రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
ఇండోనేసియా ఓపెన్‌లో సింధు విజయం
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్–10లోకి ప్రవేశం
జకార్త: ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, Treesa జొల్ల్య్ – గాయత్రి గోపీచంద్ జోడీ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా, పివి సింధు , అర్జున్ – హరిహరన్ జంటలు రెండో రౌండ్‌కు చేరాయి.
మహిళల సింగిల్స్‌లో పివి. సింధు విజేతగా నిలిచింది. 51 నిమిషాల పాటు సాగిన పోరులో సింధు 25–23, 21–16 స్కోర్లతో థాయిలాండ్ కు చెందిన బుసనం ఒంగ్బంరుంగ్ఫాన్ పై గెలిచి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. తొలి గేమ్‌లో కఠిన పోటీ నెలకొనగా, కీలక పాయింట్ల వద్ద అనుభవాన్ని ఉపయోగించుకున్న సింధు ఆధిక్యం సాధించింది. రెండో గేమ్‌లో ఆత్మవిశ్వాసంతో ఆడి ప్రత్యర్థికి పెద్దగా అవకాశమివ్వలేదు.
పురుషుల డబుల్స్‌లో అర్జున్ – హరిహరన్ ద్వయం విజయంతో ముందంజ వేసింది. ఈ జంట మలేషియాకు చెందిన నూర్ అజ్రియన్ – తాన్ వీ కీన్గ్ జోడీని 21–18, 21–10తో స్ట్రైట్ గేమ్స్‌లో ఓడించింది. తొలి గేమ్‌లో కొంత ప్రతిఘటన ఎదురైనా, రెండో గేమ్‌లో భారత జంట పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ లకు నిరాశే ఎదురైంది. శ్రీకాంత్ 19–21, 15–21 స్కోర్లతో జపాన్ కు చెందిన యుషి తనకా చేతిలో ఓటమి పాలయ్యాడు. లక్ష్య సేన్ 19–21, 16–21తో ఇండోనేషియా ఆటగాడు అలవి ఫర్హాన్ ఎదుట పరాజయం చవిచూశాడు. కీలక దశల్లో పొరపాట్లు, నెట్ సమీపంలో పాయింట్లు కోల్పోవడం వీరి ఓటమికి కారణమైంది.
ఇతర పోటీల్లో కూడా భారత క్రీడాకారులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బంసోడ్ తోలి రౌండ్‌లోనే ఓటమి చెందింది. మహిళల డబుల్స్‌లో త్రీస జొల్ల్య్ – గాయత్రీ గోపీచంద్ జంట, మిక్స్‌డ్ డబుల్స్‌లో ధృవ్ కపిల – తానిషా క్రేస్తో జోడీ కూడా మొదటి రౌండ్ దాటలేక ఇంటిముఖం పట్టాయి.
ఇదిలా ఉండగా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పీవీ సింధు మళ్లీ టాప్–10లోకి ప్రవేశించింది. దాదాపు మూడు సంవత్సరాల విరామం తర్వాత ఆమె మళ్లీ అగ్ర పదిలో చోటు దక్కించుకుంది. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం సింధు 11వ స్థానంలో నుంచి ఒక మెట్టు ఎగబాకి 10వ ర్యాంక్‌కు చేరుకుంది. పారిస్ ఒలింపిక్స్ దృష్ట్యా ఈ పురోగతి సింధుకు ఉత్సాహాన్నిచ్చే అంశంగా క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.







