రాయలసీమ న్యూస్, జాబ్స్ డెస్క్: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 4098 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా జూనియర్ ఇంజనీర్ , డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ , కెమికల్ అండ్ మేతల్లూరుజికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ తదితర అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 14 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 13 వరకు కొనసాగుతుంది.
ఈ నియామకాలకు వయోపరిమితిని 18 నుంచి 33 ఏళ్లుగా నిర్ణయించారు. అర్హతలు, వయోపరిమితి సడలింపులు, వర్గాల వారీగా ఖాళీల వివరాలు, ఎంపిక విధానం, పరీక్షా నమూనా, సిలబస్ తదితర పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ, ఫీజు, అవసరమైన పత్రాలు, ఆన్‌లైన్ నమోదు విధానం వంటి వివరాలు కూడా అదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, తాము అర్హులేనా అనే విషయాన్ని ఖచ్చితంగా పరిశీలించుకోవాలని సూచించారు.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ www.rrbapply.gov.inను సందర్శించాలి.






