రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని శాతం వందకు పూర్తి చేసిన నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఘనంగా సన్మానించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఇంటింటికి టీడీపీ – డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారిని అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో శాలువాలతో సత్కరించి అభినందించారు.
12వ క్లస్టర్ పరిధిలోని 20వ డివిజన్‌కు చెందిన 50వ యూనిట్, బూత్, కో-బూత్ ఇన్‌చార్జులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గుర్తుగా శాలువాలు కప్పి, పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయడంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేశారని పేర్కొన్నారు. ప్రజల మధ్యకు వెళ్లి, వారికి ప్రభుత్వం చేస్తున్న సేవలను వివరించడంతో పాటు, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం కీలక పాత్ర పోషించిందని తెలిపారు.
క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రతి నాయకుడు, కార్యకర్త పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని శాతం వందకు పూర్తి చేసిన నాయకులు, కార్యకర్తలు పార్టీ పట్ల తమకున్న నిబద్ధతను మరోసారి చాటుకున్నారని అభినందించారు.
పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం తప్పకుండా ఉంటుందని, ప్రజలతో మమేకమై నిరంతరం పనిచేసే కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన బలమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత చేరువగా పనిచేస్తూ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యూనిట్, డివిజన్, బూత్, కో-బూత్ ఇన్‌చార్జులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.













