స్టాక్ మార్కెట్లో ఈ వరం సందడే

11 ఇష్యూలు.. 9 లిస్టింగ్‌లు

ప్రైమరీ మార్కెట్‌లో పబ్లిక్‌ ఇష్యూల సందడి వేగం పుంజుకొంది. భౌగోళిక ఉద్రిక్తతలు చల్లారిన నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఐపీఓలకు వచ్చేందుకు కంపెనీలు ఉత్సాహం చూపిస్తున్నాయి. వచ్చే వారం మొత్తం 11 ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్‌కు రానున్నాయి. ఇందులో రెండు మెయిన్‌బోర్డువి కాగా.. మిగిలినవి ఎస్‌ఎంఈ కేటగిరీకి చెందినవి. ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ పూర్తి చేసుకున్న మరో 9 కంపెనీలు వచ్చేవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ కానున్నాయి.

ఐఈఓకు వచ్చే కంపెనీలు ఇవే..

  • ఆస్తా స్పింటెక్స్‌ ఐపీఓ జూన్‌ 29న ప్రారంభమై జులై 1న ముగియనుంది. ధరల శ్రేణిని రూ.125-136గా కంపెనీ నిర్ణయించింది. రూ.170 కోట్లు ఐపీఓ ద్వారా సమీకరించనుంది.

  • న్యాక్‌ ప్యాకేజింగ్‌ ఐపీఓ జులై 1 నుంచి జులై 3 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉండనుంది. ధరల శ్రేణిని రూ.161-170గా కంపెనీ నిర్ణయించింది. ఐపీఓ ద్వారా రూ.439.50 కోట్లు సమీకరించనుంది. ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా రూ.380 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా రూ.59.50 కోట్లు సమీకరించనుంది.

  • ట్వింకిల్‌ పేపర్స్‌, అడోన్‌ ఆగ్రో కమొడిటీస్‌, క్రటికల్‌ టెక్‌ ఐపీఓ, టేజ ఇంజినీరింగ్‌ ఇండస్ట్రీస్‌, అథర్వ పాలీప్లాస్ట్‌, సీమ్యాక్స్‌ రిసోర్సెస్‌, సంపర్క్‌ ఇండియా లాజిస్టిక్స్‌, వినిత్‌ మొబైల్‌, ఐసీ ఎలక్ట్రికల్స్‌ ఎస్‌ఎంఈ కేటగిరీలో జూన్‌ 30 నుంచి జులై 2 మధ్య సబ్‌స్క్రిప్షన్‌కు రానున్నాయి.

లిస్టింగ్స్‌ ఇవే..

టర్టిల్‌మింట్‌ ఫిన్‌టెక్‌ సొల్యూషన్స్‌ జూన్‌ 29, వాటర్‌వేస్‌ లీజర్‌ టూరిజం ఐపీఓ, అద్వైత్‌ జువెల్స్‌ జులై 1న, సీఎస్‌ఎం టెక్నాలజీస్‌ జులై 2న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్టింగ్‌కు రానన్నాయి. రియాసత్‌ లైఫ్‌స్టైల్‌, అనుభవ్‌ ప్లాస్టో, శ్రీధర్‌ స్పిన్నర్స్‌, జివైల్‌ ఇండస్ట్రీస్‌, శ్రీ ప్రియాంక జియో కామెక్స్‌, క్రేజీ స్నాక్స్‌ ఐపీఓలు ఎస్‌ఎంఈ కేటగిరీలో వచ్చేవారం లిస్టింగ్‌కు రానున్నాయి.