రైల్వేలో భారీ టెక్నీషియన్ ఉద్యోగాలు: 6,557 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోనల్ రైల్వేస్ , ప్రొడక్షన్ యూనిట్స్ ల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ (RRBs) సెంట్రలైజడ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,557 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ -I (Signal)తో పాటు 24 విభిన్న కేటగిరీలకు చెందిన టెక్నీషియన్ గ్రేడ్ -III పోస్టులు ఉన్నాయి.

అర్హులైన అభ్యర్థులు అధికారిక RRB వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ప్రక్రియ జూన్ 30, 2026న ప్రారంభమైంది. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జూలై 29, 2026గా నిర్ణయించారు.

మొత్తం ఖాళీలు 6,557గా ఉండగా, కేటగిరీ వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి: Unreserved 2,728, OBC 1,565, SC 1,009, EWS 658, ST 597, Ex-servicemen 661. టెక్నీషియన్ గ్రేడ్ -I (Signal) పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్ , ఎలక్ట్రానిక్స్ , కంప్యూటర్ సైన్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో B.Sc ఉత్తీర్ణత అవసరం. లేదా సంబంధిత స్ట్రీమ్స్ లో మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా లేదా B.E/B.Tech పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులు.

టెక్నీషియన్ గ్రేడ్ -III (Signal) పోస్టులకు గుర్తింపు పొందిన Board నుంచి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు NCVT/SCVT నుంచి ITIలో ఉత్తీర్ణత ఉండాలి. లేదా 10వ తరగతితో పాటు సంబంధిత Tradeలో కోర్స్ కంప్లీటెడ్ ఆక్ట్ Apprenticeship (CCAA) పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి విషయంలో టెక్నీషియన్ గ్రేడ్ -I(Signal) పోస్టులకు 18 నుంచి 33సంవత్సరాల మధ్య,టెక్నీషియన్ గ్రేడ్ -III (Signal) పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBCలకు మూడు సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు పది సంవత్సరాల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. Ex-servicemen అభ్యర్థుల విషయంలో వారి ప్రస్తుత వయస్సు నుంచి సైన్యంలో అందించిన సేవా కాలాన్ని మినహాయించిన తర్వాత, వారి కేటగిరీకి అనుగుణంగా అదనపు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. Unreserved/ జనరల్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.500గా, SC, ST, Ex-servicemen, PwBD, మహిళలు, ట్రాన్సజెండర్స్ , మైనారిటీస్ , EBCలకు రూ.250గా నిర్ణయించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) రాసిన అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజును రీఫండ్ చేయనున్నారు.

ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ ఎక్సమినేషన్ ఉంటాయి. CBT ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించే రాతపరీక్షగా, పూర్తిగా Multiple ఛాయస్ ఆబ్జెక్టివ్ ప్రశ్నల రూపంలో ఉంటుంది. Grade-I, Grade-III పోస్టులకు విడివిడిగా వేర్వేరు సిలబస్‌తో పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉండగా, ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష సమయం 90 నిమిషాలు. నెగటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉండి, ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కు కోత విధిస్తారు.

అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ rrb.indianrailways.gov.inను సందర్శించి, సంబంధిత RRB నోటిఫికేషన్, అర్హతలు, సిలబస్, అప్లికేషన్ విధానం వంటి సమాచారాన్ని పరిశీలించాలి.