భారత్‌లోకి రెడ్‌మీ టర్బో 5 ప్రవేశం.. ప్రీమియం మిడ్‌రేంజ్‌ సెగ్మెంట్‌లో ఆల్‌రౌండర్‌ ఫోన్‌

షావోమీ సబ్‌బ్రాండ్‌ రెడ్‌మీ భారత మార్కెట్‌లో కొత్త టర్బో సిరీస్‌ను ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో తొలి స్మార్ట్‌ఫోన్‌గా Redmi టర్బో 5ను విడుదల చేసింది. ప్రీమియం మిడ్‌రేంజ్‌ విభాగంలోకి తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో పనితీరు, బిల్డ్‌ క్వాలిటీ రెండింటినీ సమతుల్యం చేస్తూ పెద్ద సామర్థ్యం గల బ్యాటరీను అందించడం విశేషం. ఆల్‌రౌండ్‌ ఫీచర్లు కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని ఈ మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

సాఫ్ట్‌వేర్‌ పరంగా రెడ్‌మీ టర్బో 5లో ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేసే HyperOS 3ను అందించారు. డిస్‌ప్లే విషయానికి వస్తే 6.59 అంగుళాల1.5K AMOLED స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు.120Hz రిఫ్రెష్‌ రేటు, 3500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌తో వస్తోంది. స్క్రీన్‌ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. అలాగే డాల్బీ Vision సపోర్ట్‌ కూడా ఉంది.

దుమ్ము, నీటి నిరోధకత కోసం ఈ ఫోన్‌కు IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లు లభించాయి. పనితీరు కోసం మీడియాటెక్ Dimensity 8500 Ultra చిప్‌సెట్‌ను వినియోగించారు. LPDDR5X Ultra RAM, UFS 4.1 స్టోరేజ్‌ టెక్నాలజీని అందిస్తున్నారు. AnTuTu బెంచ్‌మార్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌పై ఈ ఫోన్‌ 23 లక్షల పాయింట్లు స్కోర్‌ చేసిందని కంపెనీ పేర్కొంటోంది. కంపెనీ 4+6 అప్‌డేట్‌ పాలసీని కూడా ప్రకటించింది.

కెమెరా విభాగంలో వెనకవైపు డ్యూయల్‌ కెమెరా సెటప్‌ ఇచ్చారు. Optical Image Stabilization, Electronic Image Stabilization సదుపాయాలతో కూడిన Sony IMX882 సెన్సర్‌ ఆధారిత 50 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా ఉంది. అదనంగా 8 మెగాపిక్సెల్‌ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను అందించారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 20 మెగాపిక్సెల్‌ కెమెరా ఉంది.

ఈ ఫోన్‌లో రెడీమి పిక్సెల్ Matrix అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేశారు. నోటిఫికేషన్లు, అలర్టులు వచ్చినప్పుడు వెనక కెమెరా లెన్స్‌ చుట్టూ వృత్తాకారంలో లైట్‌ వెలిగేలా డిజైన్‌ చేశారు. బ్యాటరీ పరంగా 7,540mAh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. 100W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. అలాగే 27W రివర్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం కూడా ఉంది. కనెక్టివిటీ కోసం Bluetooth 6.0, IR బ్లాస్టర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ధరల విషయానికొస్తే రెడీమి టర్బో 5 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8GB RAM + 256GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను కంపెనీ రూ.37,999గా నిర్ణయించింది. 12GB RAM + 256GB స్టోరేజ్‌ వేరియంట్‌ను రూ.40,999గా ప్రకటించింది. SBI, ICICI, Axis Bank కార్డులతో కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.2 వేల డిస్కౌంట్‌ లభిస్తుంది.

ఈ ఫోన్‌ జూన్‌ 19 నుంచి Amazon ద్వారా విక్రయానికి రానుంది. Asphalt Black, Nitro Blue, Turbo White రంగుల్లో అందుబాటులో ఉంటుంది. మెటల్‌ ఫ్రేమ్‌, గ్లాస్‌ బ్యాక్‌ డిజైన్‌ వల్ల ఫోన్‌ చేతిలో పట్టుకున్నప్పుడు ప్రీమియం ఫీల్‌ కలిగేలా కంపెనీ రూపొందించింది.