చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన దిగుమసపల్లె పంచాయతీ బంగారెడ్డిల్లిలో జరిగింది. దామోదరం(30) అనే వ్యక్తి.. తన భార్య నిర్మల(25), కుమారుడు రాజేష్, కుమార్తె శ్రీవిద్యకు విషమిచ్చి, అనంతరం తానూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో కొన్ని రోజులుగా సీఎంసీ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడం, ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండటంతో దామోదరం ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న బీఎన్‌ఆర్‌ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దామోదర్‌.. సూసైడ్‌ నోట్‌లో బ్యాంకు ఏటీఎం కార్డు, ఫోన్‌పే పిన్‌ నెంబర్‌ రాసిపెట్టాడు. అంత్యక్రియలకు తన ఖాతా నుంచే డబ్బులు వాడుకోవాలని లేఖలో పేర్కొన్నాడు.