మిసైల్‌ వద్దు.. కరెంట్‌ చాలు:అమెరికా లేటెస్ట్‌ టెక్నిక్‌

ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా తన అమ్ములపొదిలోని అత్యంత విధ్వంసకర, అపార సాంకేతిక పరిజ్ఞానాన్ని రణరంగం లోకి దించింది. ఇరాన్‌ దాడులను తిప్పికొట్టేందుకు, ముఖ్యంగా కీలకమైన హర్మూజ్‌ జలసంధి ప్రాంతంలో శత్రు దేశాల క్రూజ్‌ క్షిపణులు, డ్రోన్ల విధ్వంసానికి అమెరికా అత్యంత లేజర్‌ ఆయుధా లను ఉపయోగిస్తోంది. క్షిపణి వ్యవస్థలకు చెక్‌ పెడుతూ.... కేవలం ఒకే ఒక్క లేజర్‌ షాట్‌తో శత్రువల డ్రోన్లను బూడిద చేస్తున్న ఆ కథనం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. మరిన్ని సంచలనాత్మ క వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఈ లేజర్‌ వెపన్‌ ప్రాజెక్టులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... కోట్ల విలువైన ఈ హైటెక్‌ ఆయుధాలను ఆపరేట్‌ చేయడానికి అమెరికా సైన్యం దేనిని ఉపయోగిస్తోందో తెలుసా.? మనం ఇళ్లల్లో వీడియో గేమ్స్‌ ఆడే ఎక్స్‌బాక్స్‌ గేమ్‌ కన్సోల్‌ కంట్రోలర్‌ను.! అవును., మీరు విన్నది నిజమే. సాధారణ గేమింగ్‌ కంట్రోలర్‌కి కొద్దిపాటి మార్పులు చేసి... కోట్ల విలువైన లేజర్‌ సిస్టమ్‌ను సైనికులు పర్యవేక్షిస్తున్నారు. ఈ డెవలప్‌మెంట్‌ కోసం అమెరికా సుమారు 500 మిలయన్‌ డాలర్లు వెచ్చినట్లు సమాచారం. సాధారణంగా ఒక క్రూజ్‌ మిసైల్‌ను లేదా అధునాతన డ్రోన్‌ను కూల్చాలం టే అంతే ఖరీదైన సంప్రదాయ క్షిపణిని ప్రయోగించాలి. దీనికి లక్షల డాలర్లు ఖర్చవుతుంది. కానీ., ఈ లేజర్‌ ఆయుధాల ద్వారా ఒక్కో దాడికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ప్రస్తుతానికి ఈ ఆయు ధాలను కేవలం యుద్ధ నౌకలపై మాత్రమే, డ్రోన్లు, క్షిపణుల కూల్చివేతకు ఉపయోగిస్తున్నారు తప్ప మానవ లక్ష్యాలపై ప్రయోగించలేదు.

హర్మూజ్‌ జలసంధి... ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమాన మార్గం. ఇక్కడ అమెరికా యుద్ధ నౌకలు, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లకు అగ్రరాజ్యం లేజర్‌ ఆయుధాలతో సమాధానం ఇస్తోంది. అమెరికా సైనిక వర్గాలు, అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం... ఇప్పటికే హర్మూజ్‌ వద్ద ఈ లేజర్‌ వెపన్స్‌ ద్వారా అనేక క్రూజ్‌ క్షిపణులను, శత్రు డ్రోన్లను అమెరికా బలగాలు సమర్థవంతంగా కూల్చివేశాయి. లక్షల డాలర్ల విలు వైన యాంటీ-మిసైల్‌ క్షిపణులను వాడాల్సిన అవసరం లేకుండా, తక్కువ ఖర్చుతోనే అకాశంలోనే శత్రు లక్ష్యాలను గుర్తుపట్టి, అత్యంత కచ్చితత్వంతో వాటిని ఇక్కడే ధ్వంసం చేస్తున్నారు.

అసలు ఈ లేజర్‌ ఆయుధాలు ఎలా పనిచేస్తాయి.? యాంటీ-డ్రోన్‌ లేదా యాంటీ-మిసైల్‌ వ్యవస్థలతో పోలిస్తే వీటిలో ఎటువంటి భౌతిక ఇంటర్‌సెప్టర్లు అంటే బాంబులు లేదా మిసైళ్లు ఉండవు . ఈ పరికరాలు జనరేటర్లు లేదా శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌ల నుంచి విద్యుత్‌ గ్రహించి, దానిని తీవ్రమైన కాంతి కణాలు అంటే ఫోటాన్లుగా మారుస్తాయి. ఇలా కేంద్రీకరించబడిన లేజర్‌ కాంతి కిరణం క్షణాల వ్వవధిలో శత్రు డ్రోన్ లేదా మిసైల్‌ ఉపరితలంపై పడగానే, తీవ్రమైన వేడి పుట్టుకొచ్చి ఆ లక్ష్యం గాల్లోనే కాలిపోతుంది లేదా పేలిపోతుంది. అమెరికా ఈ లేజర్‌ సాంకేతికపై గత 50 ఏళ్లు గా నిరంతర పరిశోధనలు చేస్తోంది. రక్షణ రంగ నిపుణుల అంచనా ప్రకారం... ఈ లేజర్‌ వెపన్‌ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, భవిష్యత్తులో ప్రపంచ దేశాలు ఆయుధ నిల్వలు లేదా మందుగుండు సామాగ్రి కొరత గురించి భయపడాల్సిన అవసరమే ఉండదు. విద్యుత్‌ ఉన్నం తవరకు ఈ లేజర్‌ వెపన్స్‌ అపరిమితంగా పనిచేస్తూనే ఉంటాయి. అయితే., హర్మూజ్‌ వద్ద యుద్ధ భూమిలో ఈ లేజర్‌ ఆయుధాల ప్రత్యక్ష వాడకంపై ట్రంప్‌ యంత్రాంగం నుంచి అధికారిక ధ్రువీకర ణ రావాల్సి ఉంటుంది. రక్షణ రంగంలో ఈ లేజర్‌ అస్త్రాలు ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలు కుతున్నాయని స్పష్టమవుతోంది.

పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ మేఘాలు రోజురోజుకూ మరింత దట్టంగా మారుతు న్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి, చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గమై న హర్మూజ్‌ జలసంధి వద్ద పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. ఈ వ్యూహాత్మక జలమా ర్గం గుండా ప్రయాణించే అమెరికా యుద్ధనౌకలను, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ శ్రేణులు నిరంతరం డ్రోన్లు, క్రూజ్‌ క్షిపణులను ప్రయోగిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ముప్పు ను ఎదుర్కొనేందుకు అమెరికా సైన్యం సరికొత్త మిలటరీ సాంకేతికతకు పదును పెట్టింది. హర్మూజ్‌ వద్దకు దుసుకొస్తున్న శత్రు దేశపు డ్రోన్లు, క్షిపణులను ఆకాశంలోనే గుర్తించి ధ్వంసం చేసేందుకు తన వద్ద ఉన్న అత్యాధునిక లేజర్‌ వెపన్‌ సిస్టమ్స్‌ను అమెరికా నావికాదళం విరివిరిగా వాడుతున్న ట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి. క్షిపణి నిరోధక వ్యవస్థల కంటే వేగంగా, అత్యంత ఖచ్చితత్వంతో ఇవి పని చేస్తున్నాయని సైనిక వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అంతర్జాతీయ రక్షణ వ్యూహాలలో ఈ లేజర్‌ ఆయుధాల ప్రవేశం అతిపెద్ద ఆర్థిక విప్లవాన్ని తెస్తోంది. ఉదాహరణకు, ఇరాన్‌ మిలటరీ వాడే ఒక్కో అత్మహుతి డ్రోన్‌ తయారీ ఖర్చు కేవలం 20వేల నుంచి 50వేల డాలర్లు మాత్రమే ఉంటుంది. కానీ., దానిని గాల్లో కూల్చడానికి అమెరికా ప్రయోగించే ఒక్కో ఇంటర్‌సెప్టర్‌ మిసైల్‌ ఖర్చు ఏకంగా 1 నుంచి 2 మిలయన్‌ డాలర్లు... అంటే 8 నుంచి 16 కోట్లు రూపాయాలు దాటుతోంది. శత్రువు విసిరిన చౌకబారు డ్రోన్‌ ఆపడానికి కోట్ల విలు వైన మిసైల్‌ను ప్రయోగించడం రక్షణ బడ్జట్‌పై తీవ్రమైన భారాన్ని మోపుతోంది. కానీ., లేజర్‌ ఆయు ధాల విషయానికి వస్తే కథ పూర్తిగా మారుతుంది.! లేజర్‌ ఆయుధం ద్వారా ఒక డ్రోన్‌ కూల్చడానికి అయ్యే ఖర్చు కేవలం దానికి అవసరమయ్యే విద్యుత్‌ లేదా ఇంధన ఖర్చు మాత్రమే..ఒక్కో షాట్‌కు కేవలం 1 డాలర్‌ నుంచి 10 డాలర్లు... అంటే 100 నుంచి 800 రూపాయలు మాత్రమే అవుతుంది. దీనికి తోడు యుద్ధనౌకల్లో క్షిపణుల నిల్వ పరిమితంగా ఉంటుంది. మిసైళ్లు అయిపోతే నౌక మళ్లీ తీరానికి రావాల్సి ఉంటుంది.

ఈ లేజర్‌ అస్త్రాలు అత్యంత విధ్వంసకరమైన ప్రభావం చూపించినప్పటికీ, అంతర్జాతీయ చట్టాల ప్రకారం వీటి వినియోగానికి కొన్ని కచ్చితమైన సరిహద్దులు ఉన్నాయి. ఇప్పటివరకు అమెరికా నావికాదళం ఈ లేజర్‌ వ్యవస్థలను కేవలం నావికాదళ యుద్ధనౌకలపై అమర్చి, మానవ రహిత లక్ష్యాలైన డ్రోన్లు, క్షిపణులు స్పీడ్‌ బోట్లపై మాత్రమే ప్రయోగించింది. జెనీవా కన్వెన్షన్‌ నిబం ధనల ప్రకారం.. ఈ రకమైన కాంతి అస్త్రాలను ప్రత్యక్షంగా మానవ లక్ష్యాలపై లేదా సైనికులపై ప్రయోగించి వారిని అంధులుగా చేయడం లేదా శరీర భాగాలను కాల్చడం అంతర్జాతీయ మానవ తా చట్టాలకు విరుద్ధం. అయినప్పటికీ, వాతావరణంలో మబ్బులు, దట్టమైన పొగమంచు లేదా తుఫాన్లు ఉన్నప్పుడు ఈ లేజర్‌ కిరణాల తీవ్రత తగ్గే అవకాశం ఉండటంతో.. అమెరికా వీటిని సంప్ర దాయ క్షిపణులతో కలిపి హైబ్రిడ్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌గా వాడుతోంది. ప్రస్తుతం హర్మూజ్‌ వద్ద సాధించిన విజయాల ఆధారంగా ఈ సాంకేతికతను మరిన్ని యుద్ధనౌకలకు విస్తరించాలని పెంటగాన్‌ యోచి స్తోంది.

మరోవైపు, అమెరికా దారిలోనే చైనా, రష్యా, ఇజ్రాయెల్‌ కూడా తన సొంత లేజర్‌ వెపన్‌ సిస్టమ్స్‌ అభివృద్ధిని వేగవంతం చేశాయి. సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాల్లో మాత్రమే మనం చూసిన లేజర్‌ యుద్ధాలు ఇప్పుడు హర్మూజ్‌ జలసంధి కేంద్రంగా నిజరూపం దాల్చడం భివిష్యత్తు అంతర్జాతీయ రాజకీయాలను, యుద్ధ తంత్రాలను మూలాల నుంచి మార్చబోతోందని స్పష్టమవుతోంది.