రాయలసీమ న్యూస్, జాబ్స్ డెస్క్: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్ జీసీ) జియాలజిస్ట్, ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు ఈ1 లెవెల్‌లో జరగనున్నాయని సంస్థ ప్రకటించింది.
ఓఎన్ జీసీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం జియాలజిస్ట్, ఇంజినీర్ (ఈ1 లెవెల్) కేటగిరీల్లో మొత్తం 52 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
అదే విధంగా సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఎంఎస్సీ లేదా ఎం.టెక్ పూర్తిచేసిన వారు అర్హులుగా పరిగణించబడతారు. విద్యార్హతలతో పాటు వయోపరిమితి ప్రమాణాలు కూడా నిర్దేశించారు. సాధారణ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 27 ఏళ్లుగా నిర్ణయించారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదేళ్లు, ఓబీసీ వర్గానికి మూడేళ్లు, పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు పదేళ్లు సడలింపు కల్పించనున్నట్లు ఓఎన్ జీసీ తెలిపింది. ఈ సడలింపులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.
ఈ నియామకాలకు దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. అప్లికేషన్ ప్రక్రియ జులై 17 నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు జులై 31లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ గడువు తర్వాత సమర్పించిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరని సంస్థ స్పష్టం చేసింది.
అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా జరుగుతుంది. ముందుగా నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. అనంతరం మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని తుది ఎంపిక జాబితాలో చేర్చనున్నారు.
నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఖాళీల విభజన, వయోపరిమితి, వేతన శ్రేణి, పరీక్ష విధానం, సిలబస్ తదితర సమాచారం కోసం అభ్యర్థులు ఓఎన్ జీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
మరిన్ని వివరాలు, ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పణ కోసం అభ్యర్థులు www.ongcindia.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఓఎన్ జీసీ సూచించింది.







