రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
సింగపూర్‌కు సీఎం చంద్రబాబు
రెండు రోజుల అధికారిక పర్యటన
అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల అధికారిక పర్యటన కోసం నేడు సింగపూర్‌కు వెళ్లుతున్నారు. ఆదివారం ఉదయం 11.35 గంటలకు ఆయన బెంగళూరు నుంచి సింగపూర్‌కు బయల్దేరనున్నారు. ఈ పర్యటనలో 15, 16వ తేదీల్లో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
సోమవారం ఉదయం 10.30 గంటలకు సింగపూర్‌లో భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. అదే రోజు స్టార్టప్ వెంచర్ కేపిటలిస్టులతో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. అనంతరం యూఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్‌బాచ్‌తో విందు సమావేశానికి హాజరవుతారు.
సింగపూర్ సీనియర్ మంత్రి లో యెన్ లింగ్‌తో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. తర్వాత గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు కరణ్ భజ్వాతో సమావేశం కానున్నారు. జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్‌తో కూడా చంద్రబాబు సమావేశం అవుతారు.
వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్‌తో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యెంగ్ చెయ్‌తో సమావేశం ఉంటుంది. అనంతరం సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, సింగపూర్ విదేశాంగ మంత్రి బాలకృష్ణన్, హోం మంత్రి కె. షణ్ముగమ్, హెచ్‌ఆర్డీ మంత్రి టాన్‌సీ లెంగ్‌లతో వరుస భేటీల్లో పాల్గొంటారు.
సీఐఐ ఏపీ ప్రతినిధి బృందంతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేవమవుతారు. మంగళవారం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించే “సీబీఎన్ ఎట్‌దరేట్ ఆఫ్ 361” కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం సుర్బానా జురాంగ్ – అమరావతి ప్లానింగ్ సమావేశానికి హాజరవుతారు.
తర్వాత సింగపూర్ ఉప ప్రధాని, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్ బృందంతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఆ తర్వాత వరల్డ్ సిటీస్ సమ్మిట్ లీడర్షిప్ ప్లీనరీలో పాల్గొంటారు. సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్‌షోలో కూడా ఆయన పాల్గొననున్నారు.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, మున్సిపల్ శాఖ కార్యదర్శి సురేశ్ తదితరులు వెళుతున్నారు. సీఎం బృందం 16వ తేదీ రాత్రి 10 గంటలకు స్వదేశానికి తిరిగి రానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.







