రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు తాలూకా ఏపీ యన్ జి జి ఓ స్ అసోసియేషన్ మరియు హోలిస్టిక్ హాస్పిటల్ , ప్రొద్దుటూరు సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9న ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఈ శిబిరాన్ని ఏపీ యన్ జి జి ఓ స్ అసోసియేషన్ తాలూకా యూనిట్, ప్రొద్దుటూరు కార్యాలయం (NGO Home)లో ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొద్దుటూరు శాసనసభ్యులు గౌరవనీయులు నంద్యాల వరదరాజులరెడ్డి హాజరుకానున్నారు. అలాగే కడప జిల్లా అధ్యక్షులు, JAC చైర్మన్ పెద్దలు బి. శ్రీనివాసులు కూడా శిబిరానికి విచ్చేయనున్నారని ప్రొద్దుటూరు తాలూకా అధ్యక్షులు మరియు JAC చైర్మన్ జె. రామసుబ్బయ్య యాదవ్ తెలిపారు.
ఉద్యోగులు, పెన్షనర్లు, పట్టణ ప్రజలందరూ ఈ ఉచిత మెడికల్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల ముందస్తు గుర్తింపు, అవసరమైన వైద్య సలహాలు అందించడమే ఈ శిబిరం లక్ష్యంగా పేర్కొన్నారు.
క్యాంప్‌లో గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ECG, 2D Echo వంటి పరీక్షలు ఉచితంగా చేయబడతాయి. అదనంగా ఎముకలు, కీళ్ళకు సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. కంటి పరీక్షలు, సాధారణ వైద్య పరీక్షలు కూడా ఈ శిబిరంలో భాగంగా ఉంటాయి.
జనరల్ మెడిసిన్ విభాగంలో రక్తపోటు, షుగర్ వంటి ప్రాథమిక పరీక్షలు చేసి, వైద్యుల పర్యవేక్షణలో ఉచితంగా పరీక్షలు, వైద్య సలహాలు అందించనున్నారు. పరీక్షల అనంతరం అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ మెడికల్ క్యాంప్ ద్వారా ప్రొద్దుటూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు ఏపీ యన్ జి జి ఓ స్ అసోసియేషన్ తాలూకా యూనిట్, ప్రొద్దుటూరు మరియు హోలిస్టిక్ హాస్పిటల్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.
జె. రామసుబ్బయ్య యాదవ్, అధ్యక్షులు, ఏపీ యన్ జి జి ఓ స్ అసోసియేషన్, తాలూకా యూనిట్, ప్రొద్దుటూరు.













