రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ముగిశాయి. 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తంగా 39 పతకాలతో పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. నాలుగేళ్ల తర్వాత జరిగే తదుపరి క్రీడలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా 2030 కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి.
క్లోజింగ్ సెర్మనీ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వచ్చే కామన్వెల్త్ గేమ్స్ అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. ఈ క్రమంలో కామన్వెల్త్ ఫ్లాగ్ - బాటన్‌ను భారత్ తరఫున నీరజ్ చోప్రా స్వీకరించాడు. ముగింపు సంబరాలు, ఫ్లాగ్ అప్పగింత కార్యక్రమం ఘనంగా జరిగాయి. గేమ్స్ బాటన్‌ను భారత్ బృందం స్వీకరించింది. భారత్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉషా, గుజరాత్ ఉపముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వితో కలిసి జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా అందుకొన్నాడు. 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇక ఆతిథ్య దేశం మారడాన్ని సూచిస్తూ కామన్వెల్త్ గేమ్స్ ఫ్లాగ్‌ను స్టేడియం అంతటా కలియతిప్పారు. క్రీడల అధికారిక బదిలీ కార్యక్రమం కవాతుతో ప్రారంభమైంది. ఆ ఫ్లాగ్‌ను కామన్వెల్త్ గేమ్స్ స్కాట్లాండ్ వైస్ ఛైర్మన్ సుసాన్ జాక్‌సన్, స్కాటిష్ నెట్ బాలర్ ఎమిలే నికోల్, కామన్వెల్త్ స్పోర్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ డొనాల్డ్ రుకారెకు గ్లాస్గో లార్డ్ ప్రొవోస్ట్ జాక్వెలిన్ మెక్‌లారెన్ అందించారు. వారి చేతుల మీదుగా నీరజ్ చోప్రా, పీటీ ఉషా, హర్ష్ సింఘ్వి స్వీకరించారు. దీంతో 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్యాన్ని స్కాట్లాండ్ నుంచి భారత్‌కు బదిలీ అయినట్లే.
ఇండో-స్కాటిష్ సాంస్కృతిక మార్పిడి
ముగింపు వేడుకల సందర్భంగా ఓ అద్భుతమైన ఘట్టం ఆవిష్క్రతమైంది. ఒకే వేదికపై భారత్, స్కాట్లాండ్ (India - Scotland)కు చెందిన సాంప్రదాయ నృత్యప్రదర్శనలు జరిగాయి. జాస్మైన్ భారత పతాకాన్ని మోసుకురాగా.. ఆమె వెంట మన అథ్లెట్లు వచ్చారు. ‘వసుదైక కుటుంబం’ (ద వరల్డ్ వన్ ఫ్యామిలీ) స్లోగన్‌తో ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ‘వందే మాతరం’ నినాదంతో హోరెత్తిపోయింది. శంకర్ మహదేవన్, మానుషి ఛిల్లార్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. భారత క్రీడా ప్రయాణాన్ని వివరిస్తూ, గుజరాత్ వారసత్వం, ఆవిష్కరణ, ఆధునిక ఆకాంక్షల సమ్మేళనాన్ని హైలైట్ చేస్తూ అహ్మదాబాద్‌ను పరిచయం చేస్తూ నిర్మించిన లఘు చిత్రం ప్రేక్షకులకు కనువిందు చేసింది.







