రాష్ట్రంలోని ఆదివారం పలు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.

ఒంగోలులో కారు బీభత్సం.. ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి..

ప్రకాశం జిల్లా ఒంగోలులో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి చెత్త సేకరణ వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి సైకిల్ పై వెళ్తున్న ఏఆర్ కానిస్టేబుల్‌తో పాటు.. మరో ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మరియదాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఒంగోలు తరలించారు. ప్రమాద సమయంలో కారుని ఓ వైద్య విద్యార్థిని నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఘటనపై ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయ రహదారిపై ప్రమాదం.. ఇద్దరు కూలీల దుర్మరణం

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే  మృతి చెందారు. మృతులు దేవరపల్లి గ్రామానికి చెందిన శ్రీను(39), కడలి రాజేంద్ర (32)గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు..

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక దర్యాప్తు వివరాల మేరకు.. ఓ ట్రావెల్స్ బస్సు శనివారం రాత్రి హన్మకొండ నుంచి తిరుపతి బయలు దేరింది. ఆదివారం తెల్లవారుజామున నంద్యాల జిల్లాలో ఆ బస్సు ప్రమాదానికి గురైంది.నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక దర్యాప్తు వివరాల మేరకు.. ఓ ట్రావెల్స్ బస్సు శనివారం రాత్రి హన్మకొండ నుంచి తిరుపతి బయలు దేరింది. ఆదివారం తెల్లవారుజామున నంద్యాల జిల్లాలో ఆ బస్సు ప్రమాదానికి గురైంది.