని చారిత్రాత్మక 'లార్డ్స్' మైదానం వేదికగా నిలవనుంది.

18, జులై 2026

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై అధికారిక నిర్ణయం లేదు..
క్రీడలు

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై అధికారిక నిర్ణయం లేదు..

రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్‌పై సోషల్ మీడియాలో ఊహాగానాలు కొనసాగుతున్నప్పటికీ, బీసీసీఐ లేదా టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఆయన నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మద్దతు, రోహిత్ గణాంకాలు, 2027 వన్డే ప్రపంచ కప్ ఆడాలనే అతని కోరిక దృష్ట్యా తక్షణ రిటైర్మెంట్‌ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

18, జులై 2026

సూర్యకుమార్‌కు టీమిండియా అవకాశముంది... : బీసీసీఐ
క్రీడలు

సూర్యకుమార్‌కు టీమిండియా అవకాశముంది... : బీసీసీఐ

టీ20 ప్రపంచకప్ విజేత సూర్యకుమార్ యాదవ్‌ను టీమిండియా నుంచి తప్పించినప్పటికీ, అతనికి తలుపులు పూర్తిగా మూసుకుపోలేదని BCCI వర్గాలు స్పష్టం చేశాయి. దేశవాళీ క్రికెట్‌లో రంజీ, సయ్యద్ ముష్తాఖ్ అలీ , విజయ్ హజారే టోర్నీల్లో నిలకడగా రాణిస్తే తిరిగి జట్టులోకి రావడానికి అర్హత సాధిస్తాడని సూచించాయి. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ తో మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌కు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ , జస్ప్రీత్ బుమ్రాహ్ తిరిగి జట్టులోకి చేరుతున్నారు.

14, జులై 2026

నేడు ఇండియా vs ఇంగ్లాండ్ తొలి వన్డే
క్రీడలు

నేడు ఇండియా vs ఇంగ్లాండ్ తొలి వన్డే

భారత్–ఇంగ్లాండ్ మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ నేడు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది. అసీసువీథిర్ అంచనాల ప్రకారం మ్యాచ్ సమయంలో వర్షం అవకాశం కేవలం 1 శాతం మాత్రమే ఉండటంతో పూర్తి ఓవర్ల పోరుకు అవకాశం ఎక్కువగా ఉంది. శుబ్మం గిల్ నాయకత్వంలోని భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి చేరగా, ఇంగ్లాండ్‌కు హరీ బ్రూక్ కెప్టెన్‌గా ఉన్నాడు.

14, జులై 2026

లార్డ్స్‌లో అద్భుత విజయం..   చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు
క్రీడలు

లార్డ్స్‌లో అద్భుత విజయం.. చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు

భారత మహిళలు అద్భుతం చేశారు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో తొలిసారిగా ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఘన విజయం సాధించారు. ఏకంగా 270 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా చరిత్రాత్మక విజయం సాధించింది.

13, జులై 2026

ఇంగ్లండ్‌ టెస్టు హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌?
క్రీడలు

ఇంగ్లండ్‌ టెస్టు హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌?

ఇంగ్లండ్‌ టెస్టు జట్టుకు కొత్త హెడ్‌కోచ్‌ ఎంపికలో రాహుల్‌ ద్రవిడ్‌ పేరు కూడా పరిశీలనలో ఉందని సమాచారం. ఆండీ ప్లవర్‌, రిచర్డ్‌ డాసన్‌తో పాటు కుమార సంగక్కర, ఆండ్రూ ఫ్లింటాఫ్‌, మైక్‌ హసన్‌, జస్టిన్‌ లాంగర్‌ పేర్లు కూడా రేసులో వినిపిస్తున్నాయి. బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ టెస్టు కోచ్‌ పదవి నుంచి తప్పుకోగా, వైట్‌ బాల్‌ జట్లకు మాత్రం ఆయనే కోచ్‌గా కొనసాగనున్నారు.

13, జులై 2026

ఇంగ్లాండ్ తో చివరి టీ20 నేడే
క్రీడలు

ఇంగ్లాండ్ తో చివరి టీ20 నేడే

సౌతాంప్టన్‌లో జరగనున్న ఐదో, చివరి టీ20లో ఇంగ్లండ్ 5-0తో సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, వరుస పరాజయాల తర్వాత భారత్ కనీసం ఈ మ్యాచ్ గెలిచి గౌరవం దక్కించుకోవాలని చూస్తోంది. ఈ సిరీస్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ ఇంగ్లండ్ ఆధిపత్యం చూపగా, భారత్ తరఫున శ్రేయాస్ అయ్యర్ మాత్రమే నిలకడగా రాణించగా, ఇంగ్లండ్‌కు హ్యారీ బ్రూక్, జోఫ్రా ఆర్చర్, ఫిల్ సాల్ట్ మంచి ఫామ్‌లో ఉన్నారు.

11, జులై 2026

ఇంగ్లాండ్ కు భారత జట్టు లొంగిపోయింది: అనిల్ కుంబ్లే
క్రికెట్

ఇంగ్లాండ్ కు భారత జట్టు లొంగిపోయింది: అనిల్ కుంబ్లే

ఇంగ్లాండ్‌తో మూడో టీ20లో 125 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలవడంపై అనిల్ కుంబ్లే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇది భారత జట్టు పూర్తిగా లొంగిపోయినట్లేనని వ్యాఖ్యానించారు. ఇంగ్లాండ్ పేసర్ల షార్ట్ పిచ్ బంతులకు భారత బ్యాటర్లు తట్టుకోలేక నిర్లక్ష్యంగా వికెట్లు విసిరేశారని, ఒత్తిడిలో బాధ్యతాయుతంగా ఆడే బ్యాటర్లు లేకపోవడం, అలాగే బౌలర్లను పదేపదే మారుస్తున్న సెలెక్షన్ విధానం కూడా ఈ ఓటమికి కారణమని ఆయన విశ్లేషించారు.

9, జులై 2026

నాటింగ్‌హామ్‌లో నేడే మూడో టీ20
క్రీడలు

నాటింగ్‌హామ్‌లో నేడే మూడో టీ20

భారత్ ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-1తో వెనుకబడి ఉండటంతో నాటింగ్‌హామ్‌లో జరిగే మూడో టీ20 మ్యాచ్‌కు కీలక ప్రాధాన్యత ఏర్పడింది. సిరీస్ ఆశలను నిలుపుకోవాలంటే శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఉంది. ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రవి బిష్ణోయ్ స్థానంలో పేసర్ ప్రిన్స్ యాదవ్‌కు అవకాశం దక్కవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

7, జులై 2026

ప్రపంచ క్రికెట్‌లో మాకు గౌరవం పెరిగింది : ఐర్లాండ్ క్రికెట్ చీఫ్
క్రీడలు

ప్రపంచ క్రికెట్‌లో మాకు గౌరవం పెరిగింది : ఐర్లాండ్ క్రికెట్ చీఫ్

భారత క్రికెట్ జట్టును ఐర్లాండ్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. భారత్ వంటి ప్రపంచ ఛాంపియన్ జట్టుపై చారిత్రక టీ20 సిరీస్ విజయం ఐర్లాండ్ క్రికెట్ ప్రతిష్ఠను పెంచిందని ఆ దేశ బోర్డు అధ్యక్షుడు బ్రయాన్ ఓడొన్నెల్ పేర్కొన్నారు.

3, జులై 2026

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి కెప్టెన్ గిల్
క్రీడలు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి కెప్టెన్ గిల్

ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దుమ్మురేపాడు. అఫ్గానిస్థాన్‌తో ఇటీవల ముగిసిన మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన గిల్ బ్యాటింగ్ విభాగంలో ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంకుకు చేరుకున్నాడు.

24, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters