రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్:
యోగాతో ఇంటిల్లిపాదికీ యోగానందం..!!
జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధీ మీనా
యోగాంధ్ర -2026 పక్షోత్సవాల్లో భాగంగా.. కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో యోగాసనాలు
"ఫ్యామిలీ యోగా"లో 4 వేల మంది కుటుంబ సభ్యులు హాజరు
వైఎస్ఆర్ కడప, : మన దినచర్యలో యోగా ఒక భాగంగా మారితే.. ఇంటిల్లిపాదికీ యోగానందం, ఆరోగ్య భాగ్యం సొంతం అవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధీ మీనా పేర్కొన్నారు. యోగాంధ్ర పక్షోత్సవాల్లో భాగంగా... బుధవారం ఉదయం కడప వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కడప నగరపాలక సంస్థ, జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఫ్యామిలీ యోగా" కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
ఈ కార్యక్రమంలో సుమారు 1000 కుటుంబాలకు చెందిన 4 వేల మందికి పైగా హాజరైన వారికి.. మాస్టర్ ట్రైనర్లు యోగాసనాలపై అవగాహన, శిక్షణ ఇవ్వడం జరిగింది జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జేసీ డా. నిధి మీనా, సబ్ కలెక్టర్, కడప నగర కమీషనర్. హెచ్.ఎస్. భావన హాజరై యోగాసనాలు వేసి జిల్లా ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు.
ఈ సందర్భంగా జేసీ డా. నిధీ మీనా మాట్లాడుతూ.. జూన్ 21న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన "ఫ్యామిలీ యోగా" కార్యక్రమానికి ఒక్కో కుటుంబానికి చెందిన పిల్లలు, తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ మొదలైన మూడు కెటగిరీలకు చెందిన సుమారు 4 వేల మందికి పైగా హాజరై యోగాసనాలు వేయడం.. గర్వించదగ్గ విషయం అన్నారు. అలాగే.. 16వ తేదీన గండికోట పర్యాటక క్షేత్రంలో నిర్వహించే "టూరిజం, హెరిటేజ్ యోగా" థీమ్ తో నిర్వహించే కార్యక్రమంలో జిల్లా ప్రజలు విశేషంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.
సబ్ కలెక్టర్, కడప నగర కమీషనర్ హెచ్.ఎస్. భావన మాట్లాడుతూ... కడప నగరంలో "ఫ్యామిలీ యోగా" కాన్సెప్ట్ తో నిర్వహించిన కార్యక్రమం నగర ప్రజల్లో నూతనోత్సాహం నింపిందన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, తల్లిదండ్రులు, అవ్వతాతలు మొదలైన మూడు కేటగిరీలకు చెందిన కుటుంబ సభ్యులు కలిసి పాల్గొనడం ఆనందదాయకమైన విషయం అన్నారు. ఈ రోజు "ఫ్యామిలీ యోగా" కాన్సెప్ట్ తో జిల్లాలోని అన్ని కుటుంబాలకు యోగాపై అవగాహన, యోగా వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను విశదీకరిస్తూ.. జిల్లా ఆయుష్ శాఖ తరుపున మాస్టర్ ట్రైనర్లు యోగాసనాలపై శిక్షణ ఇవ్వడం అభినందనీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో కడప ఆర్‌డిఓ మురళి, ఎస్డీసి హరిప్రసాద్, జిల్లా పర్యాటక అధికారి సురేష్ కుమార్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజలక్ష్మి, జిల్లా ఆయుష్ నోడల్ అధికారి రవికుమార్, డిఎమ్ హెచ్‌ఓ డా.నాగరాజు తదితర జిల్లా అధికారులు, కుటుంబ సభ్యులు, విద్యార్థులు, పలువురు ఉద్యోగులు, ఎన్జీవో ప్రతినిధులు, మెప్మా మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.













