స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకునేందుకు Vivo మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. కంపెనీ సరికొత్త Vivo X300 E మోడల్‌ను అధికారికంగా ప్రకటించింది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్‌కు ప్రీ-సేల్స్ ప్రారంభమయ్యాయి. కీలక ఫీచర్లు, డిజైన్, కెమెరా సెటప్, బ్యాటరీ సామర్థ్యం వంటి అంశాలతో ఈ ఫోన్ ఇప్పటికే టెక్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.

Vivo అధికారిక వెబ్‌సైట్‌లో Vivo X300 E ప్రీ-సేల్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ జూలై 27 నుంచి మార్కెట్లో అమ్మకానికి రానుంది. ఇటీవల భారత మార్కెట్లో లాంచ్ చేసిన వివో X300 FEతో పోలిస్తే X300 E డిజైన్‌లో కొంత భిన్నత కనిపిస్తోంది. అయితే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, మెటల్ ఫ్రేమ్ వంటి ముఖ్యమైన డిజైన్ అంశాలు కొనసాగుతున్నాయి.

ఈ మోడల్‌కు V2612A అనే మోడల్ నంబర్ కేటాయించారు. నెట్‌వర్క్ యాక్సెస్ లైసెన్స్‌లో కూడా ఇదే మోడల్ నంబర్ కనిపించింది. Vivo X300 Eలో Zeiss ఇమేజింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఫోన్ బ్లాక్, వైట్, నారెంజ్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది.

డిస్‌ప్లే విషయానికి వస్తే, Vivo X300 Eలో 6.59-అంగుళాల 1.5K ఫ్లాట్ అమోల్డ్ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. 2750×1260 పిక్సెల్స్ రిజల్యూషన్, HDR10+ సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ డిస్‌ప్లే ముఖ్య లక్షణాలు. గేమింగ్, మల్టీమీడియా వినియోగదారులకు ఇవి ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది.

సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ Android 16 ఆధారిత ఆరిజిన్OS 6పై రన్ అవుతుంది. పవర్ కోసం 7015mAh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. దీర్ఘకాలిక వినియోగం, వేగవంతమైన ఛార్జింగ్‌ను కోరుకునే వినియోగదారులకు ఇది ప్లస్ పాయింట్‌గా మారే అవకాశం ఉంది.

కెమెరా సెటప్‌లో Vivo X300 E ప్రత్యేకంగా నిలుస్తోంది. వెనుక భాగంలో f/1.57 అపర్చర్, OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, f/2.65 అపర్చర్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం f/2.0 అపర్చర్‌తో 50MP ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంటుంది.

సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్‌లతో ఈ ఫోన్ వస్తోంది. డిజైన్ పరంగా 7.99 మిల్లీమీటర్ల మందం, 203 గ్రాముల బరువుతో ఈ మోడల్ రూపొందించారు.