బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#దిగ్భ్రాంతి

23 articles

హిందూపురం మండలంలో చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం
జిల్లా వార్తలు

హిందూపురం మండలంలో చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం

హిందూపురం మండలం కొట్నూరు చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమై స్థానికుల్లో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు చెరువు పరిసరాల్లో ముమ్మరంగా పరిశీలనలు జరిపి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మృతురాలి గుర్తింపు, మరణానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

8, ఆగ 2026

వీడియో కాల్‌లో తండ్రి అంత్యక్రియలు, కుమార్తెల ప్రవర్తనపై ఆగ్రహం
జాతీయం

వీడియో కాల్‌లో తండ్రి అంత్యక్రియలు, కుమార్తెల ప్రవర్తనపై ఆగ్రహం

హరియాణాలోని సోనిపట్‌లో వృద్ధ వ్యాపారవేత్త వృద్ధాశ్రమంలో మరణించగా, ఆయన కుమార్తెలు అంత్యక్రియలకు ప్రత్యక్షంగా హాజరుకాకుండా వీడియో కాల్ ద్వారా మాత్రమే వీక్షించిన ఘటన స్థానికులను కలచివేసింది. దహన సంస్కారాల ఖర్చులకు ఆన్‌లైన్ ద్వారా రూ. 5,100 మాత్రమే పంపిన ఈ నిర్లక్ష్య వైఖరి కుటుంబ బంధాలు, తల్లిదండ్రుల పట్ల బాధ్యత, మానవ విలువలు క్షీణిస్తున్నాయనే ఆందోళనను మరింతగా పెంచింది.

6, ఆగ 2026

సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ మృతి
సినిమా

సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ మృతి

సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ మృతి వార్తపై సినీ వర్గాల్లో గందరగోళం నెలకొంది. ఆయన మరణంపై కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాకపోయినా, ఇంగ్లీష్ Wikipedia పేజీలో ఆయనను దివంగతుడిగా అప్డేట్ చేయడంతో అనుమానాలు పెరిగాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు సినీ పరిశ్రమ, అభిమానులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.

5, ఆగ 2026

ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి..
జాతీయం

ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి..

బీహార్‌లోని పూర్ణియా నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్‌పై ఢిల్లీలో దాడి యత్నం తీవ్ర కలకలం రేపింది.

2, ఆగ 2026

భార్య, 7 నెలల బిడ్డను సుత్తితో కొట్టి చంపిన భర్త!
కర్ణాటక

భార్య, 7 నెలల బిడ్డను సుత్తితో కొట్టి చంపిన భర్త!

కర్ణాటకలోని బళ్లారి నగరంలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్య ప్రవర్తనపై అనుమానం, ఏడు నెలల పసిపాప తన సంతానమేనా అనే క్రూరమైన సందేహంతో ఒక వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. సుత్తితో తీవ్రంగా బాది భార్యను, ఏడు నెలల కన్నకూతురిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితుడు హొన్నూరప్ప (28)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడిలో రాజేశ్వరి (24), ఆమె ఏడు నెలల కుమార్తె అశ్విని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

2, ఆగ 2026

ముఖ్యమంత్రితో మాట్లాడిన విద్యార్థిని ఆత్మహత్య..
ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రితో మాట్లాడిన విద్యార్థిని ఆత్మహత్య..

పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఇర్లపల్లి కొత్త కాలనీలో పదో తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల మెగా Parent-Teacher Meetingలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మాట్లాడిన అదే విద్యార్థిని కావడంతో ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. శివాని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

27, జులై 2026

కొమరం భీం జిల్లాలో విషాదం… చిన్న బ్యాటరీ పేలి బాలుడు మృతి
ఆంధ్రప్రదేశ్

కొమరం భీం జిల్లాలో విషాదం… చిన్న బ్యాటరీ పేలి బాలుడు మృతి

కొమరం భీం జిల్లా చింతల మానేపల్లి మండలం గూడెం గ్రామంలో చిన్న సైజు బ్యాటరీని నోటితో కొరకగా పేలిపోవడంతో బాలుడు నికడి గణేష్ తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోగా, పిల్లల చేతుల్లో ఉండే బ్యాటరీలు, చిన్న ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలనే అవసరాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

26, జులై 2026

హోం మంత్రి అమిత్ షాకి రాహుల్ గాంధీ ఘాటు లేఖ
జాతీయం

హోం మంత్రి అమిత్ షాకి రాహుల్ గాంధీ ఘాటు లేఖ

ఢిల్లీలో విద్యార్థులపై దాడి ఘటనకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటు లేఖ రాశార ు.

26, జులై 2026

ఉక్రెయిన్‌లో ఓడపై దాడి.. నలుగురు భారతీయుల మృతి
అంతర్జాతీయం

ఉక్రెయిన్‌లో ఓడపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

ఉక్రెయిన్‌లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరిన ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడ్డాడు.

21, జులై 2026

ఘజియాబాద్‌లో దారుణం! : రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
నేరాలు

ఘజియాబాద్‌లో దారుణం! : రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. రూ.150 కోట్ల విలువైన కుటుంబ ఆస్తి కోసం సొంత కొడుకే కన్నతండ్రిని కాల్చి చంపాడు. హత్య అనంతరం నిందితుడు పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

17, జులై 2026

అమెరికాలో భారతీయ ముస్లింపై కత్తి దాడి కలకలం
అంతర్జాతీయం

అమెరికాలో భారతీయ ముస్లింపై కత్తి దాడి కలకలం

అమెరికాలో జాతి, మత వివక్ష మరోసారి భయానక రూపం దాల్చింది. ఉటా రాష్ట్రంలోని ఒక షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న భారతీయ ముస్లింను గుర్తు తెలియని వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో పొడవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. "మీరు ముస్లిమా?" అని ప్రశ్నించిన ఆ వ్యక్తి, "అవును" అనే సమాధానం వచ్చిన వెంటనే దాడికి దిగడం అక్కడి ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

16, జులై 2026

ఖతార్ మాజీ ఎమిర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
అంతర్జాతీయం

ఖతార్ మాజీ ఎమిర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత

ఖతార్ మాజీ ఎమిర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ (74) ఆదివారం కన్నుమూశారు. ఆధునిక ఖతార్ రూపశిల్పిగా పేరుగాంచిన ఆయన 1995-2013 మధ్య ఎమిర్‌గా పనిచేసి, LNG రంగంలో దూరదృష్టి నిర్ణయాలతో దేశాన్ని ప్రపంచంలో అతిపెద్ద Liquefied Natural Gas ఎగుమతి దేశంగా తీర్చిదిద్దారు. ఆయన మరణంపై ఖతార్ నాలుగు రోజుల అధికారిక సంతాపం ప్రకటించగా, పలువురు ప్రపంచ నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

12, జులై 2026

కడపలో కరోనా నియంత్రణకు కఠిన చర్యలు: మంత్రి సవిత
జిల్లా వార్తలు

కడపలో కరోనా నియంత్రణకు కఠిన చర్యలు: మంత్రి సవిత

కడపలో ఎనిమిది కరోనా కేసులు, ఇద్దరి మృతులు నమోదవడంతో వైరస్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. కేసులు ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ నిబంధనలు, అవగాహన కార్యక్రమాలు, పరీక్షలు, ఐసోలేషన్, టీకాలు, వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టాలని సూచించారు. వియత్నాం బోటు ప్రమాదంలో ముడియం శ్రీధర్ మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, మృతదేహం స్వదేశానికి రప్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

12, జులై 2026

క్రికెట్ ప్రపంచంలో విషాదం: ఆఫ్గానిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ కన్నుమూత
క్రీడలు

క్రికెట్ ప్రపంచంలో విషాదం: ఆఫ్గానిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ కన్నుమూత

ఆఫ్గానిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (38) అరుదైన HLH వ్యాధితో పోరాడుతూ న్యూఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం కన్నుమూశారు. 2015 World Cupలో కీలక ప్రదర్శనలతో గుర్తింపు పొందిన ఆయన మరణంపై ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, దేశ క్రికెట్ పునాదిని నిర్మించిన ప్రముఖుల్లో జద్రాన్ ఒకరని పేర్కొంది.

7, జులై 2026

కర్నూలు–నంద్యాల రహదారిపై రోడ్డు ప్రమాదం… ఏఎస్సై సురేష్ రెడ్డి మృతి
జిల్లా వార్తలు

కర్నూలు–నంద్యాల రహదారిపై రోడ్డు ప్రమాదం… ఏఎస్సై సురేష్ రెడ్డి మృతి

కర్నూలు–నంద్యాల జాతీయ రహదారిపై తమరాజు పల్లె సమీపంలో కారు టైరు పేలిపోవడంతో వాహనం అదుపుతప్పి డివైడర్, సిమెంట్ దిమ్మెను ఢీకొట్టిన ప్రమాదంలో ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ ఏఎస్సై సురేష్ రెడ్డి (56) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర రెడ్డి సహా మరో నలుగురు గాయపడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

6, జులై 2026

కృష్ణా జిల్లా విషాదం: ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల ఉరేసుకుని ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా విషాదం: ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల ఉరేసుకుని ఆత్మహత్య

కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతాయిపేటలో రజని, ఆమె కుమార్తె గౌరి, కోడలు మధు ఒకే ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాలే కారణమై ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి, కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, ఎవరైనా ప్రేరేపించారా వంటి కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

4, జులై 2026

కర్నూలులో అనుమానాస్పద స్థితిలో ప్రైవేట్‌ ఉద్యోగి మృతి
జిల్లా వార్తలు

కర్నూలులో అనుమానాస్పద స్థితిలో ప్రైవేట్‌ ఉద్యోగి మృతి

కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న కేశవ్‌ అనుమానాస్పద స్థితిలో మృతదేహంగా కనిపించడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మృతదేహం పక్కనే రసాయనాల ఖాళీ సీసాలు లభ్యమవడంతో పోలీసులు ఆత్మహత్య కోణాన్ని పరిశీలిస్తున్నప్పటికీ, తండ్రి కృష్ణ ఇది ఆత్మహత్య కాదని, నిజానిజాలు వెలికితీయాలని డిమాండ్‌ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహ పరీక్షతో పాటు ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

4, జులై 2026

పీలేరు.. మాచర్ల   సమీపంలో రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు మృతి
నేరాలు

పీలేరు.. మాచర్ల సమీపంలో రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు మృతి

అన్నమయ్య జిల్లాలోని పీలేరు సమీపంలో కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. అదేవిధంగా పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

26, జూన్ 2026

ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనం: జర్మనీపై ఈక్వెడార్‌ విజయం, నాకౌట్‌కు అర్హత
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనం: జర్మనీపై ఈక్వెడార్‌ విజయం, నాకౌట్‌కు అర్హత

ఫిఫా ప్రపంచకప్‌ గ్రూప్‌–ఇలో ఈక్వెడార్‌ 2–1 తేడాతో జర్మనీపై గెలిచి సంచలనం సృష్టించింది. లెరోయ్‌ గోల్‌తో ముందంజలోకి వెళ్లిన జర్మనీపై నిల్సన్‌, ప్లేటా గోల్స్‌తో ఈక్వెడార్‌ తిరిగి బలంగా పోరాడి, ప్రపంచకప్‌ చరిత్రలో రెండోసారి నాకౌట్‌ దశకు చేరింది. కొత్త నిబంధనల ప్రకారం మూడో స్థానంలో నిలిచినా ఈక్వెడార్‌ నాకౌట్‌కు అర్హత సాధించింది.

26, జూన్ 2026

రైలుకు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య.. అనంతపురం జిల్లాలో విషాదం
జిల్లా వార్తలు

రైలుకు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య.. అనంతపురం జిల్లాలో విషాదం

అనంతపురం జిల్లాలో ప్రేమజంట రైలుకు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను కలచివేసింది. కుటుంబ సభ్యుల అంగీకారం లభించకపోవడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతుల పూర్తి వివరాలు, ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

21, జూన్ 2026

డీఎస్సీ అక్రమాల పై సిబిఐతో విచారణ జరిపించాలి  : వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

డీఎస్సీ అక్రమాల పై సిబిఐతో విచారణ జరిపించాలి : వైఎస్‌ జగన్‌

మెగా డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయి, ఇవి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని ఈ అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వంలో పారదర్శకంగా 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, ఒక్క తప్పు కూడా జరగలేదని చెప్పారు. మెగా డీఎస్సీ స్కామ్‌పై బాధితులకు న్యాయం చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పాలనంతా దగా, స్కాములు, అబద్దాలు, మోసాలకే ప్రతీకగా నిలిచిందని విమర్శించారు.

11, జూన్ 2026

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై జగన్ తీవ్ర విచారం, బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్
ఆంధ్రప్రదేశ్

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై జగన్ తీవ్ర విచారం, బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై వైయస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి నిర్లక్ష్యానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని, బాధితులకు అన్ని విధాలా అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు.

9, జూన్ 2026

బిహార్‌లో రోడ్డు ప్రమాదంపై మంత్రులు నారాయణ, ఆనం దిగ్భ్రాంతి
ఆంధ్రప్రదేశ్

బిహార్‌లో రోడ్డు ప్రమాదంపై మంత్రులు నారాయణ, ఆనం దిగ్భ్రాంతి

బిహార్‌లో లారీని ఓవర్‌టేక్ చేయబోయిన బస్సు ప్రమాదానికి గురై, నెల్లూరు జిల్లా ఆత్మకూరు, సంగం మండలాలకు చెందిన ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై మంత్రి నారాయణ, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసి, గాయపడిన వారికి మెరుగైన వైద్యం, బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందేలా అధికారులను ఆదేశించారు.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters