బ్రేకింగ్ న్యూస్
ప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#యోగాంధ్ర

10 articles

ప్రొద్దుటూరులో యోగాంధ్ర–2026లో పాల్గొన్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో యోగాంధ్ర–2026లో పాల్గొన్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర–2026 కార్యక్రమం నిర్వహించగా, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరై యోగా ప్రదర్శనలు వీక్షించారు. యోగా శిక్షకులు ఆసనాలు, ప్రాణాయామం ప్రదర్శించి, యోగా వల్ల కలిగే శారీరక–మానసిక లాభాలపై అవగాహన కల్పించగా, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

23, జూన్ 2026

ఘనంగా యోగాంధ్ర డే : హాజరైన సీఎం బాబు, మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్

ఘనంగా యోగాంధ్ర డే : హాజరైన సీఎం బాబు, మంత్రి లోకేష్

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా ప్రాణాయామం చేయించారు.

21, జూన్ 2026

‘యోగాంధ్ర’ లో పాల్గొన్న సీఎం చంద్ర బాబు
ఆంధ్రప్రదేశ్

‘యోగాంధ్ర’ లో పాల్గొన్న సీఎం చంద్ర బాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే విజన్ ఉన్న నాయకుడని యోగా గురు రామ్‌దేవ్ బాబా అన్నారు. యోగా మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మికతకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

20, జూన్ 2026

తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో ఘనంగా యోగా
జిల్లా వార్తలు

తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో ఘనంగా యోగా

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘యోగాంధ్ర–2026’లో భాగంగా తాడిపత్రి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆనంద్, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్థానికులతో కలిసి యోగాసనాలు చేయించి, యోగా ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెంపొందుతుందని తెలిపారు. తాడిపత్రి, గుత్తి కోట వంటి ప్రదేశాల ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాధాన్యతను వెలుగులోకి తెచ్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయుక్తమని ఆయన పేర్కొన్నారు.

18, జూన్ 2026

జులై మూడో వారంలో ‘తల్లికి వందనం’
ఆంధ్రప్రదేశ్

జులై మూడో వారంలో ‘తల్లికి వందనం’

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ఆర్థిక సాయాన్ని జులై మూడో వారంలో అందించేలా అన్ని చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.

17, జూన్ 2026

యోగాతో సంపూర్ణ ఆరోగ్య భాగ్యం : ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
జిల్లా వార్తలు

యోగాతో సంపూర్ణ ఆరోగ్య భాగ్యం : ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

జమ్మలమడుగులో గండికోట పర్యాటక క్షేత్రంలో నిర్వహించిన యోగాంధ్ర పక్షోత్సవాల్లో భాగంగా జరిగిన పర్యాటక యోగా కార్యక్రమంలో ఎమ్మెల్యే సి.ఆదినారాయణ రెడ్డి పాల్గొని, యోగా సంపూర్ణ ఆరోగ్యానికి దారితీస్తుందని, ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. జూన్ 7 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న యోగాంధ్ర క్యాంపెన్-2025లో జిల్లాలో మండల స్థాయి వరకు యోగా శిక్షణలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

16, జూన్ 2026

విద్యార్థుల నుంచి వృద్ధుల దాకా యోగా అలవాటు చేసుకోండి: కలెక్టర్ పిలుపు
జిల్లా వార్తలు

విద్యార్థుల నుంచి వృద్ధుల దాకా యోగా అలవాటు చేసుకోండి: కలెక్టర్ పిలుపు

అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్, సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగాను ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమం కింద జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామ, వార్డు స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు, ప్రదర్శనలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. యోగాసనాల సాధనతో శారీరక, మానసిక దృఢత్వం పెరిగి, ఒత్తిడి తగ్గుతుందని, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు యోగాను అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

16, జూన్ 2026

"ఫ్యామిలీ యోగా"లో 4 వేల మంది కుటుంబ సభ్యులు హాజరు
జిల్లా వార్తలు

"ఫ్యామిలీ యోగా"లో 4 వేల మంది కుటుంబ సభ్యులు హాజరు

మన దినచర్యలో యోగా ఒక భాగంగా మారితే.. ఇంటిల్లిపాదికీ యోగానందం, ఆరోగ్య భాగ్యం సొంతం అవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధీ మీనా పేర్కొన్నారు. యోగాంధ్ర పక్షోత్సవాల్లో భాగంగా... బుధవారం ఉదయం కడప వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కడప నగరపాలక సంస్థ, జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఫ్యామిలీ యోగా" కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

10, జూన్ 2026

సంపూర్ణ ఆరోగ్యానికి యోగా తారకమంత్రం: జాయింట్‌ కలెక్టర్ నిధి మీనా
జిల్లా వార్తలు

సంపూర్ణ ఆరోగ్యానికి యోగా తారకమంత్రం: జాయింట్‌ కలెక్టర్ నిధి మీనా

కడప జిల్లా ఒంటిమిట్టలో APTDTC, పర్యాటక శాఖ, తితిదే సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిధి మీనా యోగా సంపూర్ణ ఆరోగ్యానికి తారకమంత్రమని పేర్కొన్నారు. యాంత్రీక జీవనశైలిలో పెరుగుతున్న శారీరక, మానసిక ఒత్తిడులను తగ్గించడంలో, శరీర సౌష్టవం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించడంలో యోగా కీలకమని ఆమె సూచిస్తూ, ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగా సాధనకు సమయం కేటాయించాలని పిలుపునిచ్చారు.

7, జూన్ 2026

21న రాష్ట్ర స్థాయి ‘యోగాంధ్ర-2026’..
ఆరోగ్యం

21న రాష్ట్ర స్థాయి ‘యోగాంధ్ర-2026’..

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్‌ 21న అమరావతి సమీపంలోని వెంకటపాలెం వద్ద ‘యోగాంధ్ర-2026’ పేరుతో రాష్ట్ర స్థాయి యోగా మహోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేసింది. సుమారు 25 వేల మందిని పాల్గొనేటట్లు లక్ష్యంగా పెట్టుకుని వేదిక, రాకపోకలు, పార్కింగ్‌, భద్రత, వైద్య సేవలు తదితర అంశాలపై అధికారులు సమీక్షించి, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరును దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

7, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters