పుట్టపర్తి : ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఇంధన పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయన ఎలక్ట్రికల్‌ బైక్‌పై ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఎనుములపల్లిలోని తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఆధార్‌ సేవా కేంద్రం ప్రారంభోత్సవానికి సైతం ఈ–బైక్‌పైనే వెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... ఈ–బైక్‌లతో ఇంధన పొదుపుతో పాటు కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చన్నారు. అనంతరం ఆయన ఎనుములపల్లిలో ఎమ్మెల్యే సింధూరారెడ్డితో కలిసి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ గారు.