బ్రేకింగ్ న్యూస్
ఎర్రగుడిపాడు ఆలయ ఘటనపై స్పందించిన అధికారులు.. దళితులకు స్వామివారి దర్శనంప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు
Search

TAG

#వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

18 articles

పోరుమామిళ్ల జెడ్పీటీసీగా చిట్టిబోయిన గురమ్మ ఖరారు
జిల్లా వార్తలు

పోరుమామిళ్ల జెడ్పీటీసీగా చిట్టిబోయిన గురమ్మ ఖరారు

కడప జిల్లా పోరుమామిళ్ల మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిట్టిబోయిన గురమ్మను అధికారికంగా ఎంపిక చేసింది. ఈ నిర్ణయంతో మండల రాజకీయ వాతావరణం వేడెక్కి, ఇతర పార్టీల అభ్యర్థుల ఎంపిక, వ్యూహాలపై ఆసక్తి పెరిగింది. గురమ్మ పార్టీ శ్రేణులతో సంప్రదింపులు ప్రారంభించగా, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ప్రచార పోరు మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశముంది.

17, అక్టో 2026

ఎమ్మిగనూరు వైఎస్సార్‌సీపీలో నామినేషన్‌ల కోసం ప్రత్యేక లీగల్ టీం
జిల్లా వార్తలు

ఎమ్మిగనూరు వైఎస్సార్‌సీపీలో నామినేషన్‌ల కోసం ప్రత్యేక లీగల్ టీం

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక లీగల్ టీంను ఏర్పాటు చేసింది. ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ బృందం నామినేషన్ పత్రాల పూరణ, ధ్రువపత్రాల సమర్పణ, ఎన్నికల నిబంధనలపై మార్గదర్శకత్వం అందిస్తూ, చిన్నపాటి పొరపాట్లు కూడా అభ్యర్థిత్వంపై ప్రభావం చూపకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా సహకరించనుంది.

17, అక్టో 2026

పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్ రేసులో వైయస్ ప్రమీలమ్మ…
జిల్లా వార్తలు

పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్ రేసులో వైయస్ ప్రమీలమ్మ…

పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైయస్ మనోహర్ రెడ్డి సతీమణి వైయస్ ప్రమీలమ్మను పార్టీ వర్గాలు ప్రకటించాయి. స్థానిక రాజకీయ సమీకరణాలు, కుటుంబ-సామాజిక అనుబంధం పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇతర పార్టీల అభ్యర్థులపై ఇంకా స్పష్టత లేకపోయినా, ముందస్తు ప్రకటనతో వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల రంగంలో ముందడుగు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

13, అక్టో 2026

వైసీపీ మేయర్ అభ్యర్థుల ఎంపికపై జగన్‌లో కసరత్తు
రాజకీయాలు

వైసీపీ మేయర్ అభ్యర్థుల ఎంపికపై జగన్‌లో కసరత్తు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్ రెడ్డి పేరు ఖరారయ్యగా, మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్ల అభ్యర్థుల ఎంపికపై మంగళవారం వైఎస్ జగన్ రీజనల్ కోఆర్డినేటర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మేయర్ అభ్యర్థుల పేర్లపై స్పష్టత వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

13, అక్టో 2026

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ దృష్టి… కర్నూలులో కీలక నాయకుల సమావేశం
జిల్లా వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ దృష్టి… కర్నూలులో కీలక నాయకుల సమావేశం

కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కీలక నాయకుల సమావేశం నిర్వహించింది. పార్టీ బలోపేతం, నాయకులు–కార్యకర్తల సమన్వయం, ప్రజల్లో విశ్వాసం పెంపు, ఎమ్మిగనూరు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి వంటి అంశాలపై చర్చించి, గ్రామం నుంచి పట్టణం వరకు శ్రేణులు ఐక్యంగా పనిచేసి రానున్న ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని నిర్ణయించారు.

12, అక్టో 2026

గుంతకల్‌లో ఎన్నికల ప్రక్రియపై నిరసనలు
జిల్లా వార్తలు

గుంతకల్‌లో ఎన్నికల ప్రక్రియపై నిరసనలు

అనంతపురం జిల్లా గుంతకల్‌లో SIR పేరుతో ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారంటూ సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, ప్రజా సంఘాలు కలిసి గాంధీ చౌక్ వద్ద నిరసన చేపట్టాయి. SIR ప్రక్రియను వెంటనే నిలిపివేసి తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని, ఎన్నికల కమిషన్ పారదర్శకతతో వ్యవహరించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.

2, అక్టో 2026

బద్వేల్ గోపవరం మండలంలో టీడీపీ శక్తి ప్రదర్శన
జిల్లా వార్తలు

బద్వేల్ గోపవరం మండలంలో టీడీపీ శక్తి ప్రదర్శన

వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలంలో టీడీపీ బలోపేతం కార్యక్రమాలు, భారీ చేరికలు, ర్యాలీతో రాజకీయ చర్చనీయాంశంగా మారాయి. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగి, వందలాది వాహనాలతో నిర్వహించిన ర్యాలీ టీడీపీ బలం పెరుగుతోందనే సంకేతాలు ఇస్తోందని స్థానిక వర్గాలు, విశ్లేషకులు భావిస్తున్నారు.

7, సెప్టెం 2026

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యలపై యాదవ సంఘం ఆగ్రహం
జిల్లా వార్తలు

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యలపై యాదవ సంఘం ఆగ్రహం

కడప జిల్లా పొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన “నాలుక కోస్తా” వ్యాఖ్యలను కడప జిల్లా యాదవ సంఘం తీవ్రంగా ఖండించింది. సంఘం అధ్యక్షుడు బుర్రి రెడ్డయ్య యాదవ్, ఇవి బీసీ వర్గాలపై బెదిరింపు ధోరణికి నిదర్శనమని పేర్కొంటూ, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నందం సుబ్బయ్య హత్య కేసును Special Investigation Team ద్వారా విచారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు.

2, సెప్టెం 2026

స్థానిక ఎన్నికల్లో టీడీపీకి ప్రజలే అండగా నిలుస్తారు: జబీవుల్లా
జిల్లా వార్తలు

స్థానిక ఎన్నికల్లో టీడీపీకి ప్రజలే అండగా నిలుస్తారు: జబీవుల్లా

టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్లా, ప్రొద్దుటూరు అభివృద్ధిని వైఎస్సార్ కాంగ్రెస్ తమ ఘనతగా చెప్పుకోవడం వాస్తవాలకు విరుద్ధమని విమర్శించారు. టీడీపీ హయాంలో అన్ని వర్గాల అభ్యున్నతికి అమలు చేసిన పథకాలు ప్రజలకు గుర్తుండేలా ఉన్నాయని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధి, సేవ ఆధారంగా ఓటర్లు తీర్పు ఇస్తారని, ప్రజలే టీడీపీకి అండగా నిలుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

25, ఆగ 2026

దళితులపై దాడులు, శాంతిభద్రతల వైఫల్యంపై జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం కోరిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం
జిల్లా వార్తలు

దళితులపై దాడులు, శాంతిభద్రతల వైఫల్యంపై జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం కోరిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం

రాష్ట్రంలో దళితులపై దాడులు, లాకప్ డెత్‌లు, శాంతిభద్రతల క్షీణతపై జాతీయ ఎస్సీ కమిషన్ తక్షణ జోక్యం కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ప్రతినిధి బృందం కమిషన్ ఛైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. రాష్ట్ర ఎస్సీ కమిషన్ వైఫల్యం, బాధితులకు న్యాయం లేకపోవడం, మీడియా స్వేచ్ఛపై దాడులు ఆందోళనకరమని ఎంపీ మద్దిల గురుమూర్తి విమర్శిస్తూ, దళితులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

7, ఆగ 2026

జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌కు తిరుపతిలో ఘన స్వాగతం
జిల్లా వార్తలు

జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌కు తిరుపతిలో ఘన స్వాగతం

జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ తిరుపతి పర్యటనలో భాగంగా నగర విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా ఎంపీ మద్దిల గురుమూర్తి నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించిన అనంతరం నాయకులు ఆయనతో సంక్షిప్తంగా మాట్లాడి, ఎస్సీ వర్గాల సంక్షేమం, సమస్యల పరిష్కారంపై కమిషన్ చేపడుతున్న చర్యల గురించి చర్చించారు.

7, ఆగ 2026

నంద్యాల జిల్లాలో గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే రామభూపాల్ రెడ్డి
జిల్లా వార్తలు

నంద్యాల జిల్లాలో గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే రామభూపాల్ రెడ్డి

నంద్యాల జిల్లాలో గోరుకల్లు రిజర్వాయర్, అవుకు టన్నెల్, అవుకు రిజర్వాయర్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి నేతృత్వంలోని బృందం ప్రత్యక్షంగా పరిశీలించింది. నీటి నిల్వలు, పంపిణీ, సాగునీటి అవసరాలు, వర్షాకాలం-ఎండాకాలం నీటి నిర్వహణపై స్థానిక స్థాయిలో చర్చలు జరిపి, సేకరించిన వివరాలను సమగ్రంగా సమీక్షించి అవసరమైన సూచనలు అధికారులకు ఇవ్వాలని పార్టీ భావిస్తోంది.

5, ఆగ 2026

డీఎస్సీ పై సీబీఐతో విచారణ జరిపించాలి!:  ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్ డిమాండ్
రాజకీయాలు

డీఎస్సీ పై సీబీఐతో విచారణ జరిపించాలి!: ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్ డిమాండ్

డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాలలో అక్రమాలపై వైఎస్‌ జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులను అభినందించిన ఆయన, డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పునరుద్ఘాటించారు.

29, జులై 2026

జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ..
రాజకీయాలు

జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘జగన్‌ 2.0’ మొబైల్ సూపర్ యాప్‌ను ఆవిష్కరించారు.

16, జులై 2026

జగన్‌పై నెపం మోపడం మాత్రమే వారి పని: రాచమల్లు
జిల్లా వార్తలు

జగన్‌పై నెపం మోపడం మాత్రమే వారి పని: రాచమల్లు

కడప జిల్లా ప్రొద్దటూరు లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు రాచమల్లు సునీల్ రెడ్డి, ఏ సమస్య వచ్చినా కొందరు నాయకులు వెంటనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరును లాగి నెపం మోపడం అలవాటుగా చేసుకున్నారని విమర్శించారు. ప్రజల అసలు సమస్యలు, అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టకుండా ఆరోపణల రాజకీయాలు చేస్తూ పాలన వైఫల్యాలను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని, ప్రజలు ఈ ధోరణిని గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

16, జులై 2026

రాజకీయ నీతి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు: పేర్ని నాని తీవ్ర విమర్శ
రాజకీయాలు

రాజకీయ నీతి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు: పేర్ని నాని తీవ్ర విమర్శ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదని తీవ్రంగా విమర్శించారు. సోషల్ మీడియాను నియంత్రించేందుకు ప్రభుత్వం రూ.210 కోట్లు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని, టాస్క్ ఫోర్స్ , Sub కంమిట్టీస్ పేరుతో YSRCP కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు,లోకేష్, బాలకృష్ణ లపై సోషల్ మీడియాలో విమర్శలు లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ, RTC అమ్మకం, నిరుద్యోగులకు ఉద్యోగాల లేమి, మంగళగిరి ప్రజలకు లోకేష్ దుబాటులో లేకపోవడం వంటి అంశాలపై ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆయన సవాల్ చేశారు.

12, జులై 2026

తోపుదుర్తి అరెస్ట్‌.. అనంతపురంలో అదే ఉద్రికత్త..
రాజకీయాలు

తోపుదుర్తి అరెస్ట్‌.. అనంతపురంలో అదే ఉద్రికత్త..

అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో తోపుదుర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

9, జులై 2026

రాష్ట్రంలో దారుణ పరిస్థితులు:    మళ్ళీ పాదయాత్ర చేస్తా : వైఎస్ జగన్
రాజకీయాలు

రాష్ట్రంలో దారుణ పరిస్థితులు: మళ్ళీ పాదయాత్ర చేస్తా : వైఎస్ జగన్

రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమై ప్రజలను మోసం చేసిందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తమ పాలనలో సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని గుర్తుచేసిన ఆయన, మరో ఏడాదిన్నరలో పాదయాత్ర ప్రారంభిస్తానని, జగన్ 2.0లో కార్యకర్తలకు మరింత ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

18, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters