బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#వైఎస్ఆర్

33 articles

ప్రొద్దుటూరులో కాంగ్రెస్‌కు ఊపు: 40 కుటుంబాల చేరిక
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో కాంగ్రెస్‌కు ఊపు: 40 కుటుంబాల చేరిక

ప్రొద్దుటూరులో కాంగ్రెస్ శ్రేణులు స్థానిక ఎన్నికల దృష్ట్యా చురుకుగా కదులుతున్న నేపథ్యంలో 11వ వార్డు పరిధిలో ఎస్. మహబూబ్ బాషాతో పాటు 40 కుటుంబాలు కడప డీసీసీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయజ్యోతి సమక్షంలో పార్టీలో చేరారు. పట్టణ అభివృద్ధి నిలిచిపోయిందని, ప్రస్తుత పాలకులు ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి వ్యాపార ప్రయోజనాల కోసం పాలన సాగించారని ఇర్ఫాన్ బాషా, విజయజ్యోతి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.

25, ఆగ 2026

దువ్వూరు KGBVలో విద్యార్థినులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన
జిల్లా వార్తలు

దువ్వూరు KGBVలో విద్యార్థినులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన

మైదుకూరు మండలం దువ్వూరులోని KGBVలో విద్యార్థినులకు మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నియంత్రణ, ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ ఎన్. కవితా ప్రసన్న చదువు ఒత్తిడి, సామాజిక మాధ్యమాల ప్రభావం, నిద్ర, క్రీడలు, యోగా, కౌన్సిలింగ్ ప్రాముఖ్యతపై వివరించి, లక్షణాలు కనిపించినప్పుడు నిపుణులను సంప్రదించాలని సూచించారు. దువ్వూరు, ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత మానసిక ఆరోగ్య సేవలు, కౌన్సిలింగ్, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

20, ఆగ 2026

ముద్దనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ పి. యుగంధర్ ఆకస్మిక తనిఖీ
జిల్లా వార్తలు

ముద్దనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ పి. యుగంధర్ ఆకస్మిక తనిఖీ

వైఎస్ఆర్ కడప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి. యుగంధర్ ముద్దనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ నిర్వహించి, OP, ల్యాబొరేటరీ, ఫార్మసీ, లేబర్ రూమ్ తదితర విభాగాలు, రికార్డుల నిర్వహణ, పరిశుభ్రతను సమగ్రంగా పరిశీలించారు. ముద్దనూరులో ప్రసవాల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ANMs, MLHPs గర్భిణీలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు ప్రోత్సహించాలని, రికార్డులు, యాప్స్ సమయానికి అప్డేట్ చేసి, ఫీవర్స్ సర్వే, అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

20, ఆగ 2026

మొబైల్ ఫోన్ పోయినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు: కడప జిల్లా పోలీసుల సూచనలు
జిల్లా వార్తలు

మొబైల్ ఫోన్ పోయినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు: కడప జిల్లా పోలీసుల సూచనలు

వైఎస్ఆర్ కడప జిల్లా పోలీసులు మొబైల్ ఫోన్ పోయినప్పుడు ఆర్థిక నష్టం, సైబర్ మోసాలు, వ్యక్తిగత డేటా దుర్వినియోగం తగ్గించేందుకు ఐదు కీలక చర్యలను సూచించారు. వెంటనే 1930, 112 హెల్ప్‌లైన్‌లకు కాల్ చేయడం, పోలీస్ ఫిర్యాదు నమోదు, సిమ్, IMEI బ్లాకింగ్, ఫైండ్ మై డివైస్ వంటి ట్రాకింగ్ సదుపాయాలు వినియోగించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, ప్రజలు ఆందోళనకు లోనవకుండా ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలని వారు సూచించారు.

19, ఆగ 2026

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి: శ్రీకాంత్ రెడ్డి డిమాండ్
జిల్లా వార్తలు

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి: శ్రీకాంత్ రెడ్డి డిమాండ్

వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, గత వైఎస్ జగన్ ప్రభుత్వం ‘నాడు–నేడు’, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆంగ్ల మాధ్యమం, ‘అమ్మ ఒడి’ వంటి కార్యక్రమాలతో పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తెచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శిస్తూ, పెండింగ్‌లో ఉన్న ‘నాడు–నేడు’ పనులను పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.

18, ఆగ 2026

కలెక్టర్‌ బంగ్లాలో ఎట్‌ హోమ్‌ వేడుకలు
జిల్లా వార్తలు

కలెక్టర్‌ బంగ్లాలో ఎట్‌ హోమ్‌ వేడుకలు

వైఎస్ఆర్‌ జిల్లా కలెక్టర్‌ బంగ్లాలో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎట్‌ హోమ్‌ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి ఆధ్వర్యంలో జరిగిన తేనీటి విందులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ సహా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, శాంతిభద్రతలపై సౌహార్ద వాతావరణంలో చర్చించారు.

16, ఆగ 2026

ప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు

ప్రొద్దుటూరు పట్టణంలో DSC నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించరాదని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోసులాట చోటుచేసుకోగా, మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు.

10, ఆగ 2026

జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి అరెస్టు వివాదం
జిల్లా వార్తలు

జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి అరెస్టు వివాదం

జమ్మలమడుగులో రిలే నిరాహార దీక్ష సమయంలో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి అరెస్టు ఉద్రిక్తతకు దారితీస్తూ, వైఎస్ఆర్సిపి దీనిని అక్రమ చర్యగా అభివర్ణిస్తోంది. DSC నియామకాల్లో అక్రమాలు, పారదర్శకత లోపంపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో నిరసనలు, నిరాహార దీక్షలు కొనసాగుతుండగా, జమ్మలమడుగులో రాజకీయ వేడి చెలరేగింది.

8, ఆగ 2026

ఉచిత మెగా మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఎన్జీవోస్ పిలుపు
జిల్లా వార్తలు

ఉచిత మెగా మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఎన్జీవోస్ పిలుపు

ఆగస్టు 9, ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఎన్జీవో హోంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించనున్నట్లు ఏపీ ఎన్జీవోస్ వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షులు బలపనూరు శ్రీనివాసులు తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లు, సాధారణ ప్రజలందరికీ గుండె, ఆర్థోపెడిక్, కంటి, జనరల్ మెడిసిన్ వంటి విభాగాల్లో ఉచిత పరీక్షలు, వైద్య సలహాలు, మందుల పంపిణీ ఉండనున్న ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

8, ఆగ 2026

ప్రొద్దుటూరు చాముండేశ్వరి ఆలయంలో శాకంబరీ అలంకారం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు చాముండేశ్వరి ఆలయంలో శాకంబరీ అలంకారం

వైఎంఆర్ కాలనీలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో చాముండేశ్వరి అమ్మవారికి శాకంబరీ దేవి అలంకారం నిర్వహించడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పుష్పాలతో చేసిన విశిష్ట అలంకారం, విశేష పూజా కార్యక్రమాలు చూసేందుకు ప్రొద్దుటూరు పట్టణం, పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి సమృద్ధి వర్షాలు, పాడిపంటల అభివృద్ధి, ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు.

8, ఆగ 2026

మహిళకు మద్యం తాగించి, బండరాయితో కొట్టి దారుణ హత్య
జిల్లా వార్తలు

మహిళకు మద్యం తాగించి, బండరాయితో కొట్టి దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం చింతపర్తి సమీపంలో ఒక ఘోర కలికలం రేపిన ఉదంతం వెలుగుచూసింది. ఒక మహిళకు మద్యం తాగించి, ఆపై బండరాయితో తలపై మోది అతికిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను సృష్టించింది

5, ఆగ 2026

డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
జిల్లా వార్తలు

డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలలో భారీ అవినీతి, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, వాటిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను దెబ్బతీస్తోందని విమర్శించిన ఆయన, ఆగస్టు 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు, 10న నియోజకవర్గ స్థాయిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి డీఎస్సీ అవకతవకలపై పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.

5, ఆగ 2026

పాత బీగాలతో బైక్‌లు చోరీ చేసిన Swiggy డెలివరీ బాయ్ అరెస్ట్
జిల్లా వార్తలు

పాత బీగాలతో బైక్‌లు చోరీ చేసిన Swiggy డెలివరీ బాయ్ అరెస్ట్

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో వరుసగా మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్న Swiggy డెలివరీ బాయ్ సూర్య గురు తేజను పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.3.50 లక్షల విలువైన ఏడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పాత బీగాలు, మాస్టర్ కీతో బైక్‌ల లాక్‌లు తెరిచి చోరీ చేసినట్లు విచారణలో ఒప్పుకున్న అతనిపై కేసు నమోదు చేయగా, పెరుగుతున్న బైక్ దొంగతనాల నేపథ్యంలో వాహనదారులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.

4, ఆగ 2026

రాజంపేటలో శ్రీరామ్‌ ఫైనాన్స్‌ బ్రాంచ్‌లో అగ్నిప్రమాదం
జిల్లా వార్తలు

రాజంపేటలో శ్రీరామ్‌ ఫైనాన్స్‌ బ్రాంచ్‌లో అగ్నిప్రమాదం

వైఎస్ఆర్‌ కడప జిల్లా రాజంపేటలోని చలపతి కాంప్లెక్స్‌లో ఉన్న శ్రీరామ్‌ ఫైనాన్స్‌ బ్రాంచ్‌లో ఆదివారం రాత్రి షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి, విలువైన వస్తువులు, రికార్డులు, కంప్యూటర్‌ పరికరాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సమయానికి స్పందించడంతో మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా నియంత్రించగా, తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాల భద్రత, నష్టం పరిమాణంపై విచారణ కొనసాగుతోంది.

3, ఆగ 2026

కార్పెంటర్ రమణ మృతి కేసులో చర్యలు తీసుకోవాలంటూ ఆత్మకూరు డీఎస్పీకి విజ్ఞప్తి
జిల్లా వార్తలు

కార్పెంటర్ రమణ మృతి కేసులో చర్యలు తీసుకోవాలంటూ ఆత్మకూరు డీఎస్పీకి విజ్ఞప్తి

కార్పెంటర్ రమణ మృతి కేసులో మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులపై ఇప్పటివరకు చర్యలు లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆత్మకూరు డీఎస్పీని కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు వేగవంతం చేసి, రమణ మృతి కారణాలను సమగ్రంగా వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా పోలీసు అధికారులను కోరారు.

29, జులై 2026

మేము కూడా బాధితులమే..   : ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం
రాజకీయాలు

మేము కూడా బాధితులమే.. : ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం

తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చట్టాన్ని ఉల్లంఘించలేదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. భూ వివాదంలో తామూ బాధితులమేనని ఆయన చెప్పుకొచ్చారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామన్నారు.

28, జులై 2026

బద్వేల్‌లో మహిళపై దాడి ఘటనపై నిరసన: ఎమ్మెల్యే సుధా
జిల్లా వార్తలు

బద్వేల్‌లో మహిళపై దాడి ఘటనపై నిరసన: ఎమ్మెల్యే సుధా

బద్వేల్‌లో మహిళపై దాడి ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. బద్వేల్ ఎమ్మెల్యే సుధా, టిడిపి నాయకులు మహిళలపై దాడులు, అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ, సంబంధిత నాయకులను వెంటనే అరెస్టు చేయాలని, హోంమినిస్టర్ జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని, మహిళల భద్రతకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

22, జులై 2026

ప్రొద్దుటూరులో గంజాయి ముఠా అరెస్ట్, ఒడిశా నుంచి రవాణా
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో గంజాయి ముఠా అరెస్ట్, ఒడిశా నుంచి రవాణా

ప్రొద్దుటూరులో ఒడిశా నుంచి గంజాయిని తెచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేక దాడుల్లో 4 కిలోల గంజాయి, రూ.3 వేల నగదు స్వాధీనం చేసి ఇద్దరు పురుషులు, ఓ మహిళను అరెస్ట్ చేసి NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. గంజాయి రవాణా, విక్రయాల నెట్వర్క్‌ను బహిర్గతం చేసేందుకు దర్యాప్తు కొనసాగిస్తూ, మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టడంలో ప్రజల సహకారం కోరుతున్నారు.

19, జులై 2026

కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పర్యటన
జిల్లా వార్తలు

కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పర్యటన

వైఎస్ఆర్ కడప జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి వేగం పెరుగుతోందనిటీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి తెలిపారు. జూలై 14-15 తేదీల్లో మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పర్యటనలో భాగంగా దాల్మియా సిమెంట్ రెండవ ప్లాంట్ శంఖస్థాపన,టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. రూ. 3100 కోట్ల పెట్టుబడితో వచ్చే ఈ ప్లాంట్, అన్సెల్లరీ పరిశ్రమలతో కలిసి జిల్లాలో ఉపాధి అవకాశాలను ఆయన పేర్కొన్నారు.

14, జులై 2026

ఒంగోలు వైకాపా కార్యాలయంలో కలకలం: మహిళా నేత ఆత్మహత్యాయత్నం
ఆంధ్రప్రదేశ్

ఒంగోలు వైకాపా కార్యాలయంలో కలకలం: మహిళా నేత ఆత్మహత్యాయత్నం

ప్రకాశం జిల్లా ఒంగోలు వైకాపా కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం సందర్భంగా జరిగిన వాగ్వాదం, దాడి ఘటనలతో మనస్తాపానికి గురైన వైకాపా మహిళా నాయకురాలు పేరం ప్రసన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కేసును పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, ఈ సంఘటనతో పార్టీ అంతర్గత విభేదాలు, మహిళా నాయకుల భద్రతపై చర్చలు మళ్లీ చెలరేగుతున్నాయి.

11, జులై 2026

ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఘర్షణ..   వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. రచ్చ
రాజకీయాలు

ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఘర్షణ.. వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. రచ్చ

వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించే కార్యక్రమంలో రెండు వర్గాల కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది.

8, జులై 2026

విద్యాహక్కు చట్ట సవరణకు బిల్లు ప్రవేశపెట్టాలని ఫ్యాప్టో విజ్ఞప్తి
జిల్లా వార్తలు

విద్యాహక్కు చట్ట సవరణకు బిల్లు ప్రవేశపెట్టాలని ఫ్యాప్టో విజ్ఞప్తి

ఫ్యాప్టో కడప జిల్లా శాఖ, విద్యాహక్కు చట్టం 23వ సెక్షన్ సవరణకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కి విజ్ఞప్తి చేసింది. 2010 ఆగస్టు ముందు సేవలోకి వచ్చిన ఉపాధ్యాయులను Teacher Eligibility Test నుంచి మినహాయించి, చట్టాన్ని ప్రోస్పెక్టివ్‌గా అమలు చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయుల సేవలు, అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని నాయకులు అభిప్రాయపడ్డారు.

8, జులై 2026

భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారం – తహసీల్దార్ భరోసా
జిల్లా వార్తలు

భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారం – తహసీల్దార్ భరోసా

వైఎస్ఆర్ కడప జిల్లా కలసపాడు మండలంలో భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ కృషి చేస్తుందని తహసీల్దార్ రవీంద్ర రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తెలిపారు. భూ హక్కుల పత్రాలు, సరిహద్దు వివాదాలు, వారసత్వ హక్కులు, రికార్డు సవరణలపై వచ్చిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సిబ్బందికి ఆదేశించారు.

22, జూన్ 2026

రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం.. ప్రతి విషయంలోనూ మోసమే
రాజకీయాలు

రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం.. ప్రతి విషయంలోనూ మోసమే

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులపై ఉన్న ప్రేమ కేవలం బూటకమని, ఆయన పాలనలో రైతులకు మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమే మిగిలాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

21, జూన్ 2026

"ఫ్యామిలీ యోగా"లో 4 వేల మంది కుటుంబ సభ్యులు హాజరు
జిల్లా వార్తలు

"ఫ్యామిలీ యోగా"లో 4 వేల మంది కుటుంబ సభ్యులు హాజరు

మన దినచర్యలో యోగా ఒక భాగంగా మారితే.. ఇంటిల్లిపాదికీ యోగానందం, ఆరోగ్య భాగ్యం సొంతం అవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధీ మీనా పేర్కొన్నారు. యోగాంధ్ర పక్షోత్సవాల్లో భాగంగా... బుధవారం ఉదయం కడప వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కడప నగరపాలక సంస్థ, జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఫ్యామిలీ యోగా" కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

10, జూన్ 2026

ఆగని గ్యాస్‌ బండ దోపిడీ
జిల్లా వార్తలు

ఆగని గ్యాస్‌ బండ దోపిడీ

వైఎస్ఆర్‌ కడప జిల్లాలో డొమెస్టిక్‌ వాయుబండల దుర్వినియోగం, నల్లబజారు విక్రయాలు విస్తృతంగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గృహ వినియోగ సిలిండర్లను హోటళ్లు, వాహనాలు తదితర వాణిజ్య అవసరాలకు వాడుతూ, అధికారిక ధర కంటే ఎక్కువగా వసూలు చేస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే కొన్ని సిలిండర్లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని వినియోగదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

8, జూన్ 2026

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన కె.ఎస్. భరత్‌
క్రీడలు

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన కె.ఎస్. భరత్‌

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ కె.ఎస్. భరత్‌కు అభిమానులు, క్రికెట్‌ వర్గాలు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోషల్‌ మీడియాలో భరత్‌ భవిష్యత్‌ ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భరత్‌ అనుభవం కోచింగ్‌, మార్గదర్శకత్వం ద్వారా భారత క్రికెట్‌కు ఉపయోగపడాలని క్రీడా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

7, జూన్ 2026

రెడీ టూ “స్టార్ట్ అప్ కడప”
టెక్నాలజీ

రెడీ టూ “స్టార్ట్ అప్ కడప”

వైఎస్ఆర్ కడపలో “స్టార్ట్ అప్ కడప” ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతుండగా, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యతపై రాజీ లేకుండా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కేంద్రం ద్వారా యువ స్టార్టప్ వ్యవస్థాపకులు, ఫ్రీలాన్సర్లు, చిన్న, మధ్యతరహా వ్యాపారాల అభివృద్ధికి బలమైన పునాది పడుతుందని, కడపను వ్యాపార అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఇది కీలకంగా మారనుందని ఆయన అభిప్రాయపడ్డారు.

6, జూన్ 2026

పచ్చదనం పెంపు సామాజిక బాధ్యతే కాదు, వ్యక్తిగత బాధ్యత కూడా: కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
జిల్లా వార్తలు

పచ్చదనం పెంపు సామాజిక బాధ్యతే కాదు, వ్యక్తిగత బాధ్యత కూడా: కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కడపలో వనమహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, పచ్చదనం పెంపు సామాజిక బాధ్యత మాత్రమే కాక వ్యక్తిగత బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని పిలుపునిచ్చారు. డ్రోన్ సహాయంతో సీడ్ బాల్స్ విసిరే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే లక్ష్యంతో ప్రతి ఇల్లు, ప్రతి ఊరు పచ్చగా మారేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు.

5, జూన్ 2026

“ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు పర్యటనలు”   ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతేక కార్యక్రమం ప్రారంభం
జిల్లా వార్తలు

“ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు పర్యటనలు” ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతేక కార్యక్రమం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు “ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు పర్యటనలు” కార్యక్రమాన్ని ప్రారంభించింది. వై ఎస్ ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా సహా అధికారులు ప్రజల వినతులను స్వీకరించి, సంబంధిత శాఖలతో చర్చించి తక్షణ చర్యలు ప్రారంభించారు.

5, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters