రాయలసీమ న్యూస్, హెల్త్ డెస్క్: కలసపాడు: పరిసరాల పరిశుభ్రతతో పాటు దోమల నివారణ చర్యలు చేపడితే మలేరియాను నిర్మూలించవచ్చని వైద్యాధికారి శైలజ గారు తెలిపారు. కలసపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి శైలజ గారు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత దోమల నివారణ చర్యలపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. అనంతరం ఆరోగ్య సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాల్లో దోమల నివారణ మందు పిచికారి చేయించారు. కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి వెంకటసుబ్బమ్మ, హెల్త్ అసిస్టెంట్లు రామతీర్థం, జయరామిరెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మలేరియాను నిర్మూలిద్దాం: కలసపాడులో అవగాహన ర్యాలీ, దోమల నివారణకు పిలుపు
రాయలసీమ న్యూస్ హెల్త్ డెస్క్
1 నిమిషాల చదువు
102 views

Tags :#ఆరోగ్యం#ఆస్పత్రి#డాక్టర్#మందులు#అధికార#ప్రపంచ#సామాజిక#కార్యకర్త#కార్యక్రమం#ర్యాలీ#అవగాహన#కేంద్రంలో#పరిసర#వెంకట
- రాయలసీమ న్యూస్ హెల్త్ డెస్క్, కడప
▸ తాజా వై.యస్.ఆర్ జిల్లా వార్తలు మరియు తెలుగు వార్తలు చదవండి.
Published : 02 Jun 2026, 17:28 IST
గమనిక: ఈ కథనంలోని అభిప్రాయాలు, వ్యాఖ్యలు సంబంధిత వ్యక్తులవి. ప్రకటనలు/వాణిజ్య సమాచారం విషయంలో పాఠకులు తగిన జాగ్రత్త వహించాలి; వాటి నాణ్యత లేదా లోపాలకు రాయలసీమ న్యూస్ యాజమాన్యం బాధ్యత వహించదు. సవరణల కోసం సవరణల విధానం చూడండి.












