రాయలసీమ న్యూస్, క్రైమ్ డెస్క్:
షాబాద్ లో ఆరుగురు దారుణ హత్య
రెండు గంటలపాటు సాగిన నరమేధం.. ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు వెల్లడించిన ప్రాథమిక వివరాలు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ ఘటన రాత్రి సుమారు 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట మధ్య జరిగినట్లు భావిస్తున్నారు. నిందితుడి కోసం ప్రస్తుతం ఐదు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం, నిందితుడు రాజు కుమార్ (28) తన భార్య, ఇద్దరు చిన్నారులతో పాటు తనపై గతంలో పోక్సో కేసు నమోదు చేసిన 17 ఏళ్ల బాలిక, ఆమె తల్లి, నానమ్మలను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
రెండు ప్రాంతాల్లో హత్యలు
పోలీసుల సమాచారం ప్రకారం, నిందితుడు రాజు కుమార్ (28) మొదట తన ఇంట్లో నిద్రిస్తున్న భార్య పార్వతి సరిత (30), కుమారులు పరీక్షిత్ (3), దైవిక్షిత్ (2)లను కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం పోక్సో కేసులో బాధితురాలైన 17 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లి, అక్కడ ఆమె తల్లి చిట్యాల లక్ష్మీ (45), నానమ్మ చిట్యాల రుక్కమ్మ (65)లను హత్య చేసినట్లు అధికారులు తెలిపారు. తదుపరి బాలికను గ్రామ శివారులోని చెరువు వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
ముందుగా మైనర్ బాలికను తీసుకెళ్లి
దర్యాప్తు అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం నిందితుడు రాజ్ కుమార్ ముందుగా ప్రియురాలైన మైనర్ బాలిక ఇంటికి వచ్చి 11 గంటల ప్రాంతంలో మైనర్ బాలికను కారులో బలవంతంగా తీసుకొని వెళ్లాడు. బయటికి వెళ్ళి వద్దామని చెప్పి మైనర్ బాలికను మభ్యపెట్టి కారులో ఎక్కించుకొని వెళ్లాడు. మైనర్ బాలిక అమ్మమ్మ నాయనమ్మ ఇద్దరు వారించినప్పటికీ ఇప్పుడే వస్తామంటూ బాలికను బయటికి తీసుకెళ్లాడు నిందితుడు.
మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్దకు బాలికను తీసుకెళ్లి రాజకుమార్.. బాలికపై అఘాయిత్యం చేసి గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత అదే కారులో బాలిక ఇంటికి వచ్చిన రాజకుమార్.. ఇంట్లో ఉన్న అమ్మమ్మ నాయనమ్మ రుక్మిణి, లక్ష్మీ లను అతికిరాతికంగా చంపేశాడు. అక్కడినుంచి నేరుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్ళాడు నిందితుడు రాజకుమార్. తన పిల్లల్ని చూడాలని ఉందని భార్యకు ఫోన్ చేశాడు. పిల్లల కోసం వచ్చానని చెప్పడంతో రాజ్ కుమార్ ని ఇంట్లోకి రానిచ్చింది భార్య.
అనంతరం తన ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లల హత్య
ఇంట్లోకి వెళుతూనే భార్యపై కత్తితో దాడి చేశాడు రాజకుమార్.. వెంటనే అప్రమత్తమైన భార్య రాజ్ కుమార్ నుంచి తప్పించుకునేందుకు బయట వరకు పరుగులు పెట్టింది. అయినా వదలకుండా భార్యను ఇంట్లోకి తీసుకువచ్చి కిరాతకంగా చంపేశాడు. భార్యను చంపేసిన తర్వాత ఇద్దరు పిల్లల్ని కిరాతకంగా గొంతు కోసి చంపాడు రాజ్ కుమార్.. ఆరుగురిని చంపిన తర్వాత కారులోనే పారిపోయాడు.
ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు
కారులో పారిపోతూ తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడాడు. భార్యా పిల్లలతో పాటు తన ప్రియురాలని వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మని చంపేసిన అని తండ్రికి రాజ్ కుమార్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని తండ్రికి చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రాజకుమార్ పారిపోయాడు. రాజకుమార్ కోసం ఐదు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.







