రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: గ్లామరస్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్స్‌లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి రెజీనా కసాండ్రా ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలతో నెట్టింట చర్చనీయాంశంగా మారారు. సుందర్ సి దర్శకత్వంలో, నయనతార ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మూకుత్తి అమ్మన్-2’ చిత్రంలో రెజీనా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న వ్యక్తిగత అనుభవాలు నెటిజన్లను కలచివేస్తున్నాయి.
ఆ ఇంటర్వ్యూలో రెజీనా తన జీవితంలోని ఒక చీకటి కోణాన్ని బయటపెట్టారు. 2020లో తన ప్రేమబంధం ముగిసిందని, ఆ సమయంలో ఎదుర్కొన్న నమ్మకద్రోహం తనను తీవ్రంగా కలిచివేసిందని వెల్లడించారు. నమ్మినవాళ్లే మోసం చేయడంతో మానసికంగా పూర్తిగా కుంగిపోయిన పరిస్థితిని వివరించారు. ఆ బాధ నుంచి బయటపడటం తనకు చాలా పెద్ద సవాలుగా మారిందని, ఎంతో తీవ్రమైన మానసిక సంఘర్షణను అనుభవించాల్సి వచ్చిందని ఆమె చెప్పిన విషయాలు ఇంటర్వ్యూలో వెలుగులోకి వచ్చాయి.
ఆ పీడకలలాంటిన రోజుల తర్వాత రెజీనా ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రేమ, పెళ్లి వంటి బంధాలకు కొంతకాలం పాటు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. తనను తాను ప్రేమించుకోవడం, తన సొంత వ్యక్తిత్వంపై దృష్టి పెట్టడం ప్రారంభించినట్టు చెప్పారు. ఆ మానసిక వేదన నుంచి కోలుకోవడానికి తగినంత సమయం తీసుకుని, మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో కెరీర్‌పై దృష్టి సారించినట్టు రెజీనా వివరించారు.
ప్రస్తుతం తన ప్రపంచం మొత్తం సినిమాలేనని, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించడమే లక్ష్యమని ఆమె స్పష్టం చేసినట్టు ఇంటర్వ్యూలో వెల్లడైంది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన దెబ్బకు కుంగిపోకుండా, మళ్లీ తన కాళ్లపై తాను నిలబడి కెరీర్లో ముందుకు సాగుతున్న రెజీనా ధైర్యాన్ని అభిమానులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా అనేక కామెంట్లు, పోస్ట్‌లు వెలువడుతున్నాయి.







