రాయలసీమ న్యూస్, డివోషనల్ డెస్క్:
గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ (పునరుద్ధరణ) పనులకు మంత్రి నారా లోకేశ్ భూమి పూజ చేశారు. ఈ పనులకు సంబంధించి శిలాఫలకాన్ని శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు. తొలుత అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యాగశాల, ఆలయ ముఖమండపం, గంటా మండపం, వాహనశాలను దేవాదాయశాఖ నిధులు రూ.6.50 కోట్లతో నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఏర్పాటుచేసిన నమూనా చిత్రాలను మంత్రి పరిశీలించారు.







