రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబయి ఇండియన్స్ తరఫున గత మూడు సీజన్లలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ప్రదర్శన తీవ్ర నిరాశకు గురి చేసింది. కెప్టెన్‌గా, ఆటగాడిగా రెండింటిలోనూ అతను విఫలమయ్యాడు. హార్దిక్ నాయకత్వంలో ఆడిన మూడు సీజన్లలో ముంబయి ఇండియన్స్ ఒక్కసారి మాత్రమే ప్లేఆఫ్స్ దశకు చేరుకుంది.
ఈ నేపథ్యంలో హార్దిక్ ముంబయి ఇండియన్స్‌ను వీడడం దాదాపు ఖాయమైందని క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత మూడు సంవత్సరాలుగా అతడి ఫామ్ అంతంతమాత్రంగానే ఉండటం, అంతర్జాతీయ క్రికెట్లోనూ అతని ప్రదర్శన పెద్దగా మెరుగు కాకపోవడం, ఫిట్‌నెస్ సమస్యలు వెంటాడుతున్నా.. ఐపీఎల్‌లో మాత్రం హార్దిక్‌కు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని సమాచారం.
32 ఏళ్ల హార్దిక్ పాండ్య కోసం మొత్తం ఎనిమిది ఫ్రాంఛైజీలలో ఏకంగా ఏడు జట్లు ఆసక్తి చూపుతున్నట్లు క్రికెట్ వర్గాల సమాచారం. రాయల్ చల్లేంగెర్స్ బెంగుళూరు , సుంరీసెర్స్ హైదరాబాద్ మినహా మిగతా అన్ని జట్లు హార్దిక్‌ను తమ జట్టులోకి తీసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ , కోల్కతా కింగ్స్ రైడర్స్ ఫ్రాంఛైజీలు హార్దిక్ కోసం గట్టిగా పోటీ పడుతున్నాయని తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ కూడా అతడిపై ఆసక్తి చూపుతున్న జట్లలో ఒకటిగా పేర్కొనబడుతోంది. హార్దిక్ సారథ్యంలో తొలి సీజన్‌లోనే విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ కూడా మళ్లీ అతడిని జట్టులోకి తీసుకోవడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
అదే సమయంలో లక్నో సూపర్ జెయింట్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ , పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీలు కూడా హార్దిక్ కోసం రేసులో ఉన్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. వేలానికి ముందు జరిగే ఆటగాళ్ల మార్పిడి (ట్రేడ్) ప్రక్రియలో భాగంగా హార్దిక్ పాండ్య మరో ఫ్రాంఛైజీకి మారే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
హార్దిక్ గతంలో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడి, ఆ జట్టుకు తొలి టైటిల్ అందించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. అనంతరం ముంబయి ఇండియన్స్‌కు తిరిగి చేరి నాయకత్వ బాధ్యతలు స్వీకరించినా, జట్టు ఫలితాలు, అతడి వ్యక్తిగత ప్రదర్శన రెండూ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ముంబయి యాజమాన్యం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
హార్దిక్ భవిష్యత్ గురించి, అతడిని ఎలాంటి ఫ్రాంఛైజీ దక్కించుకుంటుందనే అంశంపై అభిమానుల్లో, విశ్లేషకుల్లో ఆసక్తి నెలకొంది. ఆటగాళ్ల మార్పిడి, వేలం ప్రక్రియ పూర్తయ్యే వరకు హార్దిక్ తదుపరి గమ్యం ఏదో స్పష్టత రానుంది.







