శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిరలో ఉన్న కెనరా బ్యాంకు బ్రాంచ్‌లో జరిగిన భారీ గోల్డ్ లోన్ మోసం కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.30.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల దర్యాప్తు ప్రకారం, ఈ మోసంలో ప్రధాన నిందితుడు సుందరేశ చారి (33 సంవత్సరాలు), S/o నాగరాజా చారి , ఎస్. రాయపురం గ్రామం, గుడిబండ మండలం. ఇతను కెనరా బ్యాంకు , మడకశిర బ్రాంచ్‌లో గోల్డ్ Appraiser‌ గా పనిచేస్తూ తన అధికారిక హోదాను దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది.

దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, బ్యాంకుకు వచ్చే ఖాతాదారులతో నిందితుడు పరిచయాలు పెంచుకుని, వారికి మాయమాటలు చెప్పి వారి పేర్లపై నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టించాడు. అనంతరం వాటిని అసలైన బంగారంగా ధృవీకరించి, మొత్తం 7 మంది వ్యక్తుల పేర్లపై 12 గోల్డ్ లోన్ ఖాతాలు సృష్టించాడు.

ఈ ఖాతాల ద్వారా సుమారు 872.8 గ్రాముల నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి, మొత్తం రూ.70,66,000 విలువైన గోల్డ్ లోన్ మంజూరు చేయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విధంగా పొందిన డబ్బును నిందితుడు బెంగళూరు లో గుర్రపు పందేలు, విలాసవంతమైన జీవనం మరియు ఇతర వ్యక్తిగత వ్యసనాల కోసం ఖర్చు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది.

ఈ మోసం కెనరా బ్యాంకు , అనంతపూర్ రీజినల్ ఆఫీస్ నుంచి వచ్చిన re-appraisers బృందం నిర్వహించిన ఆకస్మిక తనిఖీ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. వారు తాకట్టు పెట్టిన బంగారం నకిలీదని గుర్తించడంతో, బ్యాంకు అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు మడకశిర పోలీస్ స్టేషన్ లో Cr.No.91/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా SP Sri S. సతీష్ కుమార్ , IPS ఆదేశాల మేరకు, అడిషనల్ SP శ్రీమతి అంకిత సౌరం , IPS పర్యవేక్షణలో, పెనుకొండ సుబ డివిజన్ ఇంచార్జి DSP శ్రీ నారాయణస్వామి మార్గదర్శకత్వంలో మడకశిర సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ రాజ్ కుమార్ సమగ్ర దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తు భాగంగా, ఈరోజు మడకశిర పట్టణంలోని Y.B. హళ్లి క్రాస్ వద్ద ప్రధాన నిందితుడు సుందరేశ చారి ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.30,20,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఇతరుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.