రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్భణీ జిల్లా యశ్వాడీ గ్రామంలోని హనుమాన్ ఆలయ మండపం పైకప్పు కూలిపోయింది (Temple slab collapses). దాంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన పలువురిని స్థానికులు, పోలీసులు బయటకు తీశారు.
శనివారం కావడంతో ఉదయం నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. రద్దీ ఎక్కువకావడంతో మండపం పైకప్పులో కొంతభాగం, పిల్లర్ కూలిపోయింది. ఆ మండపం నిర్మాణంలో ఉండటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఆకస్మిక ఘటనతో భక్తులంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. శిథిలాల కింద చిక్కుకొన్న 25 మంది భక్తులను బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.







