రాయలసీమ న్యూస్, నంద్యాల:
నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంటింటి పర్యటన
నందికొట్కూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి శ్రీమతి షేక్ ఫాతిమా బీ, 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీమతి బి. సువర్ణమ్మలకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ప్రచార బృందం స్థానిక ప్రజలను కలుసుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించింది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలకు అందించిన సంక్షేమం, అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ, మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని నాయకులు కోరారు.
నందికొట్కూరు మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి నేతృత్వంలోని బృందం ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం కొనసాగించింది.
9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బి. సువర్ణమ్మ భర్త బి. వెంకటేశ్వర్లు స్థానిక వార్డులోని ప్రతి కుటుంబంతో, ముఖ్యంగా యువతతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం, పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాలుపంచుకోవడం వల్ల ఈ వార్డు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లడం ఖాయమని వార్డు ప్రజలు చెప్పుకుంటున్నారు.
రెండవసారి కౌన్సిలర్‌గా బరిలోకి దిగిన బి. సువర్ణమ్మ గత అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తుండటం, ప్రత్యర్థి అభ్యర్థుల కంటే ముందుండేలా ప్రచారాన్ని ముమ్మరం చేయడం పార్టీకి అనుకూలంగా మారిందని స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బోయ వెంకటేశ్వర్లు, జి. ఎం. ఖలీల్, జగన్ రఫీ, మధు, లింగస్వామి, పరశురాముడు, వడ్డే రాముడు, వడ్డే చెంచమ్మ, వడ్డే అరుణ, బోయ జంబులమ్మ, రమణమ్మ, సావిత్రి, లక్ష్మీతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.













