రాయలసీమ న్యూస్, కర్నూలు: బేతంచెర్ల: మండల పరిధిలోని సిమెంట్‌నగర్ గ్రామానికి చెందిన ఓ ఇంటర్ విద్యా ర్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు.. ధనుంజయ, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె సుప్రియ (17) ఆదోని మండలంలోని ఆరెకల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రు లు వివాహసంబంధాలు చూస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురై సుప్రియ ఇంటిపైన ఉన్న గదిలో ఫ్యానుకు చీరెతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇంటర్ విద్యార్థిని సుప్రియ ఆత్మహత్య… తల్లిదండ్రుల పెళ్లి ఏర్పాట్లపై మనస్తాపం
రాయలసీమ న్యూస్ - కర్నూలు
1 నిమిషాల చదువు
105 views
బేతంచెర్ల: మండల పరిధిలోని సిమెంట్‌నగర్ గ్రామానికి చెందిన ఓ ఇంటర్ విద్యా ర్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు.. ధనుంజయ, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె సుప్రియ (17) ఆదోని మండలంలోని ఆరెకల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్నారు.
- రాయలసీమ న్యూస్ - కర్నూలు, ఆదోని
▸ తాజా కర్నూలు జిల్లా వార్తలు మరియు తెలుగు వార్తలు చదవండి.
Published : 02 Jun 2026, 18:51 IST
గమనిక: ఈ కథనంలోని అభిప్రాయాలు, వ్యాఖ్యలు సంబంధిత వ్యక్తులవి. ప్రకటనలు/వాణిజ్య సమాచారం విషయంలో పాఠకులు తగిన జాగ్రత్త వహించాలి; వాటి నాణ్యత లేదా లోపాలకు రాయలసీమ న్యూస్ యాజమాన్యం బాధ్యత వహించదు. సవరణల కోసం సవరణల విధానం చూడండి.












