బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ప్రభుత్వంపై

20 articles

మెగా డీఎస్సీ–2025 తప్పుడు ప్రచారాన్ని చెక్: ఆత్మగౌరవ ర్యాలీ సిద్ధం
జిల్లా వార్తలు

మెగా డీఎస్సీ–2025 తప్పుడు ప్రచారాన్ని చెక్: ఆత్మగౌరవ ర్యాలీ సిద్ధం

మెగా డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయ నియామకాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, నిరాధార ఆరోపణలను ఖండిస్తూ అభ్యర్థులు ‘ఛలో కర్నూల్ మెగా డీఎస్సీ–2025 ఆత్మగౌరవ ర్యాలీ’ నిర్వహిస్తున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి 42 మంది అభ్యర్థులు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద జరిగే ర్యాలీలో పాల్గొంటున్నారు. ఉపాధ్యాయుల ఐక్యత, న్యాయమైన నియామకాలకు మద్దతు ప్రకటిస్తూ, నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వడం ఈ ర్యాలీ లక్ష్యంగా ఉంది.

8, ఆగ 2026

డీఎస్సీ పై సీబీఐతో విచారణ జరిపించాలి!:  ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్ డిమాండ్
రాజకీయాలు

డీఎస్సీ పై సీబీఐతో విచారణ జరిపించాలి!: ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్ డిమాండ్

డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాలలో అక్రమాలపై వైఎస్‌ జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులను అభినందించిన ఆయన, డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పునరుద్ఘాటించారు.

29, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాల్సిందేనని రాహుల్ డిమాండ్
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాల్సిందేనని రాహుల్ డిమాండ్

నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. నీట్‌ అవకతవకలతో విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించి, పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

25, జులై 2026

చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. విదేశీ పెట్టుబడులపై తప్పుడు ప్రచారం, పరిశ్రమల మూతపడటం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకు పడిపోవడం, జీఎస్టీ ఆదాయాలు తగ్గడం, భారీ రెవెన్యూ లోటు, రెండేళ్లలో రూ.3.5 లక్షల కోట్ల అప్పులు, రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆయన ఎత్తి చూపారు.

23, జులై 2026

కడపలో భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా రైతు సంఘాల నిరసన
జిల్లా వార్తలు

కడపలో భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా రైతు సంఘాల నిరసన

కడపలో సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఏఐకేఎస్ ఆధ్వర్యంలో రైతు సంఘాలు భారత్–అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టాయి. ఈ ఒప్పందం వల్ల అమెరికా సబ్సిడీ ఉత్పత్తులు భారత్‌లోకి వస్తే పత్తి, సోయాబీన్, ఎర్ర జొన్న, డెయిరీ, పౌల్ట్రీ రంగాలు దెబ్బతిని, రైతుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని నాయకులు హెచ్చరిస్తూ, కేంద్రం ఒప్పందాన్ని పునర్విమర్శించాలని డిమాండ్ చేశారు.

22, జులై 2026

వైఎస్సార్‌సీపీ చెత్త ప్రభుత్వం కాబట్టే ప్రజలు ఉఊడ్చేశారు: పట్టాభిరాం
జిల్లా వార్తలు

వైఎస్సార్‌సీపీ చెత్త ప్రభుత్వం కాబట్టే ప్రజలు ఉఊడ్చేశారు: పట్టాభిరాం

కడప జిల్లా ప్రొద్దుటూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని అవినీతి, చెత్త నిర్వహణలో నిర్లక్ష్యంతో నిండిన చెత్త ప్రభుత్వం అని తీవ్రంగా విమర్శించారు. రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రవ్యాప్తంగా 107 చెత్త ప్రాసెసింగ్ సెంటర్లు, ప్రొద్దుటూరులో 11.5 కోట్ల రూపాయలతో ఆధునిక చెత్త శుద్ధి కేంద్రం నిర్మిస్తున్నట్లు తెలిపారు.

17, జులై 2026

సోనం వాంగ్‌చుక్‌‌కు కేజ్రీవాల్ మద్దతు..
జాతీయం

సోనం వాంగ్‌చుక్‌‌కు కేజ్రీవాల్ మద్దతు..

యువత డిమాండ్లను కేంద్రం వెంటనే పరిష్కరించాలని.. లేకపోతే 2014 తరహా రాజకీయ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు.

17, జులై 2026

జగన్‌పై నెపం మోపడం మాత్రమే వారి పని: రాచమల్లు
జిల్లా వార్తలు

జగన్‌పై నెపం మోపడం మాత్రమే వారి పని: రాచమల్లు

కడప జిల్లా ప్రొద్దటూరు లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు రాచమల్లు సునీల్ రెడ్డి, ఏ సమస్య వచ్చినా కొందరు నాయకులు వెంటనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరును లాగి నెపం మోపడం అలవాటుగా చేసుకున్నారని విమర్శించారు. ప్రజల అసలు సమస్యలు, అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టకుండా ఆరోపణల రాజకీయాలు చేస్తూ పాలన వైఫల్యాలను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని, ప్రజలు ఈ ధోరణిని గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

16, జులై 2026

రుషికొండ భవనాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్

రుషికొండ భవనాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

విశాఖపట్నంలోని రుషికొండలో నిర్మించిన పర్యాటక భవనాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాతిపదికన ఈ భవనాలను లీజుకు కేటాయించాలని నిర్ణయించిన ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) ఆసక్తి వ్యక్తీకరణ (EOI) కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

3, జులై 2026

వైకాపా నేతలపై ఎమ్మెల్యే ఆది ఘాటు వ్యాఖ్యలు
జిల్లా వార్తలు

వైకాపా నేతలపై ఎమ్మెల్యే ఆది ఘాటు వ్యాఖ్యలు

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైకాపా నేతలపై, ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా పాలనలో తనపై పెట్టిన కేసులు, ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల కుటుంబం ఎదుర్కొన్న నష్టాలను గుర్తుచేస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరో మూడు సంవత్సరాలు కొనసాగుతుందని, ఆ సమయంలో వైకాపా నేతలకు తగిన రాజకీయ పాఠం చెబుతానని హెచ్చరించారు.

2, జులై 2026

పూర్తి కాలం అధికారంలో ఉంటాం!  డీఎంకే ప్రచారాన్ని కొట్టిపారేసిన తమిళనాడు సీఎం విజయ్
తమిళనాడు

పూర్తి కాలం అధికారంలో ఉంటాం! డీఎంకే ప్రచారాన్ని కొట్టిపారేసిన తమిళనాడు సీఎం విజయ్

తమిళనాడులో రాజకీయ సమీకరణాలు, ప్రభుత్వంపై వస్తున్న ఊహాగానాలకు ముఖ్యమంత్రి విజయ్ గట్టి సమాధానమిచ్చారు. చెన్నైలో నిర్వహించిన మిత్రపక్షాల ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని, కూటమి నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

2, జులై 2026

మల్లయ్యకొండ పవిత్రతను దెబ్బతీసేలా కూటమి నిర్ణయాలు – మాజీ మంత్రి పెద్దిరెడ్డి
జిల్లా వార్తలు

మల్లయ్యకొండ పవిత్రతను దెబ్బతీసేలా కూటమి నిర్ణయాలు – మాజీ మంత్రి పెద్దిరెడ్డి

మల్లయ్యకొండ ప్రాంతంలో ఇనుప ఖనిజ మైనింగ్ అనుమతుల విషయంలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

1, జులై 2026

త్వరలో సొంత భవనాల్లోకి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు
జిల్లా వార్తలు

త్వరలో సొంత భవనాల్లోకి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

చిత్తూరు జిల్లాలోని చిత్తూరు రూరల్‌, నగరి, బంగారుపాళ్యం, కార్వేటినగరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ప్రభుత్వం సొంత భవనాల నిర్మాణం కోసం భూములను కేటాయించి, స్టాంపులు–రిజిస్ట్రేషన్‌ శాఖకు అప్పగించింది. అనుమతులు లభించిన వెంటనే టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించనుండగా, ఆధునిక సౌకర్యాలతో భవనాలు సిద్ధమైతే శాఖ పనితీరు మెరుగై ప్రజలకు మంచి సేవలు అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

26, జూన్ 2026

ప్రభుత్వంపై దుష్ప్రచారం..: అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ప్రభుత్వంపై దుష్ప్రచారం..: అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

పీజీఆర్ఎస్ అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అర్జీదారుల స్థానంలో ఉండి ఫిర్యాదులను పరిష్కరించే దిశగా దృష్టి సారించాలని ఆదేశించారు.

22, జూన్ 2026

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం  : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
రాజకీయాలు

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు.

19, జూన్ 2026

కూటమి ప్రభుత్వంపై వైకాపా తప్పుడు ప్రచారం: ఎంపీ, ఎమ్మెల్యేల విమర్శలు
జిల్లా వార్తలు

కూటమి ప్రభుత్వంపై వైకాపా తప్పుడు ప్రచారం: ఎంపీ, ఎమ్మెల్యేల విమర్శలు

నంద్యాలలో జరిగిన ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ సభలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు వివరించారు. ఈ పథకాలు చూసి ఓర్చుకోలేక వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని వారు ఆరోపిస్తూ, అమరావతి అభివృద్ధి, రైతు సంక్షేమం, రాయలసీమ పురోగతికి కూటమి కట్టుబడి ఉందని, కేంద్ర–రాష్ట్రాల సమన్వయంతో పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు.

18, జూన్ 2026

అభివృద్ధిపై వైకాపాతో చర్చకు సిద్ధం: మంత్రి సవిత
జిల్లా వార్తలు

అభివృద్ధిపై వైకాపాతో చర్చకు సిద్ధం: మంత్రి సవిత

మంత్రి సవిత పుట్టపర్తిలో జరిగిన విజయోత్సవ సభలో వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నాయకుల విమర్శలను ఖండిస్తూ, రాష్ట్రంలో రెండేళ్లుగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు చేశారు. కూటమి ప్రభుత్వం పెట్టుబడులు, పరిశ్రమలు, హార్టికల్చర్‌ హబ్‌, ఆరోగ్యశ్రీ వ్యయాలతో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చేందుకు కృషి చేస్తోందని మంత్రి సవిత, మంత్రి సత్యకుమార్‌యాదవ్ పేర్కొన్నారు.

17, జూన్ 2026

బాబు, లోకేశ్‌లు కలిసే  డీఎస్సీ స్కామ్‌కు స్కెచ్
రాజకీయాలు

బాబు, లోకేశ్‌లు కలిసే డీఎస్సీ స్కామ్‌కు స్కెచ్

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. ఏపీ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ను అభివర్ణిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు, నారా లోకేశ్‌లు కలిసి ఓ మెగా స్కామ్‌కు రూపకల్పన చేసిన పాలసీ ప్రాజెక్ట్ అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. అలాగే.. ఈ వ్యవహారంపై థర్డ్‌ పార్టీ ఏజెన్సీతోనే విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు.

13, జూన్ 2026

కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్

కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం

విశాఖ ప్రమాదం నేపథ్యంలో కార్మిక సంఘాల నేతల రాజకీయీకరణపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విషాద సమయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లోపే ప్రతి బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు జమ చేసే చర్యలు తీసుకున్నామని, ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం మాత్రమే కాక దీర్ఘకాలిక పునరావాసం, భవిష్యత్ భద్రతపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలిపారు.

9, జూన్ 2026

రాష్ట్ర అభివృద్ధికి దుర్మార్గులను దూరం పెట్టాలి
రాజకీయాలు

రాష్ట్ర అభివృద్ధికి దుర్మార్గులను దూరం పెట్టాలి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరిలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తూ, భూ సమస్యల పరిష్కారానికి బ్లాక్‌చైన్, QR కోడ్‌తో రాజముద్ర కలిగిన పాస్ పుస్తకాలు, E-KYC వంటి చర్యలను వివరించారు. గత ప్రభుత్వం ప్రజల భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిందని, భారీ అప్పులు చేసి పరిశ్రమలు తీసుకురాలేదని, జగన్‌ను తీవ్రంగా విమర్శిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి దుర్మార్గులను దూరం పెట్టాలని ప్రజలను అప్రమత్తం చేశారు.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters