బ్రేకింగ్ న్యూస్
ఎర్రగుడిపాడు ఆలయ ఘటనపై స్పందించిన అధికారులు.. దళితులకు స్వామివారి దర్శనంప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు
Search

TAG

#గోల్

81 articles

ప్రొద్దుటూరులో దసరా శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో దసరా శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని హనుమాన్ నగర్‌లో దసరా శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ దుర్గా విజయ అంబిక మహిళా కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజూ అమ్మవారిని భిన్న అవతారాల్లో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, కోలాటం, భక్తి సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తుల సౌకర్యం, భద్రత, శానిటేషన్, పార్కింగ్‌పై నిర్వాహకులు ప్రత్యేక దృష్టి పెట్టారు.

13, అక్టో 2026

ఆసియా క్రీడలు క్రికెట్‌ సెమీస్‌లో శ్రీలంకపై భారత్‌ ఘన విజయం..
క్రీడలు

ఆసియా క్రీడలు క్రికెట్‌ సెమీస్‌లో శ్రీలంకపై భారత్‌ ఘన విజయం..

ఆసియా క్రీడల క్రికెట్‌ సెమీఫైనల్‌లో భారత్‌ శ్రీలంకను 124 పరుగుల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకుంది. ఇషాన్‌ కిషన్‌ 80 నాటౌట్‌తో మెరిపించగా, బుమ్రా, అక్షర్‌ పటేల్‌, అభిషేక్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌తో శ్రీలంక 45 పరుగులకే ఆలౌట్‌ అయింది. శనివారం ఫైనల్‌లో భారత్‌–పాకిస్థాన్‌ బంగారు పతక పోరు జరగనుండగా, మ్యాచ్‌ రద్దయినా నిబంధనల ప్రకారం స్వర్ణం టీమ్‌ ఇండియాకే దక్కనుంది.

1, అక్టో 2026

ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ లక్ష్యం… జపాన్‌తో కీలక పోరు ఇవాళ
క్రీడలు

ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ లక్ష్యం… జపాన్‌తో కీలక పోరు ఇవాళ

ఆసియా కప్ విజేత భారత మహిళా క్రికెట్ జట్టు ఇప్పుడు Hangzhou ఆసియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ లక్ష్యంగా Japan‌తో ఇవాళ ఉదయం 10.30 గంటలకు కీలక క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. Harmanpreet Kaur సారథ్యంలో స్టార్ ఆటగాళ్లతో బలంగా కనిపిస్తున్న భారత జట్టు, నాకౌట్ ఫార్మాట్‌లో ప్రతి మ్యాచ్‌ను కీలకంగా తీసుకుని ఆసియా కప్‌లో చూపిన ఆధిపత్యాన్ని Asian Games‌లో కూడా కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

18, సెప్టెం 2026

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ సెమీఫైనల్లో భారత్‌
క్రీడలు

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ సెమీఫైనల్లో భారత్‌

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు పాకిస్థాన్‌పై 19-0 తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మ్యాచ్‌ మొత్తం భారత్‌ ఆధిపత్యం చూపగా, పూజ మలిక్‌ హ్యాట్రిక్‌తో సహా పలువురు ఆటగాళ్లు గోల్స్‌ చేసి ప్రత్యర్థి రక్షణను పూర్తిగా దెబ్బతీశారు. సెమీఫైనల్లో కొరియా–మలేసియా మధ్య విజేతతో భారత్‌ తలపడనుండగా, టైటిల్‌ కోసం బలమైన పోటీదారుగా జట్టు నిలుస్తుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

11, సెప్టెం 2026

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ సెమీస్‌లో భారత్‌
క్రీడలు

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ సెమీస్‌లో భారత్‌

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీలో భారత పురుషుల జట్టు చైనీస్‌ తైపీపై 15-0 తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. కెప్టెన్‌ అన్మోల్‌ ఎక్కా ఆరు గోల్స్‌ నమోదు చేయగా, ఆర్యన్‌, హర్‌పాల్‌ తలో మూడు, రెండు గోల్స్‌ చేశారు. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఒక డ్రాతో 10 పాయింట్లు సాధించిన భారత్‌ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

10, సెప్టెం 2026

జూనియర్‌ ఆసియా కప్‌ హాకీలో భారత్‌ దూకుడు కొనసాగింపు
క్రీడలు

జూనియర్‌ ఆసియా కప్‌ హాకీలో భారత్‌ దూకుడు కొనసాగింపు

జూనియర్‌ ఆసియా కప్‌లో పురుషుల హాకీ జట్టు కొరియాపై 7-3తో ఘనవిజయం సాధించి, పూల్‌-ఎలో రెండు విజయాలు, ఒక డ్రాతో 7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మహిళల జూనియర్‌ ఆసియా కప్‌లో భారత జట్టు జపాన్‌ను 7-0తో చిత్తు చేసి, మూడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో 9 పాయింట్లు సాధించి క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

9, సెప్టెం 2026

జపాన్‌తో డ్రా.. ఓటమి అంచులనుంచి బయటపడిన భారత్‌
క్రీడలు

జపాన్‌తో డ్రా.. ఓటమి అంచులనుంచి బయటపడిన భారత్‌

జూనియర్‌ ఆసియాకప్‌లో భారత పురుషుల హాకీ జట్టు జపాన్‌తో పూల్‌-ఎ మ్యాచ్‌లో చివరి నిమిషంలో గోల్‌ చేసి 3-3తో డ్రా సాధించి ఓటమి నుంచి తప్పించుకుంది. ఒక విజయం, ఒక డ్రాతో భారత్‌ పాయింట్లు సమకూర్చుకుని మంగళవారం కొరియాతో తలపడనుంది. మహిళల విభాగంలో భారత్‌ మలేసియాపై 11-1 తేడాతో ఘన విజయం సాధించి అద్భుత ఫామ్‌ను కొనసాగించింది.

7, సెప్టెం 2026

హాకీ ప్రపంచకప్‌ కైవసం చేసుకున్న జర్మనీ
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌ కైవసం చేసుకున్న జర్మనీ

పురుషుల హాకీ ప్రపంచకప్‌ను జర్మనీ 1-0 తేడాతో స్పెయిన్‌పై గెలిచి నాలుగోసారి కైవసం చేసుకుంది. 44వ నిమిషంలో మైకెల్‌ స్ట్రూతాఫ్‌ చేసిన ఏకైక గోల్‌నే మ్యాచ్‌ నిర్ణయాత్మకమై, జర్మనీని అత్యధిక టైటిళ్లు గెలుచుకున్న పాకిస్థాన్‌తో సమానంగా నిలిపింది. మూడో స్థాన పోరులో అర్జెంటీనా, నెదర్లాండ్స్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది.

31, ఆగ 2026

2002, 2010 తర్వాత మళ్లీ అదే కథ… డచ్‌ను మట్టికరిపించిన అర్జెంటీనా మహిళలు
క్రీడలు

2002, 2010 తర్వాత మళ్లీ అదే కథ… డచ్‌ను మట్టికరిపించిన అర్జెంటీనా మహిళలు

మహిళల హాకీ ప్రపంచకప్‌లో అర్జెంటీనా 3-1 షూటౌట్‌ తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించి మూడోసారి టైటిల్‌ గెలుచుకుంది. నిర్ణీత సమయం వరకు 1-1తో సమంగా నిలిచిన మ్యాచ్‌లో విక్టోరియా గ్రానాటో, బ్రిసా, సోఫియా కైరోలు షూటౌట్‌లో గోల్స్‌ చేసి అర్జెంటీనాకు విజయం అందించగా, మరో మ్యాచ్‌లో బెల్జియం 1-0తో ఆస్ట్రేలియాపై గెలిచి కాంస్య పతకం సాధించింది.

30, ఆగ 2026

బెల్జియం చేతిలో భారత్ ఓటమి.. ఏడో స్థానమూ దక్కలేదు
క్రీడలు

బెల్జియం చేతిలో భారత్ ఓటమి.. ఏడో స్థానమూ దక్కలేదు

హాకీ ప్రపంచకప్‌లో 7-8 స్థానాల వర్గీకరణ మ్యాచ్‌లో భారత్‌ పెనాల్టీ షూటౌట్‌లో బెల్జియం చేతిలో 3-4 తేడాతో ఓడి ఎనిమిదో స్థానంతో టోర్నీని ముగించింది. నిర్ణీత సమయంలో భారత్‌, బెల్జియం 3-3తో సమంగా నిలవగా, షూటౌట్‌లో తొలి రెండు ప్రయత్నాలు విఫలమైన భారత్‌ అవకాశాన్ని కోల్పోయి, జాతీయ క్రీడా దినోత్సవం ముందు ఈ ఓటమి భారత హాకీకి నిరాశను మిగిల్చింది.

29, ఆగ 2026

జర్మనీపై ఘన విజయం.. మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు అయిదో స్థానం
క్రీడలు

జర్మనీపై ఘన విజయం.. మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు అయిదో స్థానం

మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ జర్మనీపై 3-1 తేడాతో గెలిచి అయిదో స్థానం సాధించింది. ఇషిక ఒక గోల్‌, నవ్‌నీత్‌ కౌర్‌ రెండు గోల్స్‌ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. 1974 తర్వాత ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు సాధించిన ఇదే అత్యుత్తమ స్థానం కావడం విశేషం.

28, ఆగ 2026

ముగిసిన మహిళల ఆంధ్ర ప్రిమియర్ లీగ్ వేలం
క్రీడలు

ముగిసిన మహిళల ఆంధ్ర ప్రిమియర్ లీగ్ వేలం

మహిళల ఆంధ్ర ప్రిమియర్ లీగ్ తొలి సీజన్ ఆటగాళ్ల వేలం విజయవాడలో పూర్తయ్యింది. 191 మంది క్రికెటర్లలో 74 మందిని నాలుగు ఫ్రాంఛైజీలు ఎంపిక చేశాయి. హెర్నిటా ప్లవియా ఫెరీరా రూ.4.30 లక్షలకు గోదావరి గోల్డెన్ ఈగల్స్‌కు, అంజలి శర్వాణి రూ.3.60 లక్షలకు వైజాగ్ ఫైర్ బర్డ్స్‌కు దక్కగా, 12 ఏళ్ల సాయి షణ్ముకప్రియ పిన్న వయస్కురాలిగా రాయలసీమ జెన్ స్టార్స్ తరఫున ఆడనుంది.

26, ఆగ 2026

తిరుపతి SBFC గోల్డ్ లోన్ బ్రాంచ్‌లో మోసం ఆరోపణలు
జిల్లా వార్తలు

తిరుపతి SBFC గోల్డ్ లోన్ బ్రాంచ్‌లో మోసం ఆరోపణలు

తిరుపతి RC రోడ్‌లోని SBFC గోల్డ్ లోన్ బ్రాంచ్‌లో ఎంప్లాయీ సునీల్ తన బంగారం విడుదల చేస్తానని నమ్మబలికి 2.5 లక్షలు తీసుకుని పరారయ్యాడని బాధితుడు లోకేష్ ఆరోపిస్తున్నారు. బ్రాంచ్ స్టాఫ్, మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యంపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన న్యాయం జరిగే వరకు బ్రాంచ్‌లోనే నిరసన కొనసాగిస్తానని హెచ్చరిస్తూ, SBFC ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

19, ఆగ 2026

మహిళల హాకీ ప్రపంచకప్‌కి భారత్‌ డ్రాతో ఆరంభం
క్రీడలు

మహిళల హాకీ ప్రపంచకప్‌కి భారత్‌ డ్రాతో ఆరంభం

మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ తన తొలి పూల్‌-డి మ్యాచ్‌ను చైనా జట్టుతో 2-2 డ్రాగా ముగించింది. నవనీత్‌ కౌర్‌, దీపిక గోల్స్‌తో భారత్‌ రెండు సార్లు ఆధిక్యంలోకి వెళ్లినా, చైనా రెండుసార్లు సమం చేసింది. బలమైన చైనా జట్టుతో డ్రా భారత్‌కు ధైర్యాన్నిచ్చినప్పటికీ, పూర్తి మూడు పాయింట్లు కోల్పోవడం కొంత నిరాశ కలిగించే అంశంగా జట్టు భావిస్తోంది.

18, ఆగ 2026

వేల్స్‌పై భారత్ ఘన విజయం… వరల్డ్ కప్‌కు శుభారంభం
క్రీడలు

వేల్స్‌పై భారత్ ఘన విజయం… వరల్డ్ కప్‌కు శుభారంభం

నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టెల్‌వీన్‌లో జరిగిన హాకీ వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్‌లో భారత్ Wales‌పై 3-1 తేడాతో విజయం సాధించి టోర్నీకి శుభారంభం చేసింది. పెనాల్టీ కార్నర్లను సమర్థంగా వినియోగించిన భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్, సంజయ్ ఒక గోల్ చేశారు. చివర్లో Wales ఒక గోల్ చేసినప్పటికీ భారత రక్షణ, గోల్‌కీపర్లు మెరుగైన ఆటతో ఆధిక్యాన్ని కాపాడారు.

16, ఆగ 2026

శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల భారీ గోల్డ్ లోన్ మోసం కేసు కీలక విజయం
జిల్లా వార్తలు

శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల భారీ గోల్డ్ లోన్ మోసం కేసు కీలక విజయం

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలోని Canara Bank బ్రాంచ్‌లో గోల్డ్ లోన్ మోసం కేసును పోలీసులు ఛేదించి, ప్రధాన నిందితుడు Sundaresha Chariని అరెస్ట్ చేసి రూ.30.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. Gold Appraiser‌గా పనిచేసిన నిందితుడు 7 మంది పేర్లపై 12 నకిలీ గోల్డ్ లోన్ ఖాతాలు సృష్టించి రూ.70.66 లక్షలు మోసం చేసినట్లు దర్యాప్తులో తేలగా, కేసులో ఇతరుల పాత్రపై విచారణ కొనసాగుతోంది.

8, ఆగ 2026

తిరుపతి జిల్లాలో జ్యువెలరీ, పాన్ బ్రోకర్ దుకాణాలకు భద్రతా ప్రమాణాలు తప్పనిసరి
జిల్లా వార్తలు

తిరుపతి జిల్లాలో జ్యువెలరీ, పాన్ బ్రోకర్ దుకాణాలకు భద్రతా ప్రమాణాలు తప్పనిసరి

తిరుపతి జిల్లా పోలీసు ఆధ్వర్యంలో జ్యువెలరీ, పాన్ బ్రోకర్ దుకాణాల యజమానులతో భద్రతా చర్యలు, ఆస్తి నేరాల నివారణపై అవగాహన సమావేశం నిర్వహించారు. సీసీటీవీ కెమెరాలు, లావాదేవీల పూర్తి రికార్డులు, KYC ధృవీకరణ తప్పనిసరి చేయాలని, అనుమానాస్పద బంగారం, వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేసి, పోలీసులతో సమన్వయంగా పనిచేస్తామని దుకాణ యజమానులు హామీ ఇచ్చారు.

7, ఆగ 2026

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జూడో చరిత్ర: అస్మితా దే, హర్షసింగ్‌లకు స్వర్ణాలు
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జూడో చరిత్ర: అస్మితా దే, హర్షసింగ్‌లకు స్వర్ణాలు

గ్లాస్గోలో జరుగుతున్న 23వ కామన్వెల్త్ గేమ్స్‌లో జూడో విభాగంలో అస్మితా దే మహిళల 48 కిలోలలో, హర్షసింగ్ పురుషుల 60 కిలోలలో స్వర్ణ పతకాలు సాధించి భారత జూడో చరిత్రలో మైలురాళ్లు నిలిచారు. మొత్తం గా భారత్ ఇప్పటివరకు 5 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలతో 19 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది.

1, ఆగ 2026

ఇండియాలో 8-12% వ్యవసాయేతర ఉద్యోగాలపై జెన్AI ప్రభావం: గోల్డ్మన్ సాచ్స్  నివేదిక
జాతీయం

ఇండియాలో 8-12% వ్యవసాయేతర ఉద్యోగాలపై జెన్AI ప్రభావం: గోల్డ్మన్ సాచ్స్ నివేదిక

గోల్డ్మన్ సాచ్స్ నివేదిక ప్రకారం జెన్AI ప్రభావంతో INDలో వ్యవసాయేతర రంగాల్లో 8-12% ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, సేవా రంగాల్లో 42-48% ఉద్యోగుల పనిని ఇది సులభతరం చేయనుంది. టెలికం, కస్టమర్ కేర్, డేటా ఎంట్రీ రంగాల్లో ప్రత్యక్ష ప్రభావం ఎక్కువగా ఉండగా, నైపుణ్యాలను అప్‌డేట్ చేసుకుంటే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడతాయని నివేదికలో విశ్లేషించింది.

30, జులై 2026

ప్రొద్దుటూరు ఇండియన్ బ్యాంక్‌లో నగదు కొరత.. ఖాతాదారుల ఆందోళన
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు ఇండియన్ బ్యాంక్‌లో నగదు కొరత.. ఖాతాదారుల ఆందోళన

ప్రొద్దుటూరు గాంధీరోడ్డు ఇండియన్ బ్యాంక్ శాఖలో సోమవారం నగదు కొరత, సర్వర్ లోపం కారణంగా లావాదేవీలు తీవ్రంగా మందగించాయి. నగదు డ్రా, గోల్డ్ లోన్స్ కోసం ఉదయం నుంచే వచ్చిన ఖాతాదారులు గంటల తరబడి వేచి చూడాల్సి రావడంతో అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేశారు. నగదు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని బ్యాంక్ అధికారులు చెప్పగా, ఖాతాదారుల ఇబ్బందులను త్వరగా తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.

27, జులై 2026

కామన్వెల్త్ గేమ్స్ లో  భారత్‌కు తొలి స్వర్ణం..   చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్ లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం వచ్చింది. 48 కిలోల విభాగంలో మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మీరాబాయి చాను పసిడి పతకం సాధించింది.

26, జులై 2026

ఉక్రెయిన్‌లో ఓడపై దాడి.. నలుగురు భారతీయుల మృతి
అంతర్జాతీయం

ఉక్రెయిన్‌లో ఓడపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

ఉక్రెయిన్‌లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరిన ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడ్డాడు.

21, జులై 2026

ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో.. స్పెయిన్‌ అద్భుత విజయం
క్రీడలు

ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో.. స్పెయిన్‌ అద్భుత విజయం

ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో స్పెయిన్‌ అదరగొట్టింది.. సమష్టి ఆట, కట్టుదిట్టమైన రక్షణ, వేగవంతమైన దాడులతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనాను మట్టికరిపించి.. అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. టీమ్‌లో మేటి స్టార్స్ లేకపోయినా.. సమష్టిగా సత్తా చాటి ఫుట్‌బాల్‌ జగజ్జేతగా నిలిచింది.

20, జులై 2026

ఫిఫా ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌దే మూడో స్థానం
క్రీడలు

ఫిఫా ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌దే మూడో స్థానం

ఫిఫా ప్రపంచ కప్‌ 2026లో మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఇంగ్లాండ్‌ 6-4 తేడాతో ఫ్రాన్స్‌ను ఓడించి తొలిసారి బ్రాంజ్‌ మెడల్‌ సాధించింది. గోల్స్‌ వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో బుకాయో సకా హ్యాట్రిక్‌తో మెరిశాడు. మరోవైపు ఫ్రాన్స్‌ స్టార్‌ క్లియాన్‌ ఎంబాపె ప్రపంచ కప్‌ చరిత్రలో అత్యధికంగా 22 గోల్స్‌ చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు.

19, జులై 2026

మహిళల హాకీ ప్రపంచకప్‌కు సలీమా టెటె సారథ్యం
క్రీడలు

మహిళల హాకీ ప్రపంచకప్‌కు సలీమా టెటె సారథ్యం

మహిళల హాకీ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు సలీమా టెటె కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆగస్టు 15 నుంచి నెదర్లాండ్స్, బెల్జియం వేదికగా జరిగే ఈ టోర్నమెంట్‌లో పోటీపడే 20 మంది సభ్యుల జట్టులో సీనియర్, జూనియర్‌ ఆటగాళ్లకు సమతూకంగా అవకాశం లభించగా, ఇదే బృందం సెప్టెంబర్‌లో జరిగే ఆసియా క్రీడల్లోనూ భారత తరఫున ఆడనుంది.

18, జులై 2026

హైదరాబాద్ లో ప్రారంభమైన ఆషాఢ బోనాలు
తెలంగాణ

హైదరాబాద్ లో ప్రారంభమైన ఆషాఢ బోనాలు

ఆషాఢ బోనాల ఉత్సవాలు నేడు గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పణతో వైభవంగా ప్రారంభమవుతున్నాయి. నెలరోజుల పాటు తెలంగాణలోని గోల్కొండ, బల్కంపేట, సికింద్రాబాద్, లాల్ దర్వాజా ఆలయాల్లో బోనాలు, కళ్యాణోత్సవాలు జరుగుతాయి. భక్తుల సౌకర్యం, భద్రత కోసం ప్రభుత్వం తాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు వంటి ఏర్పాట్లు పూర్తి చేసింది.

16, జులై 2026

చిన్నారుల భద్రతపై మరోసారి ఆందోళన: తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై ప్రశ్నలు
జాతీయం

చిన్నారుల భద్రతపై మరోసారి ఆందోళన: తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై ప్రశ్నలు

దేశంలో చిన్నారులపై జరుగుతున్న నేరాలు, ముఖ్యంగా శ్రీగంగానగర్ ఘటన, ఢిల్లీ గోల్ మార్కెట్ వీడియోలతో మరోసారి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నిపుణులు చిన్నారుల భద్రతను కేవలం పోలీసుల బాధ్యతగా కాకుండా తల్లిదండ్రులు, పాఠశాలలు, సమాజం కలిసి పర్యవేక్షిస్తూ, పిల్లలకు అపరిచితులతో మాట్లాడకూడదనే అవగాహన కల్పించడం అత్యంత అవసరమని హెచ్చరిస్తున్నారు.

16, జులై 2026

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో అర్జెంటీనా
క్రీడలు

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో అర్జెంటీనా

అట్లాంటాలో జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1తో ఇంగ్లాండ్‌ను ఓడించి వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ ఫైనల్లోకి చేరింది. 85వ నిమిషంలో ఎంజో ఫెర్నాండెజ్, 90+2 నిమిషంలో లాతరో మార్టినెజ్ గోల్స్‌తో అర్జెంటీనాకు విజయం లభించింది. ఇప్పుడు మెస్సి సారథ్యంలో నాలుగో టైటిల్‌ కోసం అర్జెంటీనా, రెండో కప్పు కోసం స్పెయిన్‌ ఫైనల్లో తలపడనుండటంతో ప్రపంచ ఫుట్‌బాల్‌ అభిమానుల దృష్టి ఈ పోరుపై నిలిచింది.

16, జులై 2026

ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో స్పెయిన్‌
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో స్పెయిన్‌

స్పెయిన్‌ జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు 2026 ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఫ్రాన్స్‌పై 2-0 తేడాతో విజయం సాధించి రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమి లేకుండా దాడి, రక్షణ విభాగాల్లో సమతూకమైన ఆటతో ముందుకు సాగిన స్పెయిన్‌ 2010 తర్వాత మరోసారి టైటిల్‌ కోసం బరిలోకి దిగబోతోంది.

15, జులై 2026

జొన్నగిరి గోల్డ్ మైన్స్ విస్తరణకు ఏపీ ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్
జిల్లా వార్తలు

జొన్నగిరి గోల్డ్ మైన్స్ విస్తరణకు ఏపీ ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్

కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్స్ విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి, అదనంగా 998 ఎకరాల భూసేకరణకు అనుమతి ఇచ్చింది. దేవాదాయ శాఖకు చెందిన 40 ఎకరాలను లీజు ప్రాతిపదికన వినియోగించుకునేందుకు కూడా ఆమోదం తెలిపి, భూసేకరణ, లీజు ప్రక్రియలను వేగవంతంగా, చట్టబద్ధంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది.

13, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters