బ్రేకింగ్ న్యూస్
ఎర్రగుడిపాడు ఆలయ ఘటనపై స్పందించిన అధికారులు.. దళితులకు స్వామివారి దర్శనంప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు
Search

TAG

#పవన్

110 articles

స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగరేద్దాం: సమిష్టి కృషికి పవన్‌ కల్యాణ్‌ పిలుపు
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగరేద్దాం: సమిష్టి కృషికి పవన్‌ కల్యాణ్‌ పిలుపు

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి జన సైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. పొత్తు ధర్మానికి అనుగుణంగా జన సైనికులకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని, అభ్యర్థుల ఎంపికలో స్థానిక పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు, కార్యకర్తల సూచనలను పరిగణలోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

12, అక్టో 2026

జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరి దేవస్థానంలో హుండీ లెక్కింపు
ఆంధ్రప్రదేశ్

జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరి దేవస్థానంలో హుండీ లెక్కింపు

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 90 రోజుల హుండీ లెక్కింపులో 17 లక్షల 26 వేల 166 రూపాయలు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. పవన్‌ కూమార్‌ పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహించిన ఈ లెక్కింపులో వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు వినియోగించేలా ధర్మకర్తల మండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

8, అక్టో 2026

సీఎం పర్యటనకు ప్రొద్దుటూరులో ‘లైవ్ శానిటేషన్’ ఏర్పాట్లు
జిల్లా వార్తలు

సీఎం పర్యటనకు ప్రొద్దుటూరులో ‘లైవ్ శానిటేషన్’ ఏర్పాట్లు

ప్రొద్దుటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీ ‘లైవ్ శానిటేషన్’ వ్యవస్థను అమలు చేయనుంది. సభా ప్రాంగణం, వివిఐపి ప్రాంతాల్లో చెత్త కనిపించగానే 200 మంది శానిటేషన్ కార్మికులు, 50 మంది సిబ్బంది వెంటనే స్పందించేలా బాధ్యతలు కేటాయించగా, మొత్తం 750 మంది సిబ్బందితో పట్టణం పూర్తిగా పరిశుభ్రంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు.

5, అక్టో 2026

ప్రొద్దుటూరు పర్యటనకు ప్రత్యేక బస్సులు: APSRTC–ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సమీక్ష
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు పర్యటనకు ప్రత్యేక బస్సులు: APSRTC–ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సమీక్ష

ప్రొద్దుటూరు పర్యటనను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభలకు వచ్చే ప్రజల రవాణా ఏర్పాట్లపై APSRTC అధికారులు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డితో కామనూరు రాధానగర్‌లో సమావేశమయ్యారు. అదనపు బస్సు సర్వీసులు, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ల ఎంపిక, భద్రతా చర్యలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలపై సమగ్రంగా చర్చించినట్లు సమాచారం.

2, అక్టో 2026

మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన
జిల్లా వార్తలు

మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన

మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌ సమక్షంలో శంకుస్థాపన జరిగింది. లక్ష కోట్ల పెట్టుబడితో రాయలసీమలో హార్టికల్చర్‌ పంటల ఉత్పత్తి, ప్రాసెసింగ్, ఎగుమతులు, ఆధునిక వ్యవసాయ విద్య, పరిశోధనలకు కొత్త అవకాశాలు తెరుచుకుని, రైతుల ఆదాయం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి బలమైన వేదికగా మారనుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

2, అక్టో 2026

మదనపల్లిలో ‘రాయలసీమ ఉద్యాన హబ్’కు నేడు శంకుస్థాపన
జిల్లా వార్తలు

మదనపల్లిలో ‘రాయలసీమ ఉద్యాన హబ్’కు నేడు శంకుస్థాపన

మదనపల్లిలో నేడు ‘రాయలసీమ ఉద్యాన హబ్’కు శంకుస్థాపన జరగనుండగా, కార్యక్రమానికి నిర్మలసీతారామన్ , చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ హాజరుకానున్నారు. సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడితో అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమను ప్రపంచ స్థాయి పండ్ల ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు, దేశంలో తొలి ‘ ఇండియన్ స్కూల్ అఫ్ అగ్రికల్చర్ ’ స్థాపన ద్వారా వ్యవసాయ విద్య, పరిశోధనకు కొత్త దిశ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

2, అక్టో 2026

రెండో వన్డేలో లంక గెలుపు
క్రీడలు

రెండో వన్డేలో లంక గెలుపు

లీడ్స్‌లో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 16 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కుశాల్ మెండిస్ శతకం, కమిందు మెండిస్, పవన్ రత్నాయకే కీలక ఇన్నింగ్స్‌తో శ్రీలంక 321 పరుగులు చేయగా, వెల్లలాగె, మధుశంక, ఇషాన్ మలింగల బౌలింగ్‌తో ఇంగ్లాండ్ 305 పరుగులకే పరిమితమై, సిరీస్ ఫలితం ఇప్పుడు మూడో వన్డేపైనే నిలిచింది.

26, సెప్టెం 2026

ప్రొద్దుటూరులో జనసేన కేడర్ సమావేశం:స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవ్వాలని పిలుపు
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో జనసేన కేడర్ సమావేశం:స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవ్వాలని పిలుపు

ప్రొద్దుటూరులో జరిగిన జనసేన కేడర్ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని, బూత్ స్థాయిలో బలమైన నెట్‌వర్క్‌ నిర్మించుకోవాలని నాయకులు సూచించారు.పవన్ కళ్యాణ్ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించి, జనసేన అభ్యర్థులు గరిష్ట విజయాలు సాధించేలా కేడర్ సమన్వయంతో కట్టుదిట్టంగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.

24, సెప్టెం 2026

పదవి వచ్చిన వెంటనే మారిపోవద్దు: నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్

పదవి వచ్చిన వెంటనే మారిపోవద్దు: నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరిక

డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదవి, అధికారం వచ్చిన వెంటనే ప్రజలకు దూరమవుతున్న నేతల ధోరణిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పదవులు శాశ్వతం కావని, ప్రజల సమస్యలు వింటూ వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రతి ప్రజాప్రతినిధి ధర్మమని ఆయన సూచించినట్టు సమాచారం. వ్యక్తిగత, వర్గ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, పదవి కోల్పోయిన తర్వాత కూడా ప్రజల మధ్య ఉండే నాయకుడే నిజమైన ప్రజానాయకుడని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

23, సెప్టెం 2026

ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత్‌కు రెండు పతకాలు ఖాయం
క్రీడలు

ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత్‌కు రెండు పతకాలు ఖాయం

అహ్మదాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో విజువల్లీ ఇంపైర్డ్‌ 1 విభాగంలో యుగళ్‌ గార్గ్‌, పవన్‌ కుమార్‌, తన్వి ప్రవీణ్‌ సెమీఫైనల్‌కు చేరడంతో భారత్‌కు కనీసం రెండు పతకాలు ఖాయం అయ్యాయి. మహిళల కాంపౌండ్‌ సింగిల్స్‌లో శీతల్‌ దేవి, పురుషుల కాంపౌండ్‌లో రాకేశ్‌ అగ్రస్థానాల్లో నిలవగా, శీతల్‌–రాకేశ్‌ మిక్స్‌డ్‌ కాంపౌండ్‌ జోడీ 1400 పాయింట్లతో ప్రపంచ రికార్డు స్థాయిలో ప్రదర్శన ఇచ్చి మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

7, సెప్టెం 2026

పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ప్రొద్దుటూరులో సేవా కార్యక్రమాలు
జిల్లా వార్తలు

పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ప్రొద్దుటూరులో సేవా కార్యక్రమాలు

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా-జనసేన కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథ శరణాలయంలో అన్నదానం చేసి, చిన్నారులతో సమయం గడిపారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలు, ప్రజా సేవలో దీర్ఘకాలం కొనసాగాలని ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఈ కార్యక్రమం స్థానికుల ప్రశంసలు అందుకుంది.

2, సెప్టెం 2026

బీసీలకు 34% రిజర్వేషన్లు చారిత్రాత్మకం: నరసింహ యాదవ్
జిల్లా వార్తలు

బీసీలకు 34% రిజర్వేషన్లు చారిత్రాత్మకం: నరసింహ యాదవ్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం చారిత్రాత్మకమని, ఇది బీసీల రాజకీయ, సామాజిక శక్తివంతతకు కీలక మలుపు అవుతుందని గొల్ల నరసింహ యాదవ్ అభిప్రాయపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు తగ్గించి నాయకత్వాన్ని బలహీనపరిచిందని విమర్శిస్తూ, ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్ని వర్గాలు స్వాగతించాలని ఆయన కోరారు.

19, ఆగ 2026

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ
జిల్లా వార్తలు

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ

నాయుడుపేట నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల మనసులు గెలుచుకుంటున్న ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా టీడీపీ నేత కట్టా వెంకటరమణారెడ్డి అభివర్ణించారు. చిగురుపాడు గ్రామంలో రూ.32 లక్షల వ్యయంతో పంచాయతీ భవన సముదాయం నిర్మాణానికి భూమి పూజ చేసి, "రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం" కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

8, ఆగ 2026

డీఎస్సీ నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన నిస్సార్ అహమ్మద్
జిల్లా వార్తలు

డీఎస్సీ నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన నిస్సార్ అహమ్మద్

మదనపల్లె వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్, టౌన్‌లో జరుగుతున్న డీఎస్సీ అభ్యర్థుల రిలే నిరాహార దీక్షకు మద్దతు ప్రకటిస్తూ, పవన్ కళ్యాణ్ వరుసగా క్యాబినెట్ సమావేశాలకు గైర్హాజరు కావడంపై సందేహాలు వ్యక్తం చేశారు. డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపి అభ్యర్థులకు పూర్తి న్యాయం చేయాలని, నారా లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

8, ఆగ 2026

కొత్త రహదారులతో కళకళలాడుతున్న పిఠాపురం నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్

కొత్త రహదారులతో కళకళలాడుతున్న పిఠాపురం నియోజకవర్గం

పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో రహదారి అభివృద్ధి వేగంగా సాగుతోంది. వివిధ శాఖల నిధులతో 307 కిలోమీటర్ల కొత్త రహదారుల నిర్మాణానికి రూ. 200 కోట్లకు పైగా వెచ్చించి, ఇప్పటివరకు 152 కిలోమీటర్ల పొడవు గల 611 రహదారులు పూర్తయ్యాయి. మత్స్యకారుల పునరావాస కాలనీలు, SEZ పరిధి గ్రామాలు, శ్మశాన వాటికలు, బీచ్ రహదారులకు సీసీ, గ్రావెల్ రహదారులు ఏర్పాటు కావడంతో ప్రజల రాకపోకలు, జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి.

6, ఆగ 2026

పవన్ కళ్యాణ్ ‘OG2’ ఆలస్యం: అభిమానుల్లో నిరాశ
సినిమా

పవన్ కళ్యాణ్ ‘OG2’ ఆలస్యం: అభిమానుల్లో నిరాశ

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించిన ‘OG’ విజయానంతరం ప్రకటించిన ‘OG2’ ఆలస్యమవుతున్న నేపథ్యంలో అభిమానుల్లో నిరాశ నెలకొంది. పవన్ కళ్యాణ్ భుజానికి జరిగిన శస్త్రచికిత్సలు, ఆయనకు అవసరమైన రికవరీ సమయం, అలాగే దర్శకుడు సుజీత్ నానీతో చేస్తున్న ‘బ్లడీ రోమియో’ ప్రాజెక్ట్ కారణంగా ‘OG2’ షూటింగ్ 2027 రెండోార్ధంలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

5, ఆగ 2026

గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనుల్లో వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం
ఆంధ్రప్రదేశ్

గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనుల్లో వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం

గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనుల్లో వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ ఏడాది లక్ష్యాలను వాతావరణ అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయాలని సూచిస్తూ, మడ అడవుల విస్తరణలో రాష్ట్రం దేశంలో ద్వితీయ స్థానం సాధించిందని గుర్తుచేశారు. తీర ప్రాంత రక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో గ్రేట్ గ్రీన్ వాల్, తాటి వనాలు, మడ అడవుల విస్తరణ కీలకమని ఆయన స్పష్టం చేశారు.

5, ఆగ 2026

నంద్యాల జిల్లా డోన్‌లో గ్యాంగ్ వార్ కలకలం
జిల్లా వార్తలు

నంద్యాల జిల్లా డోన్‌లో గ్యాంగ్ వార్ కలకలం

నంద్యాల జిల్లా డోన్‌లోని TR నగర్‌లో రెండు వర్గాల యువకుల మధ్య ఆధిపత్య పోరుతో గ్యాంగ్ వార్ చోటుచేసుకుని బండలు, రాళ్లతో పరస్పర దాడులు జరగడంతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

3, ఆగ 2026

తెలుగు ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తున్న మోదీ : పవన్‌
రాజకీయాలు

తెలుగు ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తున్న మోదీ : పవన్‌

140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రధాని మోదీ సాకారం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

1, ఆగ 2026

భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
జాతీయం

భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

భోగాపురం ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు ఉన్నారు.

1, ఆగ 2026

సాగునీటి సంక్షోభంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సమీక్ష
ఆంధ్రప్రదేశ్

సాగునీటి సంక్షోభంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ ఎల్ నినో ప్రభావంతో సాగునీటి పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ సమీక్ష నిర్వహించి, రైతులు ఆందోళన చెందకుండా వాస్తవ పరిస్థితులు, ప్రత్యామ్నాయ చర్యలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రతి నీటి బొట్టు సంరక్షణ, కాలువల పూడిక తొలగింపు, Prime Minister Fasal Bima Yojana కింద పంటల బీమా, గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశిస్తూ, ఏలేరు నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంపై మంత్రి నిమ్మల రామానాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

30, జులై 2026

వన్యప్రాణుల సంరక్షణ మనందరి లక్ష్యం  : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రాజకీయాలు

వన్యప్రాణుల సంరక్షణ మనందరి లక్ష్యం : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు గ్రామాల్లోకి ప్రవేశించి పంటలు ధ్వంసం చేయడంతో ప్రజలు భయాందోళనల మధ్య జీవిస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో చాలా కాలంగా ఈ ఇబ్బందులు ఉన్నాయని అన్నారు.

29, జులై 2026

జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ: రాష్ట్ర అధికార ప్రతినిధుల వ్యవస్థ రద్దు
ఆంధ్రప్రదేశ్

జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ: రాష్ట్ర అధికార ప్రతినిధుల వ్యవస్థ రద్దు

జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో అధికార ప్రతినిధుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, ప్రస్తుతం ఉన్న 26 మంది ప్రతినిధుల బాధ్యతలను తక్షణం నిలిపివేశారు. కొత్త కమిటీలు ప్రకటించే వరకు టెలివిజన్ డిబేట్లు, మీడియా చర్చల్లో పార్టీ తరఫున ఎవరూ పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేయగా, త్వరలో కొత్త అధికార ప్రతినిధుల జాబితా వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.

29, జులై 2026

‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల
సినిమా

‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘చిట్టి చిట్టి చీమ’ను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ మెలోడీకి శ్రీమణి సాహిత్యం, రమ్య బెహరా గానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాత్విక వీరవల్లి, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం త్వరలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

29, జులై 2026

అసాధారణ శౌర్యంతో దేశం కోసం సీఆర్పీఎఫ్ త్యాగం  : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రాజకీయాలు

అసాధారణ శౌర్యంతో దేశం కోసం సీఆర్పీఎఫ్ త్యాగం : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ధైర్యవంతులైన పురుషులు, మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జవాన్ల అచంచలమైన ధైర్యం, సాటిలేని క్రమశిక్షణ, నిస్వార్థ సేవ భారతదేశ అంతర్గత భద్రతకు ఒక శాశ్వతమైన స్తంభంగా నిలిచాయని కొనియాడారు.

27, జులై 2026

కార్గిల్ విజయ్ దివస్.. అమరవీరులకు చంద్రబాబు, పవన్ నివాళి
రాజకీయాలు

కార్గిల్ విజయ్ దివస్.. అమరవీరులకు చంద్రబాబు, పవన్ నివాళి

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్ధంలో వారు చూపిన ధైర్యసాహసాలు, పోరాడిన తీరును ప్రశంసించారు.

26, జులై 2026

విజయవాడ కార్పొరేషన్‌లో కూటమిదే విజయం  : మంత్రి కందుల దుర్గేశ్
రాజకీయాలు

విజయవాడ కార్పొరేషన్‌లో కూటమిదే విజయం : మంత్రి కందుల దుర్గేశ్

జనసేన పార్టీ కోసం గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు సొంతంగా పనిచేశారని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం అందరం సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మిత్రపక్ష పార్టీల‌ నేతలను కలుపుకుని ముందుకు సాగాలని నేతలకు సూచించారు.

24, జులై 2026

కుంకీ ఏనుగులకు డిప్యూటీ సీఎం పవన్‌ స్వాగతం
ఆంధ్రప్రదేశ్

కుంకీ ఏనుగులకు డిప్యూటీ సీఎం పవన్‌ స్వాగతం

విజయనగరం, మన్యం జిల్లాల్లో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపుని కట్టడి చేసేందుకు కుంకీ ఏనుగుల్ని పంపిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ తెలిపారు.

24, జులై 2026

జల్ జీవన్ మిషన్‌పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్

జల్ జీవన్ మిషన్‌పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం జల్ జీవం మిషన్ , అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులను వేగంగా అమలు చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షలో పనుల నాణ్యతపై రాజీ లేకుండా, వర్షాభావం, తాగునీటి ఎద్దడిని ముందుగానే ఎదుర్కొనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సుమారు రూ.2,500 కోట్ల వ్యయంతో పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 16 లక్షల మందికి పైగా ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.

22, జులై 2026

సినిమా షూటింగ్‌లో బాలకృష్ణ గాయం.. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందన
ఆంధ్రప్రదేశ్

సినిమా షూటింగ్‌లో బాలకృష్ణ గాయం.. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందన

సినిమా చిత్రీకరణలో నందమూరి బాలకృష్ణ గాయపడ్డారన్న సమాచారం నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అధికారుల ద్వారా తెలుసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొనగా, అభిమానులు, పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

22, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters