ప్రొద్దుటూరులో జనసేన కేడర్ సమావేశం: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవ్వాలని పిలుపు

ప్రొద్దుటూరు జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని, ప్రతి నాయకుడు తన పరిధిలోని ఓటర్ల జాబితాను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని ఈ సమావేశంలో సూచించారు.

పార్టీలో ఉన్న జనసైనికులు, నాయకులంతా ఐకమత్యంగా ఉండి ప్రజలతో మరింత మమేకం కావాల్సిన అవసరాన్ని నాయకులు ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం లో పవన్ కళ్యాణ్ చేపడుతున్న కార్యక్రమాలు, ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు, అలాగే జనసేన తరఫున చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని సమావేశంలో పేర్కొన్నారు.

ప్రజల మద్దతు పొందేందుకు బూత్ స్థాయిలోనే బలమైన నెట్‌వర్క్‌ ఏర్పరచుకోవాలని, ప్రతి నాయకుడు తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాలని సూచనలు ఇచ్చారు. స్థానిక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి పార్టీ తరఫున తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియజేయాలని నాయకులు అభిప్రాయపడ్డారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తరఫున పోటీలో నిలిచే అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా ప్రతి మండలం, ప్రతి డివిజన్‌లో సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గరిష్ట విజయాలు సాధించేలా కృషి చేయాలని, లక్ష్యంగా పెట్టుకున్న స్థానాల్లో 100 శాతం విజయ శాతం సాధించేందుకు కేడర్ కట్టుదిట్టంగా పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో ఎలక్షన్ సమన్వయ కమిటీ సభ్యుడు A రామారావు నాయకులకు మార్గనిర్దేశం చేశారు. స్థానిక స్థాయిలో పార్టీ బలపడేందుకు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ఎవరు వెనుకడుగు వేయకూడదని ఆయన స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.