రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో తోపుదుర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వెళ్తుండగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాకు దిగారు.
ఇక, అంతకుముందు.. టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని టార్గెట్ చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద ఆందోళనకు టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. దీనికి ధీటుగా టీడీపీ నేతల దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు తోపుదుర్తి సిద్ధమయ్యారు. టీడీపీకి కౌంటర్‌గా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఇటీవల తనపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును ముందుకు పెట్టి పరిటాల శ్రీరామ్, అమిలినేని సురేంద్ర బాబు రాజకీయాలు చేస్తున్నారని తోపుదుర్తి విమర్శించారు. ఈ వ్యవహారంపై ఆయన తన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, టీడీపీ నేతల ఆరోపణలను రాజకీయంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.













