బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#శ్రీనివాసరావు

12 articles

పెనగలూరు మండలంలో 6.5 కిలోల గంజాయి స్వాధీనం: ముగ్గురు అరెస్ట్, ఒకరు పరారీలో
జిల్లా వార్తలు

పెనగలూరు మండలంలో 6.5 కిలోల గంజాయి స్వాధీనం: ముగ్గురు అరెస్ట్, ఒకరు పరారీలో

తిరుపతి జిల్లా పెనగలూరు మండలంలోని బెస్తపల్లి సమీపంలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 6.5 కిలోల గంజాయి, టాటా సుమో వాహనం, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. మాదకద్రవ్యాల నిర్మూలన, యువత భవిష్యత్తు పరిరక్షణ లక్ష్యంగా జిల్లా పోలీసులు లోతైన దర్యాప్తు, ప్రత్యేక నిఘా చర్యలు కొనసాగిస్తున్నారు.

29, జులై 2026

సమీర్‌పై కత్తి దాడి కేసు: నలుగురు యువకులు అరెస్టు
జిల్లా వార్తలు

సమీర్‌పై కత్తి దాడి కేసు: నలుగురు యువకులు అరెస్టు

ఆళ్లగడ్డ పాత బస్టాండ్ ప్రాంతంలో సమీర్‌పై కత్తులతో దాడి చేసిన కేసులో నలుగురు యువకులను పోలీసులు జులై 22న అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రెండు మోటార్ బైకులు, ఒక కత్తి స్వాధీనం చేసుకుని, ప్రేమ వ్యవహారమే దాడికి కారణమని గుర్తించిన పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తూ నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు.

23, జులై 2026

‘డ్రగ్స్‌పై దండయాత్ర 2.0’ కొనసాగింపు – గంజాయి రహిత సమాజమే లక్ష్యం
జిల్లా వార్తలు

‘డ్రగ్స్‌పై దండయాత్ర 2.0’ కొనసాగింపు – గంజాయి రహిత సమాజమే లక్ష్యం

తిరుపతి జిల్లా పోలీసులు యువతను మాదకద్రవ్యాల నుంచి దూరం పెట్టి గంజాయి రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా ‘డ్రగ్స్‌పై దండయాత్ర 2.0’ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఆధునిక బయోచెక్ కిట్లతో వినియోగదారులను గుర్తించి, సరఫరా వ్యవస్థలోని నిర్వాహకులు, విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటూ, కౌన్సిలింగ్, పునరావాస కేంద్రాల ద్వారా చికిత్స, అవగాహన కార్యక్రమాలను సమాంతరంగా నిర్వహిస్తున్నారు.

19, జులై 2026

శ్రీశైలంలో  స్పర్శ దర్శనంలో కీలక మార్పులు
జిల్లా వార్తలు

శ్రీశైలంలో స్పర్శ దర్శనంలో కీలక మార్పులు

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ అధికారులు విరామ (స్పర్శ) దర్శన విధానంలో కీలక మార్పులు చేశారు. క్షేత్రానికి రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా నేటి (ఆదివారం) నుంచి కొత్త నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

19, జులై 2026

శ్రీశైలం దేవస్థానంలో దర్శన విధానాల్లో కీలక మార్పులు
జిల్లా వార్తలు

శ్రీశైలం దేవస్థానంలో దర్శన విధానాల్లో కీలక మార్పులు

శ్రీశైలం దేవస్థానం దర్శన విధానాల్లో కీలక మార్పులు చేసి, సెలవు రోజుల్లో భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించేలా కొత్త వ్యవస్థను అమలు చేసింది. ఉదయం అలంకార దర్శనం ద్వారా సాధారణ భక్తులకు సేవలు అందించగా, ఉదయం నేరుగా వచ్చే వీఐపీలకు, సాయంత్రం సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులకు మాత్రమే స్పర్శదర్శనం కల్పిస్తున్నారు. ఈ మార్పులతో భక్తులకు మెరుగైన సేవలు, సంతృప్తికర దర్శనం అందుతున్నట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు.

18, జులై 2026

శ్రీశైలం మల్లన్న భక్తులకు అలర్ట్.. బ్రేక్ దర్శనం నిలిపివేత
జిల్లా వార్తలు

శ్రీశైలం మల్లన్న భక్తులకు అలర్ట్.. బ్రేక్ దర్శనం నిలిపివేత

శ్రీశైలం మల్లన్న స్పర్శ (బ్రేక్) దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. వారాంతపు సెలవులు కావడంతో క్షేత్రానికి అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగిందని పేర్కొన్నారు.

12, జులై 2026

ప్రజా సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలి
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలి

ప్రజల నుంచి వచ్చిన పిటిషన్లపై శాసనసభ పిటిషన్స్ కమిటీ సీరియస్‌గా పనిచేస్తోందని కమిటీ చైర్మన్ రఘురామకృష్ణంరాజు తెలిపారు.

23, జూన్ 2026

ఏపీ కేజీబీవీ నియామక నోటిఫికేషన్‌లో కీలక మార్పులు
విద్య

ఏపీ కేజీబీవీ నియామక నోటిఫికేషన్‌లో కీలక మార్పులు

ఏపీ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ పాఠశాలల్లో 299 ఖాళీల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ప్రభుత్వం కొన్ని నిబంధనలను సవరించి, దరఖాస్తుల గడువును జూన్ 20 వరకు పొడిగించింది. దరఖాస్తు సమయానికి TET అర్హత లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే నియామకం తర్వాత ఏడాది లోపు AP TETలో అర్హత సాధించాల్సి ఉంటుందని, లేనిపక్షంలో సేవలను ఆటోమేటిక్‌గా నిలిపివేస్తామని అధికారులు తెలిపారు.

16, జూన్ 2026

శ్రీశైలం మల్లన్నకు కోటి విలువైన బంగారు, వెండి ఆభరణాల విరాళం
జిల్లా వార్తలు

శ్రీశైలం మల్లన్నకు కోటి విలువైన బంగారు, వెండి ఆభరణాల విరాళం

నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానానికి కాకినాడ జిల్లా పెద్దాపురం చెందిన శ్రీ లలితా ఎంటర్ ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ మట్టే శ్రీనివాస్ దంపతులు సుమారు కోటి రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, పూజా సామగ్రిని విరాళంగా సమర్పించారు. దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు ప్రకారం 42.516 కిలోల వెండి వస్తువులు, 73.5 గ్రాముల బంగారు ఆభరణాలు ఈ విరాళంలో భాగంగా ఉండగా, ఇవి దేవస్థానం ఆస్తుల్లో విలువైన భాగంగా చేరనున్నాయని తెలిపారు.

13, జూన్ 2026

ఆర్కే బీచ్‌లో ఆదిత్య 369 ‘టైమ్‌ మెషీన్‌’ ప్రతిరూపం సందర్శకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది
ఆంధ్రప్రదేశ్

ఆర్కే బీచ్‌లో ఆదిత్య 369 ‘టైమ్‌ మెషీన్‌’ ప్రతిరూపం సందర్శకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది

విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు క్లాసిక్‌ చిత్రం ఆదిత్య 369లోని టైమ్‌ మెషీన్‌ నమూనాను ప్రతిరూపంగా ఏర్పాటు చేయడంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో ఆకర్షితులయ్యారు. 94 ఏళ్ల వయసులో ఆయన రూపొందించిన కొత్త చిత్రం సింగ్‌..గీతం ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ఆకృతిలో, ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల పోస్టర్లను ప్రదర్శించగా, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఆనందించారు.

7, జూన్ 2026

భవిష్యత్తులోనూ ఇలాంటి సినిమాని ఎవ్వరూ చేయలేరేమో: నాగ్‌ అశ్విన్‌
టాలీవుడ్

భవిష్యత్తులోనూ ఇలాంటి సినిమాని ఎవ్వరూ చేయలేరేమో: నాగ్‌ అశ్విన్‌

దర్శకుడు, నిర్మాత నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ‘సింగ్‌ గీతం’ను కాలంతో పోటీపడే మ్యూజికల్‌ ఫాంటసీగా అభివర్ణిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి సినిమా మళ్లీ రావడం కష్టమని భావిస్తున్నట్టు తెలిపారు. కుబేరపురం నేపథ్యంలో నడిచే ఈ పూర్తిగా కల్పిత కథలో మాటలన్నీ పాటల రూపంలో ఉండటం ప్రత్యేకతగా చెప్పారు. ‘కల్కి 2’ చిత్రీకరణను వచ్చే నెల నుంచి ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

7, జూన్ 2026

సైకిల్ యాత్రకు టీడీపీ శ్రీకారం :  కార్యకర్తలంతా  పాల్గొనాలని పల్లా పిలుపు
ఆంధ్రప్రదేశ్

సైకిల్ యాత్రకు టీడీపీ శ్రీకారం : కార్యకర్తలంతా పాల్గొనాలని పల్లా పిలుపు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను తెలియజేయడానికి రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్ర నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా సైకిల్ ప్రయాణం చేయనున్నారని చెప్పారు. కాలుష్యం తగ్గించేందుకు, ఇంధనాన్ని ఆదా చేసేందుకు, ఆరోగ్యాన్ని కాపాడేందుకు సైకిల్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters