రాయలసీమ న్యూస్:
తిరుమల శ్రీవారిని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా శుక్రవారం దర్శించుకున్నారు. అలిపిరి నుంచి నడకమార్గంలో తిరుమలకు చేరుకున్న ఆమె ముందుగా శ్రీభూవరాహ స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1 గుండా ఆలయం వద్దకు చేరుకున్నారు. తితిదే డిప్యూటీ ఈవో ఆర్-1 భాస్కర్ ఆమెకు స్వాగతం పలికి, ప్రత్యేక ప్రవేశ దర్శన మార్గంలో మూలమూర్తి దర్శనం చేయించారు. ఇటీవల పవన్‌కల్యాణ్ భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిన నేపథ్యంలో ఆమె తిరుమలకు వచ్చినట్లు సమాచారం. శనివారం మరోమారు శ్రీవారి సేవలో పాల్గొననున్నారు.













